నేను తెలుగులో చాలా రాశాను. పుస్తకాలు కూడా. ఇంకా రాస్తూనే ఉన్నాను. సైన్సు,సాహిత్యం, సంగీతం, కళలు నా హాబీలు.
Showing posts with label హాస్యం. Show all posts

Thursday, August 28, 2014
Tuesday, September 24, 2013
Thursday, September 5, 2013
నవ్వాలి మరి
ఒకడు మాడిన రొట్టె తిని కడుపునొప్పి తెచ్చుకొనగా వైద్యుడాతని కంటికి మందు వేసెను - చమత్కార చంద్రిక అనే చాలా పాత పుస్తకంలోని ఒక జోకు.
* ‘ఆసుపత్రికి దారి చెప్పగలరా?’ అంటే ‘గలను’ అని వెళ్లిపోయాడొకతను. ముళ్లపూడి వారి ‘నవ్వితే నవ్వండి’లోని ఒక జోకు. వారీ జోకును మరింత ముందుకు లాగి నవ్విస్తారు.
* * *
‘పెళ్లాన్నేం చేస్తావురా బాళప్పా?’ ప్రశ్న. ‘గొంతు పిసికి బాయిలో ఏస్తాను!’ జవాబు.
చీనన్న మా ప్రసాదుకు ఆ ప్రశ్న అడిగితే ఆ జవాబు చెప్పడం నేర్పించాడు. ఈ మాటలు ఎక్కడివి? అన్న అనుమానం అప్పట్లో నాకు రాలేదు. తరువాత మాత్రం చాలా కాలంగా అనుమానం తొలుస్తూనే ఉన్నది. ఇంతకూ అది జోకా? దానికి నవ్వాలా? నవ్వాలి మరి! చీనన్న అంటే మా చిన్నాయనగారి కుమారుడు. హాస్యప్రియుడు. ఒకరోజు అతను ముందు భోజనం ముగించినట్టున్నాడు. తరువాత తిన్న వారికి చారులో ఉప్పు లేదని అర్థమయింది. ‘అదేమి చీనూ! చెప్పనే లేదు?’ అన్నది. ‘అదీ ఒక రుచి అనుకున్నాను పెద్దమ్మా!’ చీనన్న జవాబు. చీనన్న నిజంగా మంచివాడు. అమాయకుడు అనాలేమో! కానీ ‘రుచి’ గురించి మాత్రం దశాబ్దాల తరువాత కూడా మా ఇంట్లో జోకుగా చెప్పుకుంటాము. ఒకసారి బంధువుల ఇంటికి పోతే వాడికి ఇడ్లీలు పెట్టినట్టున్నారు. ఇంటికి వచ్చిన తరువాత, తిండి పట్టదు అన్నాడు. ఎందుకంటే ‘ఉప్పిండి ఉంటలు (ఉండలు) తిన్న’ అని జవాబు. ఇదీ మాకు ఒక జోకుగా మిగిలింది. ఉండ అంటే గుండ్రంగా ముద్ద కట్టినది అనేనా అర్థం? దాన్ని మేము ‘ఉంట’ అంటాము. మా బావమరిది మరో చీనన్న. ఆయన అంతకన్నా హాస్యప్రియుడు. చేసిన లడ్డూలు మరురోజున ఉంటే, ఉంటలు, లేకుంటే ‘ఉండలు’ అన్నాడు. ‘ఉండను’ అనే మాటకు అర్థం తెలుసు గదా! ఈ ఇద్దరూ ఇప్పుడు లేరు. ఒకరు ప్రయత్నించి, మరొకరు నిజంగా అప్రయత్నంగా పై లోకాలకు చేరుకున్నారు. బతుకులో వెలుగు నీడలకు వీళ్లే ఉదాహరణలు!
గణపతి అని ఒక నాటకం. అది హాస్యం కింద లెక్క. విజయవాడ రేడియో వాళ్లు దాన్ని రేడియో నాటకంగానూ మలిచారు. చాలా ఏళ్ల క్రితమే. నేను పుస్తకం చదివాను. రేడియో డ్రామా విన్నాను. అప్పట్లో నా రియాక్షను ఏమిటో నిజంగా గుర్తు లేదు. శ్రీ రఘురామ, చారు తులసీదళ ధామ అన్న పద్యానికి, ఆ నాటకంలో ఒక పంతులుగారు, రాముల వారు చారు గాచుకున్నారు. కరియాపాకు లేకుంటే తులసి వేశారు అంటూ వ్యాఖ్యానం చెపుతారు. అది మాత్రం తప్పకుండా నవ్వించింది. కొంచెం తెలివి వచ్చింతర్వాత (ఆహా!) నాటకం వింటే అరికాలులో నుంచి మంట పుట్టింది. అది ఏ మాత్రమూ నవ్వవలసిన అంశం కాదు. గణపతి ఒక మొద్దబ్బాయి. ఎవరయినా మొద్దబ్బాయిగా పుడితే తప్పు తల్లిదండ్రులది. వారిది ఎంత మాత్రమూ కాదు. ఆ మొద్దబ్బాయిని తల్లి అమితంగా ప్రేమిస్తుంది. తల్లులకు మామూలు వారికన్నా, బలహీనులు, బుద్ధిహీనుల పట్ల కించిత్తు ఎక్కువ ప్రేమ సహజం కదా! ఈ విషయాన్ని హాస్యంగా వాడుకుంటే అంతకంటే క్రూరత్వం ఇంకొకటి ఉంటుందా? ఆలోచించాలి. అలాంటి వారి పట్ల సానుభూతి కలుగుతుంది. నవ్వు పుట్టదు, పుట్టగూడదు.
ప్రతి మనిషిలోనూ, పరిణామక్రమ ప్రభావంతో, ఒక అడవి మనిషి, మంచి చెడు చూడలేని మొరటు మనిషి దాగి ఉండటం సహజం! ఒకరెవరో జారి పడతారు. లేదా కట్టుకున్న గుడ్డ ఊడుతుంది. అందరూ ముందు నవ్వుతారు. అదుగో! ఆ మొరటు మనిషి పైకి వచ్చి నవ్వించినట్టు లెక్క! ఆ తరువాత సభ్య మానవుడు మేలుకుని సానుభూతిని కూడా పంచడం తెలుసు!
