Showing posts with label కథ. Show all posts
Showing posts with label కథ. Show all posts

Sunday, September 18, 2016

కథ చెపుతాను.. ఊ కొడతావా

వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. - ఎవరన్నారో తెలియదు.
* * *

చాలామంది కథలు రాస్తారు. కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి. పురాణం అన్నా, హరికథ అన్నా కథ చెప్పడమే. ఇక జానపద పద్ధతిలో జముకుల కథ, బయిండ్ల కథ, బుర్రకథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకుని దాన్ని నోటికి నేర్చుకుని చెప్పే పద్ధతి లేనే లేదు. చుక్క సత్తయ్య ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకు నమస్కారం. ఎన్ని కథలు చెపుతావు అని అడిగితే దండకంలాగ బోలెడన్ని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు. వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతప్రతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సత్తయ్యకే కాదు, జానపద కథలు చప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్టు ఉండదు. వాళ్లకు కథ తెలుస్తుంది. గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు. పురాణానికి పుస్తకం ఉంటుంది. హరికథకు కొంతవరకు ఒక రాత ప్రతి ఉంటుంది. కనీసం పాటలకయినా ప్రతి ఉంటుంది. మాటలకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది.

మా ఇంట్లో బుడ్డన్న పనిచేసేవాడు. పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు. వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు. అవసరం కొద్దీ మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు రోజు కూలీకి వస్తారు. బుడ్డన్న మాత్రం సంవత్సరమంతా మాతోనే ఉంటాడు. అట్లా అతను కొన్ని సంవత్సరాలపాటు మాతో ఉన్నాడు. నేను ప్రేమగా ‘బుడ్డడు’ అని పిలుచుకునే మా బుడ్డన్న గొప్ప గాయకుడు. ఆ సంగతి వానికి తెలియదు. ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు. రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి, దాన్ని లలిత సంగీతం వాళ్లచేత పాడించడం అప్పట్లో పద్ధతి. అది అన్యాయమని నాకు తరువాత అర్థమయింది. ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు బుడ్డన్న గుర్తుకు వస్తాడు. అయితే బుడ్డన్న గురించి చెపితే శాఖా సంక్రమణం అవుతుంది. నిజానికి వాని తమ్ముడు అడివన్న. వాడు నాకంటే వయసులో చిన్నవాడు. కనుక నాకు వాడు దోస్తు. వాడు మా పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు నాతో కబుర్లతో గడిపేవాడు. వాడు కథల పుట్ట. ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్లకు నీళ్లొస్తాయి. నీళ్లెందుకు? పాపం అడివన్న ఇప్పుడు లేడు. వాడు ఉంటే కూచోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు, పత్రికలకు వాడి పేరుననే ఎక్కించేవాడిని కాదా? అది నా బాధ. అది ఇప్పుడు వీలుకాదు.

నేను కథలు రాయకూడదని నిర్ణయించు కున్నాను. వ్యాసాలు, అందునా సైన్స్ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం. అయినా సరే, ఆ వ్యాసాలలో నా రాత తీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఆ తరువాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది, అర్థమయింది కూడా. మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెపుతాము. ఆ మాటలను, పాటలను, రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది. కొంతమంది మాత్రమే కలం పట్టుకుని కూచుంటే, మాట తీరున కాకుండా మరో రకంగా రాస్తారు. ఆ రచన చదువుతుంటే రచయిత చెపుతున్న భావం వినిపించదు, కనిపించదు. రాతలో కనిపించిన అక్షరాలు శిలా శాసనాలయితే బాగుంటాయి. కథలు, కవితలయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి.

కొంతమంది ఉపన్యాసం చెప్పినా, ముందు రాసుకుని చెపుతున్నట్టు ఉంటుంది. అది బాగుండదు అనడానికి లేదు. చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు. వేలుక్కుడి కృష్ణన్ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెపుతాడు. గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసరమయిన మాటలు గానీ, చెప్పిందే మళ్లీ చెప్పడంగానీ ఉండదు. మొదట్లో నాకు ఆయన పద్ధతి గొప్పగా ఉందనిపించింది. రానురాను అది కొంచెం బిగిసుకుపోయిన పద్ధతేమో అని అనిపించసాగింది. ఇక మరి కొందరు ఉపన్యాసం చెపితే ‘ఎందుకు చెపుతున్నాననంటే అండీ’ అంటూ మరీ పిచ్చాపాటి పద్ధతికి దిగుతారు. చెప్పిందే మళ్లీ చెప్పడం గురించి మళ్లీ మళ్లీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పవలసిన విషయాన్ని మరీ మనసు కెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉందిగానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పిసకడం అంటారు. ఈ మధ్యన పురాణాలు, ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది. కథ ముందుకు సాగదు, విషయం బయటకు రాదు, మాటలు మాత్రం సాగుతూ నే ఉంటాయి.

