నేను తెలుగులో చాలా రాశాను. పుస్తకాలు కూడా. ఇంకా రాస్తూనే ఉన్నాను. సైన్సు,సాహిత్యం, సంగీతం, కళలు నా హాబీలు.
Saturday, September 15, 2012
Thursday, September 13, 2012
మనిషి - దాయాదులు
మానవ పరిణామం గురించిన చర్చలో కో తుల ప్రసక్తి రావడం సహజం. ‘కోతులు, మన తాతల తాతలు’ అన్నమాట అందరికీ తెలిసిందే. మరి మన దాయాదులంతా ఏమయినట్టు? కోతి (ఏప్) జాతి నాలుగు భాగాలుగా విడిపోయింది.
హోమో (ఈ జీనస్‌లోనే మనుషులనే మనమూ ఉన్నాము): హోమో జాతిలోని మిగతా ఉపజాతులు లేదా ప్రజాతులు అన్నీ అంతరించిపోయినయి. శాపియెన్స్ అనే మనం మాత్రం మిగిలి ఉన్నాము. ఈ జాతి 24 లక్షల సంవత్సరాల నాడు మొదలయిందని అంచనా. హోమో శాపిమెన్స్ అనే ఆధునిక మానవజాతి మాత్రం రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో మొదలయిందని పరిశోధకులు లెక్కతేల్చారు. గ్రేట్ ఏప్స్ జాతిలో బాగా సంఖ్య పెరిగిన ఉపజాతి ఇది ఒక్కటే. ప్రపంచంలో వీరి సంఖ్య ఏడు బిలియన్లు దాటింది.
పాన్ (చింపాంచీలు, బూనోబోలు ఉండే జాతి లేదా జీనస్): గ్రేట్ ఏప్స్‌లో మానవుల జాతితో చాలా ఎక్కువ పోలికలు గల జాతి ఇది. చింపాంజీలు, మనుషుల జన్యు పదార్థం (డిఎన్‌ఎ)లో తొంభయి తొమ్మిదిశాతం ఒకే రకంగా ఉంటుందని 1973లోనే కనుగొన్నారు. ఈ జాతిలో చింపాంజీలు, బోనోబోలు అనే రెండు ఉపజాతులున్నాయి. అవి పది లక్షల సంవత్సరాల నాడు వేరు వేరు ఉప జాతులయ్యాయి. ప్రస్తుతం మాత్రం ఈ రెండు రకాలు కూడా అంతరించే దశకు చేరుకున్నాయి.
పోంగో (ఒరాంగుటాన్‌ల జాతి): గ్రేట్ ఏప్స్‌లోని ఒరాంగుటాన్స్ అనే జాతి ఒక్క ఆసియా ఖండంలో మాత్రమే ఉంది. ఇరవయి సంవత్సరాల కింద కూడా ఈ జంతువులన్నీ ఒకే జాతిగా లెక్కింపబడుతూ ఉండేవి. జన్యువుల పరిశీలన, సీక్వెన్సింగ్ తర్వాత ఒరాంగుటాన్‌లో రెండు ఉప జాతులు ఉన్నట్టు తెలిసింది. బోన్నియాలో ఉండే జాతి పోంగో పిగ్మేయియన్ ఒకటి. సుమత్రాలోని పోంగో ఎబెలియై మరొకటి.
గొరిల్లా (గొరిల్లాల జాతి): గొరిల్లాలన్నీ ఒకే జాతి అనే భావన చాలా కాలం వరకు ఉండేది. కానీ, ఈ జాతిలో అంతకుముందు అనుకున్నట్టు మూడు ఉప జాతులు కాక, రెండు జాతులు, వాటిలో నాలుగు (ఒక్కొక్క జాతిలో రెండు) ప్రజాతులు ఉన్నాయని గుర్తించారు. పడమటి గొరిల్లా, తూర్పు గొరిల్లా అనేవి రెండు జాతులు. వీటిలో రెండు ఉపజాతులు ఉన్నాయి. తూర్పు గొరిల్లాలో మూడవరకం కూడా ఉందని ఈ మధ్యన పరిశోధకులు గమనించారు.