పుట్టపర్తి నాగపద్మిని గారు కొన్ని పుస్తకాలు, గోపాలకృష్ణ అన్నయ్యగారికి ఇమ్మని, ఒక అబ్బాయికి అప్పజెప్పారు. అతను, నేనే గోపాల‘కృష్ణ’ అనుకుని నాకు తెచ్చి ఇచ్చాడు. నిమిషాల్లో తిరిగి వచ్చి మళ్లీ పట్టుకుపోయి, అసలు చిరునామాలో వాటిని అందజేశాడు. ఈ మధ్య నిమిషాలలో నాకొక ‘యురేకా!’ క్షణం దొరికింది. ప్రసిద్ధ కన్నడ రచయిత ‘బీచి’ (వివరాలు మరోసారి!) ఆయన నవల సరస్వతీ పరిహారము. దాన్ని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తెనిగించారు. ‘పెళ్లాన్ని ఏం చేస్తావురా?’ డయలాగుతో ఆ పుస్తకం మొదలవుతుంది. నేను స్నానం చేస్తూ పుస్తకం చూడలేదు. లేకుంటే, నా యురేకా, మరో జోకయి ఉండేది. పద్మినిగారిని, ఫోను ద్వారా, పుస్తకం కొరకు అభ్యర్థించాను. ఆమె దయతో మొదటి పరిహారంలోని (సంహారం అంటే సమాహారమని, అంటే ఒక సేకరణ, గుంపు, కూడిక అని అర్థం ఉంది!) అన్నీ కాకున్నా, కొన్ని పుస్తకాలను నాకూ పంపించారు. వారికి ధన్యవాదాలు చెప్పాను. రుతు సంహారం అన్న కావ్యానికి రుతువుల వరుస అని అర్థం. మరి ఈ సరస్వతీ సంహారం ఏమిటని నా కుతూహలం. ఆచార్యుల వారి రచనలు, వారి గురించి రచనలున్న ‘త్రిపుటి’ని కూడా పక్కనబెట్టి ముందు ఈ చిన్న నవల చదివేశాను. దాని కోసం మీరు వెతికితే దొరకదు. అచ్చులో అదిప్పుడు దొరకడం లేదు. పద్మిని నాకు, మా అన్న గోపాలకృష్ణకు ఇచ్చినది ఫొటోకాపీ ప్రతి!
ఈ పుస్తకంలో నాయకుడు బాళప్ప అను బాలప్ప. వాడు గణపతికన్నా మరింత మొద్దబ్బాయి. వానికి ఆదర్శ మహిళకు ఆదర్శంగా ఒక అక్కగారు. ఆమె భర్త పండితుడు. తాత్వికుడు. వారి సంతానమయిన సరస్వతి, అపర సరస్వతి. అందగత్తె. మూర్త్భీవించిన మంచితనం. మనకు మేనరికం హక్కు అని ఒకటి ఏడిచింది గద. కనుక సరస్వతిని బాలప్పకిచ్చి పెళ్లి చేశారు. (ఇంకా నయం, గణపతి కథ ఇంత దూరం సాగదు!) ‘బాయిలో ఏస్తాను’ అదీ ‘గొంతు పిసికి’ అని చిన్నప్పుడు చెప్పిన మాటలను నిజం చేస్తాడు ఈ ‘నాయకుడు’. నిజంగా అది సరస్వతి సంహారమే. పుస్తకం చదివిన తరువాత నా మనసు కలత పడింది. ఎన్నిసార్లు, ఎంతకాలం దాని గురించి ఆలోచించానో? ఇది హాస్యమా? దీనికి నవ్వెట్లా వచ్చింది. ఒక అమాయక ప్రాణి, ఖర్మగాలి మూర్ఖుడయితే, అది మనకు నవ్వు పుట్టిస్తుందా? మనం మనుషులమయినట్లా? లేక ఇంకా పశువులుగానే మిగిలి ఉన్నామా?
మొక్కపాటి వారు బారిస్టరు పార్వతీశము అని ఒక రచనను మనకు అందించారు. అందులోని సన్నివేశాలు అన్నీ మనలను నవ్విస్తాయి. దాన్ని సిచువేషనల్ కామెడీ అంటారు. అందులోనూ ఎక్కడో కొంత అమాయకత్వం నక్కి ఉంటుంది. కానీ మొరటు హాస్యం కాదది. సందర్భంగా ఒక విషయం. మొక్కపాటి వారికి బహుశః బోదకాలు ఉండేదేమో? ఆయనను ఎవరో ‘గురుపాదులు’ అన్నారట. ఇది మళ్లీ గణపతి, బాళప్పలను తలపించే హాస్యం.
చిలకమర్తి వారి హాస్యములు అని ఒక పుస్తకం రెండవ చేతి (అదే సెకండ్‌హ్యాండ్) పుస్తకాలలో కనపడితే కొన్నాను. చదవటం మొదలుపెడితే, ముందుకు కదలలేదు. అందులోనూ మొరటు హాస్యమే. బ్రామ్మల గురించి జోకులు వేసి నవ్వడం మనకు బాగా అలవాటు. మాయాబజార్‌లో శర్మా శాస్ర్తిల మొదలు, కోడిని చూస్తే తినాలనిపిస్తోంది సినిమా, ఆ తరువాత నిరసనలూ, నినాదాలకు కారణమయిన మరో సినిమా దాకా, అంతటా ఇదే కదా (అప)హాస్యానికి ప్రాతిపదిక. పోలీసులను, బాపన వారిని గురించి జోకులేస్తే అడిగేవారు లేరనా? తెలంగాణ యాస మరో హాస్యం!
