గుడిపాటి వెంకటచలం గారు టైం ట్రావెల్ లాంటి కథ ఒకటి రాశారంటే ఆశ్చర్యం.
ఒకాయన జులూలాండ్ అనే చోట రాయబారిగా పని చేసి తిరిగి వస్తాడు.
నిజానికి అక్కడి వారికి ఇండియా అని ఒక దేశం ఉందా అని అనుమానం వస్తుంది కథ
మొదట్లో.
మరి అక్కడ ఆయన రాయబారిగా ఏం చేశాడని అడగ కూడదు.
కథ చివర్లోని కాస్త భాగం చదివితే మాత్రం ఆయన చెప్పదలుచుకున్నదేమిటో కొంచం
అర్థమవుతుంది.
చదవండి మరి.....
భోజనమైనాక వరండాలో కూచున్నాము నేనూ మా బావా. కొత్త మార్పుల్ని గురించి
చెపుతున్నాడు దిగులుగా. కుర్రాడు కూచున్నాడు రోడ్డుకేసి చూస్తో. ఇంతలో ఒకాయన
వచ్చాడు. ఆయన ఈ ఊరికంతటికీ అధికారి. కొత్తగా నేను వచ్చాను గనుక నా సంగతి
రాసుకోడానికి వచ్చాడు. దేశానికి వచ్చిన ఈ మార్పు సంగతి చాలా సేపు
మాట్లాడుకున్నాము. పూర్వకాలం ఉండే శారీరక మానసిక వ్యాధులు చాలా వరకు తగ్గాయి. ఈర్ష్యలూ,
పోటీలు, ముందు ఎట్లా బతకడమనే భయం, పిల్లలేమవుతారనే ఆదుర్దా, ధనార్జన, ధనం
కూడబెట్టడం, ఆస్తి సంపాయించడం ఇటువంటి బాధలన్నీ పోయినాయి నిశ్చయంగా. అధికారులకి
బానిసత్వం, ప్రభుత్వభయం, నీచత్వం, మోసం మొదలైనవి లేనేలేవు.
“అంటే రామరాజ్యం –
భూలోక స్వర్గమన్న మాట” అన్నాను
“ఊ” అని మూలిగాడు.
“ఏం” అన్నాను
“స్వర్గం కూడా
ఇట్లానే ఉంటుందేమోనని భయం” అన్నాడు మా బావ.
‘ఏమీ? అదే కాదా మనం కలలుగన్నది? మతాలన్నీ ఆశ పెట్టింది? నిరంతర శాంతి. ఈ
భూమి మీద జీవితపు జ్వరం తరవాత ఆ లోకంలో
శాంతి అనేకద! ఆ శాంతి ఇక్కడే కలిగితే ఇంకేం కావాలి?”
“అవును. ఇక్కడ ఈ
లోకంలో అశాంతి, తీరని కోర్కెలూ ఉన్నంతకాలం, అవన్నీ ఆ లోకంలో ఉండవనీ సత్యం, శాంతి,
సౌఖ్యం, ఇవన్నీ అక్కడ ఉంటాయనీ కలలు కన్నాము. కానీ అవన్నీ ఈ లోకంలోనే లభ్యమైతే,
కలలుగనడానికి ఇంకేమీ మిగలలేదు.”
“నేను చూసిందేమంటే,
ఇంత శాంతి, ధర్మం ఏర్పడినా మనుషుల్లో ఉత్సాహం, కళా కనపడవేం? ఏదో నిద్రపోతున్నట్టూ, ఏం చాతగాక అటూఇటూ వెతుకుతున్నట్టూ పదేళ్లమట్టి పంజరంలో
బతుకుతున్న పిట్టల్లాగ కనపడతారేం మనుషులు ఎంత కాలం నుంచి కలలుగన్నాం ఈ శాంతి కోసం?”
“కాని పని భారం.
పొద్దస్తమానం పని”
“ఎక్కువ పని ఉన్నట్టులేదు” అన్నాను.
“లేదు. కాని ఉన్న
పని భారం. పనిలోనుంచి పని తప్పించుకునే అశ ఉండాలి. గానుగ ఎద్దులాగ బతుకంతా ఇదే పని
అనుకుంటే, పని భారమవుతుంది. .......”
మానవ స్వభావం విచిత్రం. దానిని అంకెలలోకీ, ఫార్ములాలకీ మార్చి యోచించడం బుద్ది
తక్కువ. పని కావాలి. పనీ అక్కర లేదు. ఇప్పుడు మనిషికి పని తక్కువ పని కావాలని
ఉంటుంది. కాని ఉన్న పని భారం.
ఇంతకూ ఈ కథ పేరు 1690 అనో 1960 అనో ఉండాలి.
తెలుగు అంకెల్లో రాశారు. ఎవరికి తెలుస్తాయి ఆ అంకెలూ