తాతగారు బూనోబో: కోతుల్లో అందరికన్నా దగ్గరి చుట్టం మనకు ఈ బూనోబోగారే! మూడు అడుగులకు మించని ఎత్తు, 40కిలోలకు మించని బరువు ఈ తాతగారి లక్షణాలు. పండ్లు, గింజలు, ఆకులు, పూలు మాత్రమే తింటారు. అప్పుడప్పుడు మాంసం కూడా తింటారు. చూడడానికి చింపాంజీలాగే ఉన్నా, ముఖం మరింత చదునుగా, నల్లగా ఉంటుంది. కనుబొమలు కూడా చదునుగా ఉంటాయి. శరీరం, సన్నగా ఉంటుంది. వర్షారణ్యాలు, చిత్తడి అడవులకు ఈ జాతి పరిమితమయి ఉంది. మొత్తం సంఖ్య 5 నుంచి 50వేల మధ్య ఎంతయినా ఉండవచ్చు. మనిషి కారణంగా వీటికి తగిన జాగా మిగలడం లేదు. మనుషులు పట్టి పెంచుతున్నారు కూడా. కనుక, ఈ జాతి అంతరించే స్థితికి వచ్చింది.

Tuesday, September 4, 2012
Sunday, September 2, 2012
కవిత
ఈ కథ గ్రీసు దేశంలో వేలాది సంవత్సరాలకు ముందు ఎపుడో జరిగింది.
ఎథెన్స్ నగరానికి వెళ్ళే దారిలో ఇద్దరు కవులు కలుసుకున్నారు. కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకున్నారు. నమస్కారాలు, క్షేమ సమాచారాలు మామూలుగానే సాగాయి.
కవులు గనుక సంభాషణ సహజంగా, కవితల వేపునకు మరలింది. ఒక కవి మరొక కవిని అడిగాడు గదా! ‘అయ్యా! ఈ మధ్యన తాజాగా ఏమి వ్రాశారు? తప్పకుండా ఏదో రాసే ఉంటారుగా’ అని!
మొదటి కవి సంతోషంగా ముఖం పెట్టి ‘ఇప్పుడిప్పుడే ఒక మహత్తరమయిన కవిత రాయడం ముగిసింది.
అది నా కవితల్లోకెల్లాగొప్పది. అంతేగాదు, మన భాషలోనే గొప్ప కవిత అదే. అది నేను దేవుడి గురించి స్తుతిస్తూ రాశాను’ అన్నాడు.
కవి అంతే సంతోషంగా తన ముల్లెలోనుంచి కవిత రాసిన పార్చ్‌మెంట్ తీశాడు. ‘ఇదుగో! కవిత! నాతోనే ఉంది. చదివి వినిపిస్తాను. వింటారుగదా! రండి! ఆ సైప్రస్ చెట్టు కింద నీడలో చేరి కవిత అందాన్ని అనుభవిద్దాం!’ అన్నాడు.
కవితాగానం సాగింది. అది మరీ పొడుగాటి కవిత
‘గొప్ప కవితండీ! ఇది కలకాలం నిలిచి ఉంటుంది. తమ కీర్తిని నిలబెడుతుంది!’ అన్నాడు విన్న కవి.
ప్రశాంతంగా విని మొదటి కవి లాంఛనంగా ‘మరి తమరేమి వ్రాశారో? వినవచ్చునా అంటూ అడిగాడు.
‘నేను నిజంగా అంతగా ఏమీ వ్రాయలేదంటే నమ్మండి. తోటలో ఆడుతున్న కుర్రవాడి గురించి సరిగ్గా ఎనిమిదంటే ఎనిమిది పంక్తుల కవిత ఒకటి మాత్రం రాశాను’ అంటూ ఆ కవిత వినిపించాడు.
‘్ఫరవాలేదు. బాగానే ఉంది’ అన్నాడు మొదటి కవి.
తరువాత వారు ఎవరిదారిన వారు పోయారు.
తరాలు గడిచాయి. రెండు వేల సంవత్సరాలయింది. కవి రాసిన ఎనిమిది పంక్తుల కవిత ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువదింపబడింది. ఆ కవిత తెలియని మనుషులు ఉండరంటారు.
మొదటి కవిగారి దీర్ఘకవిత కూడా నిలిచి ఉంది. కానీ అది గ్రంథాలయంలో, పండితుల సేకరణలలో మాత్రమే ఉంది. దాన్ని ఇష్టపడేవారు లేకపోలేదు. కానీ చదివినవారు మాత్రం తక్కువ.