దేవుళ్లను గురించి జోకులు, కార్టూనులు వేయడం మనకు మరీమరీ బాగా చేతవును. గణపతి చవితి వచ్చిందంటే, పత్రికలన్నింటిలోనూ అవే కార్టూనులు. ఆయన బొమ్మను మురికిగుంటలో ముంచింది చాలక. దాని గురించి జోకు చేయడం!
చిన్నప్పుడు ఊళ్లో బోగమాట ఆడేవారు. అక్కడ బోగం వారెవరూ లేరు. అది వీధి నాటకం. తెల్లవార్లూ జరుగుతుంది. మధ్యలో కొంచెం తెరిపి, రిలీఫ్ కావాలి. ఒకాయన ‘మంచి మంచి పద్యాలు చెపుతాను వినండి’ అని మొదలుపెట్టి ‘చూడుము నీ సంసారపు నడకలు, దేవా ఈ ప్రజలు, ఎంతో మారిరి మానవులు’ అని పాట పాడేవాడు. దేఖ్ తేరీ సంసార్‌కి హాలత్ క్యా హోగయా భగవాన్? కిత్‌నా బదల్ గయా ఇన్సాన్’ అన్న సినిమా పాటకు అది స్వేచ్ఛానుకరణ. పద్యమని చెప్పి పాట పాడడం సంగతి అర్థమయిన వారికి జోకు. పారడీ కాకున్నా పాట మరో జోకు. ఆయన అప్పట్లో చేసిన ఒక ట్రిక్కును నేను ఇవాళటికీ, మానేజ్‌మెంట్ ట్రెయినింగ్‌లలో వాడుతున్నాను. ‘మిమ్మల్నందరినీ నా వెనుకకు తెప్పిస్తాను. కళ్లు మూసుకోండి’ అని మంత్రం చదువుతాడు. కళ్లు తెరవగానే, అతను అటు వేపి మళ్లి నిలబడడం కనపడుతుంది. ఎంత బాగుంది, అది జోకంటే?
నవ్వండి. కానీ, ఎందుకు నవ్వామో ఆలోచించండి. ఒకోసారి కళ్లు చెమర్చుతాయి!
* ‘అట్లు తింటారా?’ ప్రశ్న - ‘అట్లే కానీ’ జవాబు. అది మాటకారితనం.
* బాపుగారు గొప్ప కార్టూనిస్టు. ఆయనకు ఒక మానసిక గురువున్నారు. ఆయన పేరు గోపులు. గోపులు కార్టూనులు చూడదలచుకున్న ఇదే బ్లాగులో చూడవచ్చు.

Friday, August 9, 2013
Thursday, February 28, 2013
Saturday, July 7, 2012
Tuesday, July 3, 2012
మనలో ఎవరు బెస్ట్?
'ఎలాగున్నారు?’ అని ఎవరినయినా ఒక ప్రశ్న అడిగి చూడండి. ‘ఆఁ! ఏదో! బాగానే ఉన్నాం!’ అంటారు గానీ, ఎవరూ సంతోషంగా ఉన్నామని చెప్పరు. కానీ, వ్యాపారాలు చేసే సంస్థల్లో మాత్రం బెస్ట్, గ్రేట్ లాంటి మాటలు ఊరికే వినపడుతుంటాయి. ఏదో ఒక పరికరం, అందులోని భాగం గురించి వ్యాపార పరంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అందులో ‘మీరు ఇవ్వగల బెస్ట్ ప్రైస్ (ధర) చెప్పండి!’ అని ఒక డయలాగ్ ఉంటుంది. ఆ ధర కొనేవారికి తక్కువగానూ, అమ్మేవారికి లాభకరంగానూ ఉండాలి. అక్కడ బెస్ట్ అంటే అన్నింటికన్నా మంచి అనే అర్థం! అదే మరి మనుషులు, ఉద్యోగులు, వారి పని గురించి మాట్లాడుతుంటే మాత్రం ఈ మాటల అర్థాలు మారిపోతాయి. అవి ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతాయి. అక్కడే సమస్యలు మొదలవుతాయి.
మనతో బాటు, మరెందరో పనిచేస్తుంటారు. అందరిలోనూ కలిసి బెస్ట్ ఎవరని వెతకవలసిన అవసరం వస్తుంది. అక్కడ అభిప్రాయాలలో చాలా తేడా కనబడుతుంది. మీరుండేస్థాయిని బట్టి పని నాణ్యత, వ్యక్తుల క్లాసు గురించిన అవగాహన మారుతుంది. ఆఫీసులో ఏదో ఒక పని చేయవలసిన అవసరం వస్తుంది. ‘దీనికి ఎవరు బెస్ట్?’ అని ప్రశ్న మొదలవుతుంది. తగినవారు ఎవరైనా ఉన్నారా, అనే ప్రశ్న కూడా పుడుతుంది. ఉన్నవాళ్లంతా మంచివాళ్ళే. కానీ, కొత్త అవసరం వచ్చేదాకా దానికి సరిపడే వారు ఉన్నారా? అన్న సంగతి తెలియదు!
‘నీవు కోరిందేదో నీ దగ్గర ఉందన్న సంగతి, ఆ కోరిందేదో తెలిసేదాకా తెలియదు’ అని ఒక మాట ఉంది. మనుషులయినా అంతే! ఆఫీసులో, కంపెనీలో ‘బెస్ట్’ గురించిన వెదుకులాట చాలా రకాలుగా ఉంటుంది. మనుషుల గురించయితే, అందుకు కొన్ని పద్ధతులున్నాయి. అందరికీ తెలిసిన ‘పనె్నండు ప్రశ్నల పరీక్ష’ ఒకటి ఉంది. అది కాపీ రైటు కింద వస్తుంది. ఉద్యోగి భావాలను గుర్తించే ప్రయత్నంలో మామూలుగా కొన్ని ప్రశ్నలుంటాయి.
* కంపెనీ నమ్మే విలువలనే ఇంచుమించుగా నేను కూడా నమ్ముతాను.
* నేను, నా కంపెనీ భవిష్యత్తు బాగుంటుందనుకునేవారిలో ఒకడిని.