ఇంతకూ ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెపుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇన్నాళ్లుగా రాస్తున్నాను గానీ నన్ను ఎవరయినా రచయిత అంటే, ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను రాయడం లేదు, నాకు తెలిసిన సంగతులను, అర్థమయిన సంగతులను మళ్లీ చెపుతున్నాను. ఈ చెప్పడంలోని అనుభవం అది రాసే వాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్లకు కూడా తెలుస్తుంది. గ్రాంథికంగా, లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే ఊపు ఉండదు. అందులో రచయిత గొంతు వినిపించదు. ఈ గొంతు అన్న మాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం. పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో అక్షరాలు కాక, టీవీ తెర మీదలాగ ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి. అక్షరాలు ఆయన మాటలయి వినిపించాలి. విశ్వనాథ సత్యనారాయణ గారి పద్ధతిలో అందరూ రచనలు చేసి ఉండకపోవచ్చు. ఆయనకు కూచుని రాయడం అలవాటు లేదట. ఆయన చెపుతూ ఉంటే పక్కన మరెవరో కూచుని రాసేవారట. పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను. వాళ్ల రచనల్లో మాటల ధోరణి వినిపించిందంటే ఆశ్చర్యం లేదు. అందరు రచయితలు అట్లా డిక్టేటర్స్ కాదు. ఎవరికి వారు కూచుని రాసుకున్నారు. ఈ మధ్య వరకు నేను కూడా అదే పద్ధతి. అయినా సరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు.
సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వార్తాపత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నయినా తీసుకుని చదివి చూడండి. వార్తలలో వ్యక్తి కనిపించకూడదు. కేవలం విషయం కనిపించాలి. కాబట్టి దాన్ని బొటాబొటిగా రాస్తారు. వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది.

రచయితలందరూ మంచి మాటకారులు కాదు, బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ కూడా రాయలేకపోవచ్చు. ఇందుకు కారణం వారి గొంతు. కలం పట్టుకుని కూచుంటే గొంతులో గుండె వచ్చి ఇరుక్కుంటే రచన ముందుకు సాగదు. ఎదురుగా ఎవరో కూచున్నారని ఊహించుకుని వాళ్లకు చెపుతున్నట్టు రచన మొదలుపెడితే అది చాలా సులభంగా జరుగుతుంది. అడివన్న కథ చెపుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్‌ను సృష్టించేవాడు. డైలాగు చెపితే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావమూ లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి. ‘అయ్యో! అంత పని జరిగిందా?’ అనే ఒక డైలాగును మా కుటుంబమంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము. ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి. భావం ఏ మాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగు చెప్పాలని మా ఇంట్లో వాళ్లమంతా ఇవాళటికీ పోటీ పడుతుంటాము. గొంతు! అచ్చు అక్షరంలో కూడా గొంతు! దాన్ని గురించి కాసేపు ఆలోచించండి. అప్పుడు నేను కథ చెపుతాను. మరి ఊ కొడతారా?
ఝలక్: చాలామంది ముందు కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు. నాకు తెలిసిన కొందరు చెప్పవలసినదంతా ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చు రూపంలోకి మారుస్తారు. నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాను. ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు.