-ఖలీల్ జిబ్రాన్ నుంచి

Saturday, September 1, 2012
ఆంగ్లంలో మనుచరిత్ర
‘అల్లసాని పెద్దన’ మనుచరిత్ర- ఆంగ్లం.
అనువాదకులు: శిష్ట్లా శ్రీనివాస్
పేజీలు:404;
వెల: రూ.495/-
దృశ్యకళా దీపిక ప్రచురణలు;
లాసన్స్ బేకాలనీ, విశాఖపట్నం
తెలుగులో కావ్యాలు అనగానే, అందరికీ ముందు గుర్తుకువచ్చేది మనుచరిత్ర. మనుచరిత్ర అనగానే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది ప్రవర వరూధినులు. కానీ, ఈ కథలో ప్రవరునికి పాత్ర లేదు. వరూధినికి స్వరోచి, అతనికి స్వారోచిషుడనే మనువు పుట్టాలి. అది మనుచరిత్ర. కథను తెలుగు చదవలేనివారికి కూడా అందించే పద్ధతిలో శిష్ట్లా శ్రీనివాస్‌గారు ఈ ఇంగ్లీషు అనువాదాన్ని స్వయంగాచేసి, ప్రచురించారు. ఇంతకుముందు ఈయనే ఆముక్తమాల్యదను ఆంగ్లంలో అందించారు.
శ్రీనివాస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళల విభాగంలో కళాచరిత్ర బోధకులు. శిల్పం, చిత్రకళ మీద జరిపే పరిశీలనలు, పరిశోధనలతో వారి దృష్టి సారస్వతంవేపు మళ్లింది. భూమి గుండ్రంగా ఉందని చూపే బొమ్మలు, శిల్పాల ప్రేరణతో ఆయన ‘కపిత్థాకార భూగోళ’అనే పుస్తకం రాశారు. శ్రీకృష్ణదేవరాయలు, గురజాడవారు వీరిని ఎంతో ప్రభావితం చేశారు. రాయల రచనను ఆంగ్లంలోకి అనువదించడానికి అదే ప్రేరణ అనవచ్చు. రాయలను సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా భావించి తన కావ్యాన్ని అంకితమిచ్చిన పెద్దన మనుచరిత్ర, క్రమంలో తరువాత వచ్చింది.
కృష్ణదేవరాయలకు తాను దాసీపుత్రుడన్న జనవాక్యం, బాధాకరంగా తోచడం సహజం. రాయల వ్యాసంగంలో ‘స్వారోచిష మను సంభవం’ తగిలింది. ఆ మనువుకూడా రాణికి పుట్టినవాడు కాదు. కనుక రాయలు ఆ కథను పెద్దన చేత తెలుగులో వ్రాయించాడు. అందులో ప్రయత్నంగా పెద్దన కొన్ని మార్పులుచేర్పులతో కథను మలిచి మహత్తర కావ్యంగా రాయలకు అంకితం చేశాడు. మనువుల కథ సంస్కృతంలో మార్కండేయ పురాణంలో వస్తుంది. దాన్ని మారన తెలుగు కావ్యంగా మలిచాడు. రాయలు కూడా రచన అదే మార్గంలో ఉండాలని పెద్దనకు సూచించాడు. అల్లసాని కవి మాత్రం మారన పేరు కూడా ఎత్తకుండా కథను మహా రంజకంగా వెలయించాడు. ఆంధ్ర(!) కవితా పితామహుడనిపించుకున్నాడు. ఆ కావ్యాన్ని శ్రీనివాస్ ప్రస్తుతం, పద్యానికి పద్యం, పాదానికి పాదంగా ఆంగ్లంలో అందించాడు.
శ్రీనివాస్ స్వతహాగా పరిశోధకుడు. తాను తెలుగు, సంస్కృతాలలో పండితుడిని కానని తానే చెపుతాడు. కానీ, కావ్యం ముందు వెనుకల గురించి ఎంతో పరిశీలించి ఎనె్నన్నో అంశాలను కూడా ఈ పుస్తకంలో అందించాడు. కథను సూక్ష్మంగా అందించడం అవసరం. దాన్ని మరీ సూక్ష్మంగా అందించి మరెన్నో విషయాలను మాత్రం చాలా వివరంగా, 100 పేజీలకు పైన వ్యాసాల రూపంలో ఇచ్చాడు. అనువాదం పద్ధతి, అక్నాలెజ్‌మెంట్స్ తర్వాత, ప్రవేశికలో ప్రారంభించి, పురాణాలు, మూడుసార్లు వచ్చిన మనుకథలలో తేడాలు, రాయలు, అల్లసాని, వారి గురించి కావ్యం గురించి ఇచ్చిన సమాచారం తెలిసిన వారికి కూడా కొత్త ఆలోచనలను అందజేసే తీరులో ఉంది. కళాదృష్టితో చూచి ఈ అనువాదకుడు, కథ ఔట్‌డోర్, ఇన్‌డోర్‌లలో నడిచిన తీరు గురించి చేసిన వ్యాఖ్యానం చాలా బాగుంది.