* కంపెనీ గమ్యాలను చేరడంలో, నా పాత్ర ఏమిటో నాకు బాగా అర్థమయింది-లాంటి కొన్ని పడికట్టు భావాల గురించి సర్వే చేస్తుంటారు. కానీ, ఈ రకం ప్రశ్నలు అన్ని సందర్భాలలో, అన్ని డిపార్టుమెంట్లలో సంతృప్తికరమయిన ఫలితాలను ఇవ్వవు. మరింత సూటిగా, ఒక్కొక్క ఉద్యోగికి చేతనయిన పనులు, పనులు చేయడంలోనూ, కంపెనీ పట్ల వారు చూపించే విధేయత మొదలయినవి మరీ లోతుగా చూడవలసిన అవసరం వస్తుంది. అట్లా, ప్రశ్నల సంఖ్య ఎక్కువవుతుంది. సర్వే, చాలా చికాకు అవుతుంది. ఒకానొక కంపెనీ వారు సర్వే కోసం నాలుగు వందల ప్రశ్నలు సిద్ధం చేశారు. ఇక ఆ సర్వేలోనుంచి, అనుకున్న ఫలితాలు రావని వేరుగా చెప్పనవసరం లేదు.
మీరు ఎంతగా ‘బెస్ట్’కు దగ్గరవుతున్నారన్న సంగతి ముందు మీకు తెలుస్తుంది. కానీ, మీ చేత పని చేయిస్తున్న వారి ఎక్స్‌పెక్టేషన్స్ మరోరకంగా ఉంటాయి. మీ సూపర్‌వైజర్, ‘కానీ’ అని ఒక పుల్ల వేస్తాడు. మీది మేనేజర్ అగ్గిపుల్ల గీచి ఈ పుల్లను వెలిగిస్తాడు. కనుక ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు జవాబు, ఉద్యోగుల మధ్య నుంచి రాదు. మేనేజర్ల నుంచి వస్తుంది. మేనేజర్లకు తమ సిబ్బందితో ఉండే మంచి సంబంధాల ఆధారంగా నిర్ణయం వస్తుంది. మనం మనుషులం. మేనేజర్లు కూడా మనలాగే మనుషులు. కనుక, కొన్ని సందర్భాలలో నిజమయిన ‘బెస్ట్’ బయటపడకుండా, నిరాశకు లోనవుతారు. అదనంగా పని చెప్పడానికి, బెస్ట్ గురించి వెతికితే మాత్రం, అక్కడి ప్రశ్నలు మరోరకంగా ఉంటాయి. పనిని బెస్ట్‌గా చేయగలిగిన వారికన్నా, బెస్ట్‌గా మాట వినేవారికి భారం అప్పగించే వీలు ఎక్కువ. అందులో అందరికీ సులువుంది. ఉద్యోగులలో నిజంగా బెస్ట్ ఎవరన్నది, చిక్కు ప్రశ్న. ఒక్కొక్క విషయానికి, సందర్భానికి ఒకరు బెస్ట్‌గా ఉంటారు. కొంతమందిలోని మంచీ చెడు లక్షణాలను మేనేజర్లు గమనించరు. ఒక పెయింటింగ్ ఉంటుంది. అందులో అక్కడక్కడ ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలలో కూడా రంగులు పులిమితే, పెయింటింగ్ అందం, ఆకర్షణ తగ్గుతాయి. ఒక పూల గుత్తిలో, ఒక పువ్వు తగ్గినా, ఎక్కువయినా దాని రూపం మారుతుంది. బాపు బొమ్మలో ఒక గీత తగ్గినా ఆ బొమ్మ అసంపూర్తి అవుతుంది అంటారు. మనుషుల వ్యక్తిత్వాలు కూడా అలాంటివే.
మనమయినా, మన మేనేజర్లయినా, వ్యక్తిత్వంలోని ఖాళీలను అదనపు లక్షణాలను ఈరకంగా గుర్తించగలగాలి. మన దృష్టిలో కొన్ని లక్షణాలు మాత్రమే వచ్చి, మిగతావి రాకుంటే, ఆ వ్యక్తి మనమే అయినా సరే, చిత్రం అసంతృప్తి అవుతుంది. కొంపలు మునుగుతున్నా సరే, నిత్యం ఆఫీసుకు సమయానికి వచ్చేవారు మంచి ఉద్యోగులా? చెప్పిన పనిని నిజంగా ధ్యాస పెట్టి ముగించేవారా? కంపెనీ, సంస్థ గమ్యాల గురించి అవగాహన ఉండి, అందుకు తమ వంతు కృషి చేసేవారిని ఏమనాలి? పని చేసినా, చేయకున్నా, సరైన సమయంలో మంచి సలహాలు, అభిప్రాయాలు, ఆలోచనలు అందజేసేవారుంటారు. వారినేమనాలి? కొందరికి సమస్యలను విడదీయడంలోని మెళకువలు తెలిసి ఉంటాయి. కొందరు పని సాధించడంలో పట్టుదలగలవారుంటారు. ఈ లక్షణాలు అన్నీ ఒకరిలో దొరకవు. కొంతమందిలో ఈ లక్షణాలే కనిపించవు. అన్ని మంచి గుణాలే, కానీ, జాగ్రత్తగా గమనిస్తే, మంచి గుణాలు రెండింటి మధ్యన వైరుధ్యం కనబడుతుంది. ఒక్కొక్క గుణం గురించి ఆలోచించినా, వాటిలో మంచితో బాటు కొంచెం చెడు కూడా కనిపించే వీలుంది. ఎవరికివారికే ఈ అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. మొత్తంమీద ఎవరి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పుకాదు, పూర్తిగా సరయింది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది. సందర్భాన్ని బట్టి, మనుషుల విలువ తెలుస్తుంది. ‘తగినవారు’ ఉంటారు. ఆ సమయానికి వారే బెస్ట్! మొత్తంమీద ఎవరి అభిప్రాయం కూడా పూర్తిగా తప్పుకాదు, పూర్తిగా సరయింది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది.