Monday, July 13, 2015

మైత్రీవనం - బి. ఎస్. రాములు కథానిక

మైత్రీవనం
పోట్లాడుకొని స్నేహాన్ని వదులుకోవడం చాలా సులభం. స్నేహాన్ని  హద్దులు మీరకుండా కాపాడుకుంటూ రావడం కత్తిమీద సాము. 
జ     జ     జ     జ
సెల్‌ఫోన్‌ మోగగానే అది హారికదే అని గమనించింది నీరజ. హారిక ఫోన్‌కు వచ్చే రింగ్‌టోన్‌ ప్రత్యేకంగా కేటాయించుకుంది నీరజ. నీరజ ఫోన్‌కు హారిక కూడా అలాగే స్పెషల్‌ రింగ్‌టోన్‌ పెట్టుకుంది. అది వారి ప్రత్యేక కోడ్‌. అందుకే ఫోన్‌ ఎత్తకుండానే గబగబా రెడీ అయి సైకిల్‌ తీసుకొని హారిక ఇంటికి బయల్దేరింది. సైకిల్‌ను హారిక ఇంటి పోర్టికో గోడ పక్కన ఒరిగించి లాక్‌ చేసి ఇంట్లోకి నడిచింది. అప్పటికి ఇంకా హారిక బాత్రూంలోనే వున్నట్టుంది. అది బాత్రూంలోకి వెళ్తూ తనకు రింగ్‌ ఇవ్వడం చాలాసార్లు గమనించింది.
''చూడు ఆంటీ! నాకు రింగ్‌ ఇచ్చింది. అదేమో బాత్రూంలో చొచ్చింది. కాలేజికి టైమ్‌ అయిపోతోంది'' అంటూ హారిక తల్లి లీలావతిని పలకరించింది నీరజ.
నవ్వుతూ ''అది అంతేలేవే!'' అంటూ నూడిల్స్‌ వేడివేడిగా తీసుకొచ్చి డైనింగ్‌ టేబుల్‌పై ఉంచింది లీలావతి.
''అది రానీ!'' అంది నీరజ.
''అది వచ్చి నిన్ను కూడా పద పద అని తినకుండానే బయల్దేర తీస్తుంది. నవ్వన్నా తినవే!'' అంది లీలావతి.
లీలావతికి నీరజ అంటే తన కూతురు కన్నా ఎక్కువ. హారికకు ఇంట్లో కాస్త గారాబం, కాస్త మొండి. తనదే సాగాలంటుంది. దాంతో హారికతో ఏదైనా ఒప్పించాలంటే నీరజకు చెపుతుంది లీలావతి.
నీరజకు ఆంటీ అంటే భయం, భక్తి. ఆ పోష్‌ బిల్డింగ్‌లో తాను, హారిక కలిసి చదువుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తుంది నీరజ. హారిక సాధారణంగా కాలేజికి కారులో వెళుతుంది. డ్రైవర్‌ డ్రాప్‌ చేస్తుంటాడు. అప్పుడప్పుడు హారిక కారును వద్దని కాలేజీ బస్సులో నీరజతో పాటు వెళ్తుంది. కాలేజీ బస్సు కూడా వెళ్ళిపోయేదాకా చూసి ఆర్టీసి బస్సులో బయల్దేరతీస్తుంది. నీరజకేమో ఆర్టీసీ ప్రయాణం విసుగు. కానీ హారిక ఆ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తుంది. ఈ రోజు కూడా కారును పంపించేసినట్టుంది. కాలేజీ బస్సు కూడా ఎత్తిపోయినట్టే. ఇది కావాలనే ఇలాంటి ప్లాన్లు వేస్తుంది. ఈ రోజు ఆర్టీసీ బస్సులో పోక తప్పదు అనుకుంది నీరజ. టిఫిన్‌ చేసి, టీ తాగిన తర్వాత కూడా హారిక ఇంకా బాత్రూంలోంచి బయటకు రాకపోవడంతో నీరజ విసుగ్గా బాత్రూం తలుపు బాదింది.
హారిక కాసేపటికి రెడీ అయి వచ్చింది. పూర్తిగా రెడీ అయి అందాల రాశిగా చిరునవ్వుతో నీరజను పలకరించింది హారిక.
జ     జ     జ     జ
కార్తీక్‌ గురించి హారిక ఈ మధ్య సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఏం చేయాలో తోచడం లేదు.
అవతలి వారి స్నేహంలో చొరవ ఎక్కువై తనకు పరిమితులున్నప్పుడు ఇది మరీ కష్టం. హారిక ఎవరితో చెప్పుకోవాలో కూడా కష్టంగా వుంది. ఏమనుకుంటారోనని సంకోచం.
నీరజకు హారిక చెప్పకపోయినా అన్ని విషయాలు తెలుసని హారికకు తెలుసు. కానీ తన మనస్సులోని సంఘర్షణ దానికి తెలియదు. నీరజ తన ప్రాణ స్నేహితు రాలు. అది తనను తన కన్నా బాగా అర్థం చేసుకుంటుంది అనుకుంది హారిక.
అంతా విన్నాక కూడా హారిక మనస్సులోని సంఘర్షణ నీరజ ఊహకు అందలేదు. నీరజకు ఆ విషయం కొత్త. హారిక ద్వారా తనకే కొన్ని కొత్త అనుభవాలు, ఆలోచనలు. తనను అలా ప్రేమిస్తున్నానని స్నేహం పేరిట వెంటపడే వారు ఎవరూ లేనందుకు కించిత్‌ బాధపడింది.
డబ్బు చాలామందికి వుంటుంది. అందం కూడా చాలా మందికి వుండవచ్చు. వినయం, సంస్కారం చాలా మందికి వుండవచ్చు. కానీ ఈ మూడు కలిసి ఒక్కరిలో వుండడం చాలా అరుదు. హారిక ప్రసన్నవదనంలోని ఆత్మవిశ్వాసం వెనుక గర్వం వుందేమోనని చాలాసార్లు నీరజ చర్చల్లో గమనించింది. కానీ కించిత్‌ గర్వం ఉన్నట్టు అన్పించలేదు. స్నేహం అన్ని తప్పులను, బలహీనతలను క్షమిస్తుంది. నీరజకు కూడా అలా స్నేహంలో హారికలోని బలహీనతలు, లోపాలు కన్పించకుండా పోయాయేమో!