కృష్ణరాయలు, పెద్దనలిద్దరూ వైష్ణవ గురువుల శిష్యులు. ఆముక్త మాల్యద అనువాదం నాటికి శ్రీనివాస్‌కు అంతగా అందని వైష్ణవం విశేషాలు ఈ పుస్తకంలో సవివరంగా కనిపిస్తాయి. కావ్యం అయిన తరువాత యిరవయి పుటలలో ఇచ్చిన వివరాలు, గొప్ప పరిశోధన దృష్టికి నిదర్శనాలు.
అల్లసాని పెద్దన గురించి చెప్పేవారంతా ‘అల్లిక జిగిబిగి’గురించి వ్యాఖ్యానిస్తారు. పెద్దన రచనలో సంస్కృతం ఎక్కువ. అయినా మాటలు మంచి పట్టుగల నడకలో సాగుతాయని చెప్పక తప్పదు. ‘లంబమాన రవి రథతురగ చారుచామర’ లాంటి మాటలు ఎందరికో కలకాలంగా గుర్తున్నాయి. ప్రవరుడు హిమాలయాలకు వెళ్లి (అపజనించె)న, తరువాత పద్యమంతా సంస్కృతమే. అంబర చుంబి శిరస్సరజరీ అంటూ పద్యం జలపాతంలాగే సాగుతుంది. దాన్ని శ్రీనివాస్ ఆంగ్లంలో ఎట్లా రాశారు? నిజమే, ఈ పద్యంలోనే కాదు, మొత్తం కావ్యంలోనే, ఆంగ్లంలో, అల్లిక జిగిబిగి కానరాదు. ఇది వ్యాఖ్యానాలమీద ఆధారపడి చేసిన అనువాదమని శ్రీనివాస్ స్వయంగా చెప్పాడు. ఇంగ్లీషులో కావ్యాన్ని చదివే వారికి, మూలం నడక తెలియదుకానీ, ఏ భావమూ, అభివ్యక్తీ జారకుండా అనువాదం సాగింది. మూలం చదివి, అర్థంచేసుకున్న వారయినా, ఈ విషయాన్ని సహృదయతతో ‘బాగుందం’టారు.
అనువాదకుని అసలు ఆసక్తి శిల్పంలో! ఆముక్తమాల్యద అనువాద గ్రంథంలోలాగే ఈ పుస్తకంలో కూడా, ఎన్నో ఫొటోలు పొందుపరిచారు మరి. ఈ చిత్రాలన్నింటికీ కథలోని సందర్భంతో సంబంధం ఉందా? కొంతవరకు ఉంది. చాలావరకు లేదు. కానీ అరుదయిన శిల్పకళను చూచిన ఆనందం మాత్రం పాఠకునికి మిగులుతుంది.
అల్లసానివారి అల్లిక ‘జిగి బిగి’అంటే ‘విగరస్ అండ్ టైట్’అనే విశేషణాలను వాడారు వ్యాసంలో. ముక్కు తిమ్మనార్య ముద్దుపలుకులను, పదాలు ముద్దులవలె ఉన్నాయని అర్థం వచ్చే మాటలతో అనువదించారు. ముద్దుపలుకులంటే, ముద్దొచ్చే పలుకులేమో? ముఖ పత్రం మీద కృష్ణరాయల బొమ్మ (శిల్పం) ఉంది అల్లసాని పెద్దన, శిష్ట్లా శ్రీనివాస్‌ల పేర్లున్నాయి. రెండు పేర్లలోని స,శ,ష లకు ఒకే ఎస్‌ను వాడారు. ఈ పద్ధతిని గురించి అందరూ ఆలోచించాలి.