సందర్భాన్ని బట్టి మనుషుల విలువ తెలుస్తుంది. ‘తగినవారు’ ఉంటారు. ఆ సమయానికి వారే బెస్ట్! మొత్తంమీద బెస్ట్ అనే వారుండరు!
ఇంతా జరిగిన తరువాత, మేనేజర్ల మీద కూడా బాసులుంటారు. వారి అభిప్రాయాలను కాదనగలిగే శక్తి, తక్కువగా ఉంటుంది. అందరిమధ్యన జరిగిన నిర్ణయాలను, అక్కడ, అవుననిపించుకుంటే, అనిపించగలిగితే, ఆ సందర్భంలో ఆ మేనేజర్ బెస్ట్! అవునన్న పెద్ద బాసు బెస్ట్! ఆ బాసు మేనేజర్‌ని బెస్ట్ అంటారు. మేనేజరు మనందరినీ బెస్ట్ అంటారు! అప్పుడు మాటకు అర్థం ఉంటుంది!
సినిమా చూస్తున్నాము. ‘చూశావా? చూశావా? అంటాడు పక్కతను! బోలెడు డబ్బు పెట్టి సినిమాకు వచ్చింది, చూడటానికి కాకపోతే, గోళ్లుగిల్లుకోవడానికా?
నిన్నొక ప్రశ్న అడగనా?’ అనే ప్రశ్న! అప్పుడే ఒక ప్రశ్న అడిగావు. మరోకటి ఎలాగూ అడుతావిక!
‘జీవితం చిన్నది’ అనే మాట! ఏమిటర్థం? మనకు చేతయిన పెద్ద సంగతి అదొకటే! దానికంటే ఎక్కువ కాలం మరేమి సాధించగలం గనుక?
ఒకానొక రాత్రి, ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఒకేసారి, నిద్రలో నడక మొదలుపెట్టారు. ఇద్దరికీ మెలుకువ రాలేదు. నడుస్తూ, నడుస్తూ రాళ్ల తోటలోకి చేరుకున్నారు. అక్కడ పొగ మంచు నిండి ఉంది. ఇద్దరూ ఒకరొకరికి ఎదురుపడ్డారు.
‘‘ఆహా! రాక్షసీ! చివరికి ఎదురయ్యావా? నీ వల్లే గదా నా బతుకంతా నాశనమయింది, ఆ శిథిలాల మీద నీవు నీ బతుకు బంగళా కట్టుకున్నావు! నిన్ను చంపగలిగితే బాగుండును!’ అన్నది తల్లి ఆవేశంగా!
‘‘నువ్వొక ఆడదానివా? ఆశపోతు ముసలిపీనుగా! నా బతుకుకూ నాకూ మధ్య అడ్డుగోడగా నిలబడ్డావు! నాబతుకు కూడా నీ బతుకులాగా తెల్లవారుతుంటే, నేనూరుకుంటానా? నువ్వు చస్తే, నా పీడ విరుగడవుతుంది!’’ అన్నది కూతురు.
అంతలో కోడి కూసింది. తల్లికీ, కూతురికీ మెలుకువ వచ్చింది.
‘నువ్వేమిటి బంగారు తల్లీ! ఇక్కడున్నావు?’ అంది తల్లి. ‘నీవేమిటమ్మా ఇక్కడ?’ అంది కూతురు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు.
-ఖలిల్ జిబ్రాన్ ఆధారంగా!

నాకు నచ్చని సంగతులు!
టైమెంత అని అడగటానికి చేతిని చూపించడం! నా గడియారం ఎక్కడుందో నాకు తెలుసు? గడియారం లేనిది నీకు గదా? బాత్‌రూం ఎక్కడ అని అడగడానికి ఏం చూపిస్తావ్? (సారీ)
సినిమా చూస్తున్నాము. ‘చూశావా? చూశావా? అంటాడు పక్కతను! బోలెడు డబ్బు పెట్టి సినిమాకు వచ్చింది, చూడటానికి కాకపోతే, గోళ్లుగిల్లుకోవడానికా?
నిన్నొక ప్రశ్న అడగనా?’ అనే ప్రశ్న! అప్పుడే ఒక ప్రశ్న అడిగావు. మరోకటి ఎలాగూ అడుతావిక!
‘జీవితం చిన్నది’ అనే మాట! ఏమిటర్థం? మనకు చేతయిన పెద్ద సంగతి అదొకటే! దానికంటే ఎక్కువ కాలం మరేమి సాధించగలం గనుక?
సందర్భం!
అదొక నగరం. అక్కడొక కుటుంబం. కుటుంబమే, కానీ ఉండేది ఇద్దరే! ఒక తల్లీ, ఒక కూతురు. మరో దిక్కులేని వారయినా, వారుకూడా కుటుంబమే. సుఖంగా బ్రతుకుతున్నారు. ఒకరిమీద ఒకరికి ప్రేమ కూడా బోలెడుంది. కానీ, వాళ్లిద్దరికీ నిద్రలో నడిచే అలవాటు ఉంది. అదొక పెద్ద సమస్యలా కనిపించలేదు వారికి. ఒకరు లేస్తే మరొకరికి మెలుకవవుతుంది. ఎలాగో సర్దుకుంటున్నారు.
ఒకానొక రాత్రి, ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఒకేసారి, నిద్రలో నడక మొదలుపెట్టారు. ఇద్దరికీ మెలుకువ రాలేదు. నడుస్తూ, నడుస్తూ రాళ్ల తోటలోకి చేరుకున్నారు. అక్కడ పొగ మంచు నిండి ఉంది. ఇద్దరూ ఒకరొకరికి ఎదురుపడ్డారు.
‘‘ఆహా! రాక్షసీ! చివరికి ఎదురయ్యావా? నీ వల్లే గదా నా బతుకంతా నాశనమయింది, ఆ శిథిలాల మీద నీవు నీ బతుకు బంగళా కట్టుకున్నావు! నిన్ను చంపగలిగితే బాగుండును!’ అన్నది తల్లి ఆవేశంగా!