జ     జ     జ     జ
వేగంగా పోతున్న సిటీ బస్సు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో ప్రయాణికులంతా కుదుపుకు లోనయ్యారు. ఒకరి మీద ఒకరు పడిపోయారు. కూర్చున్న వాళ్లు కుర్చున్నట్టే ముందు సీట్లకు తలలు, చేతులు తాకి అమ్మో అన్నారు. అందరూ డ్రైవర్‌ని రకరకాలుగా మాటలంటున్నారు. బస్సు ముందు నుండి వేగంగా రాంగ్‌సైడ్‌లో క్రాస్‌ చేద్దామని అతి తెలివితో వేగం పెంచిన యువకుడు బైక్‌ పై నుండి కింద పడ్డటున్నాడు.
''అఖల్‌ హై క్యా? బేవకూఫ్‌'' అని డ్రైవర్‌ ఆ యువకున్ని తిట్టిన తిట్టు తిట్టకుండా అరుస్తున్నాడు.
నలుగురైదుగురు కలిసి బైక్‌ను లేవనెత్తారు. ఆ యువకుడు గీరుకుపోయిన కాళ్లను, మోచేతులను చూసుకుంటూ దులుపుకున్నాడు.
''నేను చెబితే వినవు. బస్సులో పోదామంటవ్‌. ఎంత దెబ్బ తాకిందో చూడు'' అంటూ నీరజ విసుక్కుంది.
''ఏమైందే! స్కూటీ మీద పోతే ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు తాకుతుంటయి. ఇప్పుడు చూల్లేదా బైకు మీద పోతే అతనికి ఎన్ని దెబ్బలు తాకినయో!'' అంటూ సముదాయించింది హారిక.
''స్కూటీ మీద పోవుడెందుకె? నీకు కారుండంగ బస్సులో పోవుడు ఏం షోకే!'' అంది నీరజ.
ఆ మాటతో లేడీస్‌ సీట్లో కుదురుగా కూర్చున్న ఆ యిద్దరి సంభాషణను వెనుకా ముందు వున్న వారి చెవిన పడింది. ఆసక్తిగా ఒక చెవి ఇటు వేశారు.
''వారానికోసారి బస్సులో పోకపోతే లోకమెట్లా తెలుస్తుందే? కారులో పోయి కారులో వస్తే మనలోకం మనదే. మనకు ఇతరుల గురించి ఏం తెలుస్తుంది? నాకైతే కారంటే బోరు కొట్టింది.'' అంటూ హారిక నవ్వుతూ నుదురుకు తాకిన దెబ్బ బొడుసు కట్టిన ఉబ్బును తడిమి చూసుకుంది.
''పైగా కాలేజీ బస్సులో కూడా ఎప్పుడూ చూసిన ముఖాలే. సిటీ బస్సులో అయితే ఎప్పుడూ ప్రయాణం వెరైటీగా వుంటుంది. ఇలాంటి అనుభవం బస్సులోనే సాధ్యమే!'' అంటూ నీరజ మెడచుట్టూ చేతులు వేసి ముందుకు ఊపింది హారిక.
''నాకు తెలుసులేవే. కార్తీక్‌ను తప్పించుకుందామని నీ ప్రయత్నం.'' అంటూ బుగ్గమీద మెత్తగా ఎడం చేత్తో గిల్లింది నీరజ.
''నాకేం భయమే. కార్తీక్‌ను చూస్తే జాలి వేస్తుంది. నా స్నేహాన్ని కన్సర్న్‌ను అలుసుగా తీసుకుంటున్నాడు. నా కన్సర్న్‌ను ప్రేమ అని భ్రమ పడుతున్నాడు. అతని మేలు కోరి నేను తప్పించుకుంటున్నాను. నీకా విషయం తెలిసి కూడా ఇట్ల మాట్లాడ్డం మంచిగ లేదు.'' అంటూ కార్తీక్‌ గురించిన ఆలోచనలో పడిపోయింది హారిక. మూడీగా మారిపోవడం చూసి హారికను రకరకాల మాటలతో ఈలోకంలోకి రప్పించింది నీరజ. హారిక సుతారంగా నవ్వింది.
''హమ్మయ్య! నీకెప్పుడు మూడ్‌ వస్తుందో, ఎప్పుడు మూడీ అవుతావో ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడే.''
''కార్తీక్‌కు తెలుసనుకుంటానే...'' అంటూ గుసగుసగా నవ్వింది హారిక.
''అంతగా ఇష్టపడే కార్తీక్‌ని తప్పించుకోవడం ఎందుకే. అంతగా కావాలనిపిస్తే ఇద్దరం కలిసి కార్తీక్‌ను మస్త్‌ ఏడ్పించవచ్చు. ప్రిన్సిపాల్‌కు రిపోర్ట్‌ చేయవచ్చు''.
''ఛ... ఛ... ప్రిన్సిపాల్‌కు రిపోర్ట్‌ చేస్తే ఇంకేమైనా ఉందా! అతన్ని కాలేజినుండి తీసేయొచ్చు. నాకు అలాంటివి ఇష్టం లేదు. కార్తీక్‌ సున్నిత మనస్కుడు. కవిత్వం, కథలు అంటూ ఊహా లోకాల్లో విహరిస్తాడు. ఏ కాస్త విమర్శను, హేళనను భరించలేడు. ఎవరినైనా సరే ఆటపట్టించడం నాకిష్టం వుండదని నీకు తెలుసు. అలాంటిది కార్తీక్‌ను ఎలా అంటానే!''
''అలాంటప్పుడు హాయిగా కార్తీక్‌ను ప్రేమించేసెయ్‌. నీకేం తక్కువే. కో అంటే కోట్ల రూపాయలు. నువ్వు ఎవర్ని ప్రేమించినా వాళ్లు కోటీశ్వరులైపోతారు.'' అంటూ నవ్వింది నీరజ.
''అసలు సమస్యే అక్కడ వచ్చింది. డబ్బున్న ఇంట్లో పుట్టడం ఒకందుకు వరమైతే మరొకందుకు శాపమే. అది అనుభవిస్తే తప్ప తెలియదు.''