ఈ అనువాదంతో శ్రీనివాస్ ఆంధ్ర సాహిత్యానికి గొప్ప ఉపకారం చేశారు. వారింకా ఏయే కావ్యాలను అందిస్తారోనని అంతా ఎదురుచూస్తారు. పుస్తకంలో అచ్చుతప్పులు (అక్కడక్కడ) ఉన్నాయి. పాయసంలో పుడకల్లాగ!
Thursday, August 30, 2012
ఇంకా కొంచెం
‘చదువు బాగానే సాగింది. ఉద్యోగం కూడా దొరికింది. లేదంటే త్వరలోనే దొరికేట్లు ఉంది. కానీ, ఏవో కొన్ని పనులు మాత్రం అనుకున్నట్లు జరగడంలేదు’. ఎక్కడుంది చిక్కు? మీరుకూడా ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడుగుతున్నారా? ఈ ప్రశ్న అడగనివారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరంటే ఆశ్చర్యం లేదు. చాలా విజయవంతంగా బతుకుతున్నారన్న వారిని కూడా అడిగితే, చాలాసార్లు, ఆ విజయం ఎట్లా వీలయిందీ చెప్పలేకపోతారు. వారికి కూడా, అందని సంగతులు కొన్ని ఉండనే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, కొన్ని పనులు చేతవుతాయి. కొన్ని కావు! తెలివిగల వారందరికీ చదువు అంటదు. బాగా చదువుకున్నవారందరూ గొప్పవారు కాలేరు.
మనకు ఏం కావాలి?
సంతోషంగా ఉన్నాను, అంటే, ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పగలరా? అని అడిగిన పెద్దమనిషి, నిజంగా గొప్పవాడనిపించేది. కానీ, తరువాత ఆయనకు పట్టిన గతి మాత్రం మరెవరికీ రాకూడదు. అందరూ విజయాన్ని కోరేవారే. మీ దృష్టిలో విజయమంటే ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు కష్టం. డబ్బు సంపాదించడం చాలా సులభమూ, ఫాషనబుల్ అయిపోయింది. అదే విజయానికి గుర్తింపుగా మారింది. అందులో కూడా ఒక నిర్దుష్టత లేదు. డబ్బు కావాలి, నిజమే, కానీ, ఎప్పటిలోగా ఎంత డబ్బు సంపాదించదలుచుకున్నదీ తెలిస్తే, పథకం సులభమవుతుంది. ఎక్కడికి చేరాలో తెలిస్తే, నడక బాగా సాగుతుంది. చేరిన తరువాత గమ్యాన్ని మరింత ముందుకు నెట్టవచ్చు. నిద్ర సరిపోవడం లేదు. మరింతసేపు నిద్రపోతే బాగుండును, అనుకుంటాము. అది కుదరదేమో? ఇవాళ పది గంటలకు, పడకమీద ఉండాలి, అనుకుంటే, అనుకున్నది సాధించామా? లేదా తెలుస్తుంది.
ఒకే గమ్యం కాదు!
ఒకాయన కోసం యమదూతలు వచ్చారట. ‘పోండి అవతలకి! నేనొక వేపు పని తెమలక ఛస్తుంటే, మీ గోల ఏమిటి?’ అన్నాడట ఆయన. నిజమేనేమో అనుకుని, వచ్చినవారు వెళ్లిపోయారట! ఈ మధ్యన ఎవరికీ, ఏ పనికీ తీరిక ఉండడంలేదు. వంద పనులు తలకెత్తుకుని బతుకుతుంటాము. ఒక పనిలో మునిగి ఉంటాము. మరేదో పనిలో విజయం అందే అవకాశం వస్తుంది. పనిలో ఉండి, దాన్ని గుర్తించలేకపోతాము. నిద్రపోవాలని గుర్తురాక, నవల చదువుతూ కూచుంటాము అని చెపితే, పరిస్థితి మరింత బాగా అర్థమవుతుందేమో? వికాసం అంటే, బాగా సంపాదించడం, బాగా బతకడం అని భావం. ఈ బాగా అన్నమాటలో ఎన్ని అంశాలున్నాయి. ఒక కాగితం మీద రాసుకుంటే బాగుంటుంది. వాటన్నిటినీ, ఒక పద్ధతిలో చేస్తూ, ముందుకు సాగే రకంగా బతుకును తీర్చుకోవచ్చు. అనుకున్న పనులను, ఎక్కడ, ఎప్పుడు చేస్తాము అన్న పథకం, కళ్లముందుండాలి. అందులోనూ మళ్లీ లెక్కలుండాలి. బుధవారం యువ చదవాలని నిర్ణయించుకుంటే, అందుకు సమయాన్ని మెదడే కనుక్కుని ఏర్పాటు చేసే వీలు ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు.