‘‘నువ్వొక ఆడదానివా? ఆశపోతు ముసలిపీనుగా! నా బతుకుకూ నాకూ మధ్య అడ్డుగోడగా నిలబడ్డావు! నాబతుకు కూడా నీ బతుకులాగా తెల్లవారుతుంటే, నేనూరుకుంటానా? నువ్వు చస్తే, నా పీడ విరుగడవుతుంది!’’ అన్నది కూతురు.
అంతలో కోడి కూసింది. తల్లికీ, కూతురికీ మెలుకువ వచ్చింది.
‘నువ్వేమిటి బంగారు తల్లీ! ఇక్కడున్నావు?’ అంది తల్లి. ‘నీవేమిటమ్మా ఇక్కడ?’ అంది కూతురు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు.
-ఖలిల్ జిబ్రాన్ ఆధారంగా!
అసలు మాట
నోరు విప్పకుండా ఉంటే, చవటలమని ఎలాగూ అర్థమవుతుంది! నోరు విప్పి, ఇక సందేహం లేకుండా చేయడమెందుకు?
-రామీ బెల్సన్
-రామీ బెల్సన్
ఏదో ఎగురుతూ వస్తున్నది. ఏమిటా అని చూస్తున్నాను. అదొక రాయి. అది నాకే తగిలింది!
Saturday, May 19, 2012
Sunday, May 13, 2012
అవాంతరాలు
అనుకోకుండా గాడిద, ఒంటె దారిలో ఎదురుపడ్డాయి. గాడిద గౌరవంగా ఒంటెను పలుకరించింది. ఒంటె అంతే అభిమానంగా సమాధానమిచ్చింది. అప్పుడు గాడిద, ఒంటెను ఒక ప్రశ్న అడిగింది. ‘అవునన్నా! ఇద్దరమూ నాలుగు కాళ్లు గలిగి ఉన్నాము. నేనేమో మాటిమాటికి తట్టుకుని పడుతుంటాను. నీవెప్పుడూ అట్లా పడడం చూడలేదు. కాళ్లు పొడుగున్నందుకా? ఏమిటి సంగతి?’ అని.
‘కాదు తమ్ముడూ! నా కళ్లు ఎప్పుడూ పైకి చూస్తుంటాయి. అంటే, నాకు ముందుదారి చాలాదూరం వరకు శుభ్రంగా కనబడుతుంది. ఇక తప్పటడుగు ప్రశ్న ఉండదు. మరి నీ కళ్లు ఎప్పుడూ కిందకు చూస్తుంటాయి. నీకు కాళ్ల కింద నేల తప్ప ముందు దారి కనబడదు. కనుకనే నీవు పడిపోతుంటావు’ అన్నది ఒంటె.
గాడిదకు విషయం అర్థమయింది. ‘నువ్వు ముందు నడువు మరి! నేను వెంట వస్తాన’న్నది.
==========
అవాంతరాలు
అనుకున్నదేదీ అనుకున్న సమయానికి జరగడంలేదు. మరి ఎందుకలా జరిగింది?
బతుకు మన ప్లాన్ ప్రకారం జరగడంలేదు. ఏదో జరిగితే, దానికి రియాక్ట్ అవుతున్నాము, అంతే.
పనులు జరగడం గురించి, జరగకపోవడం గురించి మరెవరిమీదనో నిందలు వేస్తున్నాము తప్ప అవి జరగడానికి తగిన ఆలోచనలు, పథకాలు మనం వేయడంలేదు.
మనలో దాగివున్న పిల్లతనం మనలను నడిపిస్తున్నది. పండిన ఆలోచనలను ముందుకు రానివ్వడం లేదు.
తప్పు చేస్తామన్న భయంతో, అసలు ఏ పనీ చేయకుండా ఉండిపోతున్నాము. పిల్లతనంలో ఏం చేసినా ‘తప్పు’ అంటూ భయపెట్టారు. నవ్వారు. ఆట పట్టించారు. మనం అక్కడే నిలిచిపోయాము.
అందరికీ చేతనయిన పనులు మనకూ చేతనవుతాయని తెలుసు. కానీ చేసి చూడడానికి భయం అడ్డుపడుతుంది. పని చేసి పరీక్షించే ధైర్యం లేదు.
మన గురించి మనం నిర్ణయాలు చేయలేకపోతున్నాము. ఎవరో చెప్పినా వినడంలేదు.
మనం కావాలనుకున్న వాటివెంట పరుగెత్తుతున్నాము. మన ‘అవసరాలను’ గుర్తించడంలేదు.
అనవసరమైన పనులను పంచుకొంటున్నాము. సరదా కాలక్షేపం మనకొక పనిగా తోచినట్లుంది.
మనం గడిచిన రోజులు ఆదర్శంగా ముందుకు నడుస్తున్నాము. ఇప్పుడేమి చేయగలమన్న ఆలోచనకు దూరంగా ఉంటున్నాము.
మన తీరుకు, మనం తప్ప మిగతా వారందరూ, అన్ని పరిస్థితులూ కారణం అనుకుంటున్నాము.
భవిష్యత్తు గురించి కాక, ఇవాళటి కొరకు బతుకుతున్నాము. పని చేస్తున్నాము.
సమస్య వస్తే చూడక, తప్పించుకు తిరుగుతున్నాము.
ఇట్లా మన పరిస్థితికి ఎన్నో కారణాలుండవచ్చు. వీటిలో ఏ ఒకటి, కొన్ని నిజమయినా, మనం ఆలోంచాలి. పద్దతి మార్చుకోవాలి!
===========
అసలు మాట
అధికారమూ, హోదా గలవారికి చదవడానికి టైం ఉండదు. కానీ చదవని వారు అధికారం, హోదాలకు అర్హులు కారు.
-మైకేల్ ఫూట్
చదివితే మరింత మంది తెలివి, మన తెలివికి తోడవుతుంది.