''ఎందుకే! పెట్టిపుట్టినోళ్లు గట్లనే మాట్లాడ్తరు. డబ్బు విలువ నీకేం తెలుసు? నాలాంటి దానికి, కార్తీక్‌ లాంటి వాడికి డబ్బు ఎంటో, అది మనిషికి ఎంత అవసరమో తెలుసు. ఎంత తిన్నా దంగనంత డబ్బున్న నీకేం తెలుసే.'' అంది నీరజ.
బస్సులో ఆ చర్చ ఎంత విందామనుకున్నా వాల్యూమ్‌ తగ్గించిన టీవీలా హావభావాలు తప్ప మాట సరిగా వినిపించడం లేదు.
''కార్తీక్‌ను చూస్తే నిజంగా జాలేస్తన్నదే. దయచేసి నన్ను ప్రేమించవద్దు అని చెప్పాలనిపిస్తున్నదే! అయితే ఆ మాట చెప్తే గాలీబ్‌లాదేవులపల్లి కృష్ణశాస్త్రిలా రొమాంటిసిజమ్‌ భావకవిత్వంలో ఊహాప్రేయసితో సంభాషిస్తున్నట్టు సాగే ఆయన కవితాధార ఇంకిపోతుందేమోనే! డిప్రెషన్‌లో పడతాడేమోనని భయం. అతడు బాగుండాలి. బాగా చదువుకోవాలి. బాగా ఎదగాలి. కానీ ఈ ప్రేమ జంజాటంలో పడితే మంచిది కాదని నా ఉద్దేశం. పైగా నాకతన్ని ప్రేమించే ఉద్దేశ్యం లేదు.''
''ప్రేమించే ఉద్దేశ్యం లేకపోతే అంతకన్సర్న్‌ దేనికే! ఆ మధ్య నువ్వు అతని ఎకౌంట్లో నా చేత డబ్బు ఎందుకు జమ చేయించావు? కేవలం జాలి మాత్రమేనా? తన ఎకౌంట్లో ఎవరు డబ్బు జమ చేశారో తెలియక కార్తీక్‌ తల బద్దలు కొట్టుకున్న విషయం నీకు తెలియదా?''
ఆ సంఘటన గుర్తొచ్చి హారిక హాయిగా నవ్వుకుంది. ఈ దొంగపని తానే చేశానని కార్తీక్‌ తనవైపు చూసిన చూపులో కేవలం కృతజ్ఞతనే కాకుండా మరేదో తళుక్కున మెరిసింది. ఓసారి తానే ఆ ఎకౌంట్‌లో జమ చేసి కార్తీక్‌కు పరోక్షంగా దొరికిపోయింది.
దిగాల్సిన స్టేజి రావడంతో గబగబా లేచి దిగి కాలేజీ వైపు నడిచారు.
జ     జ     జ     జ
తమకు ఫోన్‌ చేయడమంటే కార్తీక్‌కు భయమని వారిద్దరికీ తెలుసు. కార్తీక్‌ ఫోన్‌ కాల్‌కు హారిక, నీరజ స్పెషల్‌ రింగ్‌ టోన్‌ పెట్టుకున్నారు. అందుకని ఆ ఫోన్‌ వాళ్ళు ఎత్తరు. కాలేజీలో కార్తీక్‌ను తప్పించుకొని హారిక, నీరజలు ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతూ అవకాశం లేకుండా చూసుకుంటున్నారు.
రోజూ సాయంత్రం ఇంటినుంచి కారు రావడంతో హారిక, నీరజ కారులో వెళ్లిపోతున్నారు.
కార్తీక్‌ నీరసపడిపోయాడు. వాళ్లు ఎప్పుడో ఒక్కసారైనా కాలేజీ బస్సులో ఎక్కుతారని, పలకరించవచ్చునని అనుకున్న ఆశ నిరాశ అవుతోంది. అదంతా హారిక, నీరజ గమనిస్తూనే వున్నారు.
కార్తీక్‌ ఏకపక్ష ప్రేమ ఎలానైనా హారికతో వ్యక్తం చేయాలని చూస్తున్న తీరును చూసి హారిక ఏమనలేక బాధపడిపోయింది.
ఓ రోజు గుళ్లోకి వెళ్లి దేవున్ని ప్రార్థిస్తూ ప్లీజ్‌ కార్తీక్‌ నన్ను ప్రేమించకుండా చూడు అంటూ మనసులో మొక్కుకుంది.
ఇది అతన్ని ప్రేమిస్తోంది. కానీ దాన్ని స్నేహమని ఇతరులకు చెబుతుంది. అనుకుంటోంది నీరజ.
అతనంటే పడిచచ్చే హారిక అతడు తనను ప్రేమించవద్దనడం ఎమిటో నీరజకు అర్థం కావడం లేదు. అదే మాట అడిగింది.
''స్నేహం వేరు... సహృదయత వేరు... తోటి వారికి సహాయం చేయడం వేరు... ప్రేమ వేరు. వీటన్నిటి మధ్య అంతస్సంబంధం వుండవచ్చు గానీ దేనికవి ప్రత్యేకమైంది. అతడు ఎడ్యుకేషన్‌లో ఫస్ట్‌ జనరేషన్‌. తల్లిదండ్రులు చాలా పేదలు. వాళ్ళు కష్టపడి ఇక్కడిదాకా చదివించడమే గొప్ప. రిజర్వేషన్‌లో సీటు సంపాదించి అందరికన్నా ఎక్కువగా ఎదగడం నన్ను బాగా ఆకర్షించింది. అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన కార్తీక్‌ నేను స్వయంగా ఇస్తే తీసుకునే వాడంటావా? ఒకవేళ తీసుకుంటే అతనిలో మన పట్ల ఒక బెరుకు, అల్పత్వ భావన పెరగదా! అందుకని చేసే సహాయం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. సగర్వంగా వుండాలి తప్ప వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా వుండవద్దనేది నా ఉద్దేశ్యం.''
''నువ్వు ఇంత సున్నితంగా, సెన్సిటివ్‌గా ఆలోచించడం చాలా విచిత్రంగా వుంది. నీలాంటి వాళ్ళు చాలామంది కార్తీక్‌ లాంటి వాళ్ళను బాగా లైట్‌గా తీసుకుంటారు. ఏడిపిస్తారు. కించపరుస్తారు. నిజానికి నువ్వు నాలాంటి కుటుంబంలో పుట్టాల్సిందానివే. పొరపాటున పెద్దింట్లో పుట్టినవే. పెద్దింట్లో పుట్టేవాళ్లకు దయాధర్మాలు, స్నేహం, ప్రేమ కన్నా అహంకారం ఎక్కువ కదా.'' అంది నీరజ.
''నువ్వు అలా అనుకోవడం తప్పు. పెద్దింట్లో పుట్టడం వల్లనే నాకీ సంస్కారం అబ్బింది. నీలాంటి కుటుంబంలో పుట్టి వుంటే డబ్బు కోసమే తండ్లాట ఉండేది. సహృదయత కోసం, సంస్కారం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కాదంటావా?'' అంది హారిక.
ఈ ప్రేమ ఏంటో, ఈ స్నేహం ఏంటో అర్థం కాక తలబద్దలుకొట్టుకుంది నీరజ. హారిక లాంటి కొత్త తరంలో అన్నిటికీ అతీతంగా ఎదుగుతూ వస్తున్న స్నేహాలను, ప్రేమలను, సంస్కారాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా అంత సులభం కాదు.
హారిక వాళ్ల నాన్న అతన్ని ఏదో చేస్తాడని భయమెందుకో! నిజంగా ఏమైనా చేస్తాడనుకుంటే ఇంటినుంచి వెళ్లిపోయి ఎక్కడైనా హాయిగా బతకొచ్చు. హారికకి ఆ సంపద, సౌకర్యాలు వున్నాయి. వాటితో పాటు అమ్మానాన్నలను వదలుకోవాలని లేదేమో. అంటే హారిక ప్రేమకన్నా ఆస్తి అంతస్తులకు, అమ్మానాన్నలకు ప్రాధాన్యత ఇస్తుందేమో! అదేమాట అంది నీరజ. 
''నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనావే!'' అని నిష్టూరాలాడింది హారిక.
జ     జ     జ     జ
హారిక, నీరజ ఆ రోజు కాలేజీ ఎగ్గొట్టినట్టున్నారు. ఐమాక్స్‌ థియేటర్‌లో ఏదో ఇంగ్లీష్‌ సినిమా చూసినట్టున్నారు. హుస్సేన్‌సాగర్‌ పడమటి తీరాన నెక్లెస్‌ రోడ్డులో పీపుల్స్‌ ప్లాజా గార్డెన్‌లో కూర్చుని హాయిగా మాట్లాడుకుంటున్నారు.
అంతదాకా చూసిన సినిమా గురించి నీరజ ఏదో చర్చ మొదలు పెట్టింది. హారిక అందులోని ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో తన అభిప్రాయాలు చెప్పింది. నీరజకు అదేమీ అర్థమైనట్టు లేదు.  డైరెక్ట్‌గా అడగకుండా వుండలేకపోయింది నీరజ.
''కార్తీక్‌ గురించి అసలు నీ ఉద్దేశ్యం ఏంటిదే! ఈ సినిమాలాగే అసలు నువ్వేంటో అర్థం కాక చస్తున్నా!'' అంటూ నిలదీసింది నీరజ.
హారిక సుతారంగా నవ్వేసి ఊరుకుంది. ఆ నవ్వులో ఎన్నో భావాలు. ఆ భావాలు నీరజకు చదవడం వచ్చు. 
''ఇందులో రహస్యమేమీ లేదే. నువ్వెందుకంత వర్రీ అవుతున్నావ్‌. నేను ఆంతర్యంలో అతన్ని ప్రేమిస్తున్నది నిజమే. అయితే ఇరువురి ఆంతర్యాల్లో ఎంతో అంతరం వుంది. నిజానికి నేను అతని శ్రేయస్సును ప్రేమిస్తున్నాను. అతని వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నాను. అంతేగానీ అతన్ని ఫిజికల్‌గా ప్రేమించడం లేదు. అంత చిన్న కుటుంబం నుంచి, చిన్న కులం నుంచి కష్టపడి పైకి వచ్చి సిన్సియర్‌గా చదువుకోవడం, ర్యాంకులు తెచ్చుకోవడం, రచయితగా ఎదగడం, నన్ను హంట్‌ చేసింది. ఈ కాలంలో అంత స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండే యువకులు ఎంతమంది వుంటారు'' అంది హారిక.
''ఔను! ఏవో వెకిలి చేష్టల ద్వారా, డర్జీ జోక్స్‌ ద్వారా, ర్యాగింగ్‌ ద్వారా ఆకర్షించాలని చూస్తారు. కానీ కార్తీక్‌ వ్యక్తిత్వం స్వయంగా ఇతరులను ఆకర్షిస్తుంది'' అంది నీరజ.
ఆమాటకు అడ్డొస్తు హారిక...
''అది నిజమేలేవే! అయితే నేను అతనికి తగను. పైగా నా వ్యక్తిత్వాన్ని అతడు తట్టుకోలేడు. పేదరికం నుంచి ఎదిగిన వ్యక్తిత్వం అతనిది. సంపన్న కుటుంబం నుండి ఎదిగిన వ్యక్తిత్వం నాది. నేను సంపదకు, అంతస్తులకు అతీతంగా ఆలోచించగలను. అతడు ప్రతిదీ కులం రీత్యా, డబ్బు రీత్యా ఆలోచించే తీరులో వున్నాడు. ఏ మాట మాట్లాడినా దాని వెనుక మన కులాధిక్యత, అహంకారం, డబ్బు వల్ల వచ్చిన గర్వం, వుందని ఫీలవుతుంటాడు. ఇలా మా ఇద్దరి జీవిత పరిణామాల మధ్య ఎంతో అంతరం. అందువల్ల మా సంసారం సజావుగా సాగడం కష్టం.''
హారిక ఒకందుకు చెప్తే నీరజ మరొకలా అర్థం చేసుకుంది. నవ్వుతూనే అక్కసు వెళ్ళగక్కింది.