Sunday, May 6, 2012
అచ్చరబల్ల - హాస్యకథ
ఒకాయన అత్తగారింటికి పొయినడు.
అక్కడ వాండ్లు నెయ్యి, బెల్లమేసి సంకటి వండి పెట్టినరు.
రుచి బాగున్నది.
"ఇదేమిడిది" అని అడిగినడు.
"తమిదె సంకటి" అని వాండ్లు చెప్పినరు.
"తమిదె సంకటి, తమిదె సంకటి" అని మనుసులో అనుకుంటు తమ ఊరి తోవన వస్తున్నడు.
నడుమ ఒక కాలువ వచ్చింది.
దుంకేటప్పుడు ఊపు కొద్ది "అచ్చరబల్ల!" అన్నడు.
సంకటి సంగతి మరిచి "అచ్చరబల్ల, అచ్చరబల్ల" అనుకుంట ఇల్లుజేరినడు.
'అచ్చరబల్ల జేసి పెట్ట'మని పెండ్లామును అడిగినడు.
'అటువంటిది నాకు రాదు' అన్నదామె.
'మీ అమ్మవాండ్ల ఇంట్లో తిన్న నేను, నీవు కావాలంటని రాదంటున్నవు' అని కోపం కొద్ది పెండ్లామును బాగ కొట్టినడు.
ఆ పుణ్యాత్మురాలు 'నిజంగ నాకు తెలువదు' అని మాత్రము అన్నది.
ఇంకా బాగ కొట్టినడు అమెను.
పక్కింటి ముసలామె 'పిల్లను సంకటిలాగ కొట్టినవు గదనయా' అన్నది.
"ఆ! దాని కొరకే!" అని అప్పుడు యాదికొచ్చి అన్నడు.
ఈ కథ మా చిన్నప్పుడు చెప్పినరు.
అమ్మ సంకటి నెయ్యిపోసి వండి పెట్టేది.
మేము దాన్ని గురించి అచ్చరబల్ల అనే పేరుతోటి చెప్పుకునే అలవాటు.
ఇటువంటి కథలు ఎనుకవడి పొయినయి.
తెలిసిన వాండ్లు చెప్పకపోతే అందరు మరిచిపోతరు.
Friday, May 4, 2012
Wednesday, April 11, 2012
Tuesday, February 21, 2012
Friday, February 3, 2012
Monday, January 30, 2012
Tuesday, January 24, 2012
‘భమిడిపాటి’ రచనలు - సమీక్ష
నవ్వడం నేర్పించే ‘భమిడిపాటి’ రచనలు
భమిడిపాటి
కామేశ్వర రావు
రచనలు - 4
నాటకాలు
పేజీలు: 230
వెల: రూ. 110/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1.
భమిడిపాటి కామేశ్వరరావుగారి పేరు చెపితేనే నవ్వేతరం ఒకటి ఉండేది. ఆ తరువాత ఆయన కుమారుడు రాధాకృష్ణ కూడా హాస్యరచనలతో పేరు సంపాదించుకున్నారు. విశాలాంధ్ర వారు కామేశ్వర రావుగారి రచనలను సేకరించి సంగ్రహాలుగా వేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇంకా కొన్ని రచనలు మాకూ అందలేదు. మీ దగ్గర ఉంటే పంపించండి. అని అడగడం మరింత బాగుంది.
నాలుగవ సంపుటమయిన ఈ పుస్తకంలో నాలుగు స్టేజి నాటకాలున్నాయి. వాటిలో మూడు అనువాదాలు. చివరిది నేరుగా వారి రచన.
ప్రణయరంగం ఈడూ-జోడూ అన్న నాటకాలు ప్రసిద్ధ ఆంగ్లవక్త, రూపకకర్త, రిచర్డ్ బ్రిన్‌స్లీ షెరిడన్ నాటకాలకు తెలుగు రూపాలు. పాశ్చాత్య నాటక ప్రపంచంలో షెరిడన్, మోలియర్‌లకు ఉన్న పేరు చాలా గొప్పది. వాళ్ల రచనలను కామేశ్వర రావు గారు తెలుగు చేయడంలో ఆశ్చర్యం లేదు. అందులో ఆయన ఎంపిక చేసిన నాటకాలు మరీ ప్రత్యేకమయినవి.
షెరిడన్ సృష్టించిన ఒక పాత్ర, భాషాప్రయోగంలో ఒక సిద్ధాంతానికి ఆధారమయింది. ఆ నాటకం పేరు ‘రెవల్స్’. అందులో మిసెస్ మ్యాలప్రాల్ అని ఒకావిడ ఉంటుంది. ఆవిడ పదాలను బాగా వాడాలన్న కోరికతో అర్థంలేని పదప్రయోగాలు చేస్తుంది. ఆ పద్ధతికి ఆంగ్లంలో, ఆ పాత్ర పేరున ‘మ్యాలప్రాసిజం’ అని పేరు వచ్చింది. ఈ ప్రణయరంగంలో కూడా ఒక రాంబాణమ్మ గారిని రచయిత సృష్టించారు. ఆమె, అర్థంలేని పదప్రయోగాలతో నవ్వులు పండించారు.
షెరిడన్ 1816లో మరణించాడు. అంటే ఈ నాటకాలు అంతకన్నా ముందు కాలానివి. అలనాటి ఆంగ్ల సమాజంలో అమ్మాయిలను పెళ్ళిళ్ళను, అపార్థాలనూ వాడి హాస్యం పండించే పద్ధతి ఉండేది. ఈ సంప్రడంలో రెండవ నాటకం ‘ఈడూ - జోడూ’ కూడా షెరిడన్‌దే ఈ నాటకం సంగీత నాటకంగా నేటికీ ప్రపంచాన్ని ఊపేస్తున్న డ్యూయెన్నాకు తెలుగు రూపం.
సంకలనంలో మూడవ నాటకం, మరో ప్రసిద్ధ రచయిత ఆలివర్ గోల్డ్‌స్మిత్ రచనకు అనువాదం గోల్డ్‌స్మిత్ 18వ శతాబ్దం మధ్యకాలం నాటి రచయిత చివరి నాటకం, చెప్పలేం మాత్రం కామేశ్వర రావుగారి స్వంత రచన. కానీ అది మొదటి మూడు నాటకాల తీవ్ర ప్రభావం ప్రతిఫలించిన రచన.
నాటకాలు నాలుగింటిలోనూ, అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ తండ్రులు, అత్తలు, మిత్రులు, పనివాళ్ళు, చిత్ర విచిత్ర మనస్తత్వాలతో మన ముందుకు వస్తారు. ప్రణయ రంగంలో నాయిక నవలలు చదివి, అలాగే నవల పద్ధతిలో పెళ్ళి చేసుకోవా లను కుంటుం ది. అక్కడ నాయకు డు మారు వేషంతో ఆమె మనసు కాజేసే ప్రయ త్నం చేస్తాడు. మరొక నాటకం లో అమ్మాయి తాను పనిమనిషినన్న నాటకమాడి నచ్చిన వాడిని మెప్పిస్తుంది. అంతటా ఒక అమ్మాయి కొరకు పోటీపడే మనుషులు ఎదురవుతారు. నిజం చెప్పాలంటే ఈ రకం హాస్యం తెలుగు పాఠకులకు, ప్రేక్షకులు, ఆనాడు, ఈనాడూ కొత్తే! పుస్తకంలో పాత్రలు రంగం మీదకు వచ్చి, వెళ్ళిపోయే సూచనలను, ఇంకా ఉంచడం అవసరమేమో! నాటకాలు, ఆసక్తిగలవారు ఓపికగా చదివితే, చేతయితే, నవ్వుకోవచ్చు! అవునుమరి. కాలక్రమంలో మనం నవ్వుకునే పద్ధతులు కూడా మారిపోయినాయి.
కామేశ్వర రావుగారి భాష, సంభాషణ, శైలి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కడక్కడ డయలాగులు మరీ ఇంగ్లీషుగా తోచవచ్చు. కానీ అనువాదంలో కూడా అంతటి తెలుగుదనాన్ని పలికించినందుకు రచయిత గుర్తుండి పోతాడు. ‘రహస్యం చెప్పావా?’ అన్న ప్రశ్నకు ‘అక్షరం తలకట్టు కూడా చెప్పలేదండీ’ అనిపించగలిగిన ‘ఈజ్!’ ఆశ్చర్య పరుస్తుంది. అలాంటి తెలుగు ఏమయింది? అన్న ప్రశ్న అందరికీ ఒక్క క్షణం ఎదురవుతుంది. ఆ తెలుగు కోసమయినా ఈ నాటకాలను చదవాలి. చేతనయితే ప్రదర్శించాలి.
పాత్రలకు పేరు పెట్టడంలో ఈ రచయిత పద్ధతి ఎవరికీ చేతగాలేదు. కుమార సేనం, జ్వాలారంగం, నభోమణి, మండోదరం, కరాళం, తంపటి లాంటి పేర్లు ఏ పుస్తకంలోనూ చూచి ఉండలేదు.
ఈ తరం పాఠకులకు భమిడిపాటి వారి పేరుతో కూడా పరిచయం లేకపోవచ్చు. కానీ వారి రచన ఒకటి చదివినా, మిగతావన్నీ చదవాలనిపిస్తుంది.!
-కె.బి. గోపాలం
Friday, January 20, 2012
ఏకాదశి తాంబూలం - తాతాచార్ల కథ
వక బ్రాహ్మణుడు వక అగ్రహారములో ఏకాదశి నాడు తాంబూలం వేసుకుంటూ ఉండెను.
యింక వక బ్రాహ్మణుడు చూచి అయ్యో వోయి బ్రాహ్మణుడా తెలిసినవాడ వైయ్యుండిన్నిఏకాదశినాడు ప్రొద్దుననే
యిట్లా తాంబూలం వేసుకోవడం యుక్తమేనా అని అడుగగా వుల్లిగడ్డల కంపు పోవద్దా అని చెప్పెను.
అయ్యయ్యో ఉల్లిగడ్డలు కూడా తింటివా అని అడిగెను.
పుల్లని చద్ది అన్నములోకి వుల్లిగడ్డలు కొరుక్కోకపోతే సయిస్తున్నదా అని చెప్పెను.
అయ్యయ్యో నేటిదినం ఉపవాసం వుండగా చల్ది అన్నము కూడ తింటివా అని అడిగెను.
చల్ది అన్నము తినకపోతే మేహకారకం అణుగునా అని చెప్పెను.
ఆహా మేహకారకపు రోగము కూడానా అని చెప్పెను.
ఇందున గురించిన శ్లోకం
భిక్షో మాంస నిషేవణం కిముచితం
కింతేన మద్యం వినా
మద్యంయంచాపి తవ ప్రియం
ప్రియమహో వారాంగనాభిస్సహ
వారస్త్రీ రతయే కుతస్తవ ధనం
ద్యూతేన చౌర్యేణవా
చౌర్య ద్యూత పరిశ్రమోపి భవతాం
భ్రష్టస్య కావా గతిః
(ఓ సన్యాసీ మాంసం తినడం తగునా
మద్యపానమన్న తర్వాత మాంసం లేక రుచించదుగదా
మద్యం కూడా తమకు ఇష్టమా మహాశయా
ఇష్టమా యమ ఇష్టం. వారాంగనలంటే కూడానయ్యా
వేశ్యవాటికలకు వెళ్లడానికి మరి తమకు డబ్బో
జూదం లేకుంటే దొంగతనం.
తమకు చౌర్య ద్యూత ప్రావీణ్యం కూడానా స్వామీ
భ్రష్టుడయిన వాడికి మరి బ్రతుకుదెరువేదయ్యా)
షోలే సినిమాలో ధర్మేంద్ర గుర్తొచ్చి ఉండవలె.
Tuesday, January 17, 2012
Thursday, January 5, 2012
Sunday, December 11, 2011
Subscribe to:
Posts (Atom)