''ఈ మాట ఎంతోమంది రచయితలు, సినిమా దర్శకులు ఎప్పుడో చెప్పారు. నువ్వు కొత్తగా చెప్పేదేందే! కులాంతర వివాహాలను తప్పించుకోవడానికి, పేదవాళ్లను పెళ్లి చేసుకోవడాన్ని నిరాకరించడానికి ఇదో తొంపు. నిజంగా నువ్వు ప్రేమించేదైతే కార్తీక్‌తో జీవితాంతం స్నేహం చేయాలని, కలిసుండాలని, అందుకు పెళ్ళి చేసుకోవాలని కూడా కోరుకుంటావు. అంతేగానీ కేవలం వ్యక్తిత్వాన్ని ప్రేమించుకుంటూ అమలిన శృంగారంలాగా, ఊహా ప్రేయసీ ప్రియుల్లాగా మనసులోనే అనురాగాన్ని దాచుకోవడం వుండదు. నువ్వు ఏదో షెల్లీ, కీట్స్‌, బైరన్‌ కాలంలోనో, మన తెలుగు భావకవుల కాలంలోనో పుట్టాల్సినదానివే.''
హారికకు కోపానికి బదులుగా మరింత నవ్వొచ్చి బిగ్గరగా నవ్వేసింది.
''నీ బొంద! ఆ కాలంలో పుడితే అన్ని విషాదాంతాలేనే! అసలు నేను కార్తీక్‌లాగా నీక్కూడా అలుసై పోయిన్నే! నేను వాస్తవికంగా ఆలోచిస్తున్నాను. నీకు ముందే చెప్పిన. రిజర్వేషన్లో ఇంత దాకా వచ్చిన అతని చదువు ఇంకా సాగాలి. మేం పెళ్లి చేసుకుంటే అతని చదువు ఆగిపోతుంది. మేమిద్దరం ఎక్కడ వున్నా మా నాన్న పట్టి తెప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఇద్దరి జీవితాలు మధ్యాంతరంగా ఆగిపోతాయి. ఈ విషయం మీదే నాకు బాధ. అంతేగానీ అతన్ని ప్రేమించడం లేదని కాదు. అతడు చదువుకోవాలి. బాగా ఎదగాలి. నాకు దూరంగా వుండాలి. ఇండియా దాటి యూఎస్‌కు వెళ్లాలి. అక్కడ స్థిరపడాలి. అప్పటికి అతనికి పెళ్లి కాకుండా వుంటే... నన్ను మా నాన్న తన సంస్థలకు సీఈవోగా, ఎండీగా వుండాలని బలవంతం చేయకపోతే నేను కూడా యూఎస్‌ఏకు వెళ్ళాలి. అప్పటికీ మా ఇద్దరి మధ్య ప్రేమ వుంటే అక్కడ పెళ్లి గురించి ఆలోచిస్తా.'' అంది హారిక.
''స్నేహాల్లాగే ప్రేమలు కూడా కాలం తెచ్చే మార్పులతో మార్పు చెందుతుంటాయి. ఇది కేవలం ఆ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇంత సంపద వుండగా పొట్ట చేత పట్టుకొని అందరిలాగా అమెరికా పోవాల్సిన అవసరం మనకేమిటి అని డాడీ అడిగితే?'' అంది నీరజ. ''జీవితాన్ని వాయిదా వేయడమంటే ఇదేనే! ఎస్కేపిజాన్ని ఎంత ముద్దుగా చెప్పినవే. అప్పటికి కార్తీక్‌కు నువ్వు నీ ప్రేమ అలుసైపోతుందేమో! నిన్ను నిరాకరిస్తాడేమో!'' అంటూ ఎద్దేవా చేసింది నీరజ.
''నీ తలకాయ! నీ బుర్రకు అంతకన్నా ఎక్కువ ఏం తోస్తుంది? అప్పటికి గానీ నా ఆంతర్యం వ్యక్తం చేయలేను. మా మధ్య అంతరాలు తొలగవు. ఇది జీవితానికి క్రమబద్దంగా వేసుకునే ప్లానింగ్‌. '' అంటూ నీరజను కౌగిలించుకుంది హారిక.
''అయినా మీ డాడీ నిన్ను సీఈఓగా, ఎండీగా చేశాక నీకు అడ్డేమిటి? ఇండియాలో కూడా కార్తీక్‌ని పెళ్ళి చేసుకోవచ్చుగా''. సాలోచనగా అంది నీరజ.
''నువ్వు అన్నది కూడా నిజమేలేవే! ఏమైనా కార్తీక్‌ చదువు పూర్తి కావాలి. ఆయన ఏదైనా ఉద్యోగం సంపాదించాలి. ఆ తర్వాత ఆలోచిద్దాం'' అంది తన్మయత్వంతో హారిక.
''విష్‌ యూ బెస్ట్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌'' అని నీరజ విష్‌ చేస్తూ ''నీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుందే'' అంటూ వీపు చరుస్తూ అభినందించింది.
ఆ తరువాత ఆలోచనలో పడి మళ్ళీ అంది నీరజ. ''అంత ఎదిగినాక కార్తీక్‌ అభిప్రాయాలు, వ్యక్తిత్వం కూడా మారిపోవచ్చు. ఇప్పుడున్న ఆరాధనా భావం అప్పుడు ఉండకపోవచ్చు. నీ ప్రేమను చాలా లైట్‌గా తీసుకోవచ్చు. ఏమంటవే?''
''అది కూడా నిజమే కావచ్చు. కాలమే అన్ని అంతరాలను, ఆంతర్యాలను పరిష్కరిస్తుంది. సన్నిహితం చేస్తుంది. ఇప్పుడు మాత్రం స్టేటస్‌కోలోనే కొనసాగుతాను. అంటే కార్తీక్‌ను ప్రస్తుతం నేను ప్రేమించేది లేదు, అతనితో స్నేహాన్ని వదులుకునేది లేదు.'' అంది  హారిక.
''అలా కొనసాగడం చాలా చిక్కు సమస్య. బాగా సెన్సిటివ్‌ ప్రాబ్లమ్‌ కదనే.'' అంది నీరజ.
నీరజని ఆత్మీయంగా కౌగిలించుకుని అంది హారిక.
''నాకు తెలుసులేవే! నేను ప్రేమ విషయంలో ఆంతర్యంలో అంతరాన్ని, స్నేహం విషయంలో ఆత్మీయతను డీల్‌ చేయలేనా?...'' ఆ మాటలో ఎంతో ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరం.
''దట్స్‌ తెలుగు డాట్‌ కామ్‌'', వన్‌ ఇండియా తెలుగు, జూన్‌ 2013.

'సలామ్‌ హైదరాబాద్‌' పక్ష పత్రిక, జులై 2013.

Thursday, July 31, 2014

దొంగతనానికి అర్థం – విష్ణుప్రభాకర్



ఆ పొడుగాటి దారి మీద పక్కన అతని దుకాణం ఉన్నది. బాటసారులు అక్కడ చెట్టుకింద కూచుని సేదదీరుతరు. అతను వాళ్లను కుశలం అడుగుతడు.

ఒకనాడొక బాటసారి అణా వస్తువు కొని రూపాయి యిచ్చినడు. మామూలుగనే అతను లోపలి అల్మారా తెరిచినడు. చిల్లర తిరిగి ఇచ్చేందుకని తన పాత రేకుపెట్టె తెరిచినడు. దాని మూత తెరిచి చూచే లోపల అతని చెయ్యి కదలడం ఆగిపోయింది. పక్కనుండి చూస్తున్న పెద్దమనిషి ఒకతను ఏమయింది?” అని అడిగినడు.


ఏమి లేదు, పెట్టెను మూస్తూ దుకాణదారుడు నెమ్మదిగా చెప్పాడు, పేద మనిషి ఎవరో తన నిజాయితీని కుదువబెట్టి పైసలు తీసుకుపోయినడు అని.

విష్ణు ప్రభాకర్ ప్రఖ్యాత హిందీ కథా రచయిత.

Sunday, March 31, 2013

చలం - కాలం


గుడిపాటి వెంకటచలం గారు టైం ట్రావెల్ లాంటి కథ ఒకటి రాశారంటే ఆశ్చర్యం.
ఒకాయన జులూలాండ్ అనే చోట రాయబారిగా పని చేసి తిరిగి వస్తాడు.
నిజానికి అక్కడి వారికి ఇండియా అని ఒక దేశం ఉందా అని అనుమానం వస్తుంది కథ మొదట్లో.
మరి అక్కడ ఆయన రాయబారిగా ఏం చేశాడని అడగ కూడదు.


కథ చివర్లోని కాస్త భాగం చదివితే మాత్రం ఆయన చెప్పదలుచుకున్నదేమిటో కొంచం అర్థమవుతుంది.
చదవండి మరి.....

భోజనమైనాక వరండాలో కూచున్నాము నేనూ మా బావా. కొత్త మార్పుల్ని గురించి చెపుతున్నాడు దిగులుగా. కుర్రాడు కూచున్నాడు రోడ్డుకేసి చూస్తో. ఇంతలో ఒకాయన వచ్చాడు. ఆయన ఈ ఊరికంతటికీ అధికారి. కొత్తగా నేను వచ్చాను గనుక నా సంగతి రాసుకోడానికి వచ్చాడు. దేశానికి వచ్చిన ఈ మార్పు సంగతి చాలా సేపు మాట్లాడుకున్నాము. పూర్వకాలం ఉండే శారీరక మానసిక వ్యాధులు చాలా వరకు తగ్గాయి. ఈర్ష్యలూ, పోటీలు, ముందు ఎట్లా బతకడమనే భయం, పిల్లలేమవుతారనే ఆదుర్దా, ధనార్జన, ధనం కూడబెట్టడం, ఆస్తి సంపాయించడం ఇటువంటి బాధలన్నీ పోయినాయి నిశ్చయంగా. అధికారులకి బానిసత్వం, ప్రభుత్వభయం, నీచత్వం, మోసం మొదలైనవి లేనేలేవు.
అంటే రామరాజ్యం – భూలోక స్వర్గమన్న మాట అన్నాను
అని మూలిగాడు.
ఏం అన్నాను
స్వర్గం కూడా ఇట్లానే ఉంటుందేమోనని భయం అన్నాడు మా బావ.
ఏమీ? అదే కాదా మనం కలలుగన్నది? మతాలన్నీ ఆశ పెట్టింది? నిరంతర శాంతి. ఈ భూమి మీద జీవితపు  జ్వరం తరవాత ఆ లోకంలో శాంతి అనేకద! ఆ శాంతి ఇక్కడే కలిగితే ఇంకేం కావాలి?”
అవును. ఇక్కడ ఈ లోకంలో అశాంతి, తీరని కోర్కెలూ ఉన్నంతకాలం, అవన్నీ ఆ లోకంలో ఉండవనీ సత్యం, శాంతి, సౌఖ్యం, ఇవన్నీ అక్కడ ఉంటాయనీ కలలు కన్నాము. కానీ అవన్నీ ఈ లోకంలోనే లభ్యమైతే, కలలుగనడానికి ఇంకేమీ మిగలలేదు.
నేను చూసిందేమంటే, ఇంత శాంతి, ధర్మం ఏర్పడినా మనుషుల్లో ఉత్సాహం, కళా కనపడవేం? ఏదో నిద్రపోతున్నట్టూ, ఏం చాతగాక అటూఇటూ వెతుకుతున్నట్టూ పదేళ్లమట్టి పంజరంలో బతుకుతున్న పిట్టల్లాగ కనపడతారేం మనుషులు ఎంత కాలం నుంచి కలలుగన్నాం ఈ శాంతి కోసం?”
కాని పని భారం. పొద్దస్తమానం పని
ఎక్కువ పని ఉన్నట్టులేదు అన్నాను.
లేదు. కాని ఉన్న పని భారం. పనిలోనుంచి పని తప్పించుకునే అశ ఉండాలి. గానుగ ఎద్దులాగ బతుకంతా ఇదే పని అనుకుంటే, పని భారమవుతుంది. .......
మానవ స్వభావం విచిత్రం. దానిని అంకెలలోకీ, ఫార్ములాలకీ మార్చి యోచించడం బుద్ది తక్కువ. పని కావాలి. పనీ అక్కర లేదు. ఇప్పుడు మనిషికి పని తక్కువ పని కావాలని ఉంటుంది. కాని ఉన్న పని భారం.

ఇంతకూ ఈ కథ పేరు 1690 అనో 1960 అనో ఉండాలి.
తెలుగు అంకెల్లో రాశారు. ఎవరికి తెలుస్తాయి ఆ అంకెలూ