అన్నీ అనుకున్నట్లు జరగవు!
కనుకనే నిర్ణయాలు, పథకాలు, ప్రణాళికలు కావాలంటున్నాము. ఏ పని, జరగవలసిన సమయానికి జరగలేదు? బుద్ధిగా లెక్క చూస్తే, విషయం తెలిసిపోతుంది. మరెవరో వచ్చి, ‘నీవు ఈ పూట అన్నం తినలేదని చెప్పే వీలు లేకపోవచ్చు. మనమే, ఆ సంగతిని (కూడా) పట్టించుకోవాలి. ఎందుకు తినలేకపోయిందీ తెలిస్తే, కార్యక్రమాలను, పద్ధతులను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఏర్పాటు చేయవచ్చు. చదువు, పని, వ్యాయామం మిత్రులు, మనవారు, ముందు జరగవలసిన పనులు అన్నింటిలోనూ, ఏం జరిగిందీ లెక్క తెలిస్తే ఇక ముందు జరగవలసిన కార్యక్రమాలు, మారవలసిన అవసరం, అనవసరం అర్థమవుతాయి. కొన్ని సంగతులను నిత్యం లెక్క చూడాలి. కొన్నింటిని వారానికి ఒకసారి చూడాలి. ఈ తేడా కూడా తెలిసి ఉండాలి. పథకం వేయాలంటే, ముందు, గతం గురించి తెలిసి ఉండాలి గదా!
ఇంతకంటే ఏం చేయగలము?
అంతా సంతోషంగా సాగుతున్న వారి ముందు కూడా ఈ ప్రశ్న ఉండి తీరాలి. ఇంత చాలు అనుకుంటే, అది సులభంగానే దొరుకుతుంది. కానీ, అంతటితో బతుకు తెల్లవారిందన్న భావం మాత్రం కలగకూడదు. గమ్యాన్ని మరింత ముందుకు కదిలించడమని ఒక పద్ధతి ఉంది. ఆకాశాన్ని అందుకుందామని ఎగిరితే, అందకపోవచ్చు. చెట్టుమీది పండు మాత్రం సులభంగానే అందవచ్చు. పండు అందుకున్నందుకు సంతోషం సరయినదే, కానీ ఆ తరువాత మరో గమ్యం ఉండాలి. ఆ తరువాతి గమ్యాన్ని కూడా అందుకుంటామన్న నమ్మకం సులభంగా వీలవుతుంది. అందుకు కావలసినదేదో మనలో ఉందన్న నమ్మకం ఎంతో ముఖ్యం. ఆ ‘ఏదో’ నిలిచి ఉండి, పని ముగిసేదాకా సాయంగా రావడం, వచ్చేలా పని చేయడం, అంతకన్నా ముఖ్యం.
నాకు ఇంతే వచ్చు!
అనుకుంటే, ఆ తరువాతి సంగతి గురించి ఆలోచనే రాదు. వంద మీటర్ల పరుగును పది సెకండ్లకన్నా తక్కువలో ఎవరూ పూర్తి చేయలేరు అనుకున్నారు. అందరూ ఆ గమ్యంతోనే పరుగెత్తారు. ఎవరో ఒకతను, తక్కువ సమయంలో పరుగెత్తి చూపించాడు. మిగతా వారికి కూడా నమ్మకం కలిగి, అందరూ ‘అసాధ్యాన్ని సాధించారు’. ఉసేన్ బోల్ట్, తన రికార్డును తానే పడగొట్టగలిగాడు. నేను మారగలను, అనుకున్న తరువాత, మారవలసిన సంగతులు కళ్లముందు నాట్యమాడతాయి. ఆ ఆలోచన రానంతవరకు అంతా శూన్యంగానే కనబడుతుంది. బెస్ట్ తర్వాత కూడా ఏదో ఒకటి ఉండి తీరుతుంది!
అటునుంచి నరకడం అని ఒక పద్ధతి ఉంది. వంద, అనుకున్నాము. ఒకటి నుంచి మొదలుపెట్టాము. 90 తర్వాత, మనసు ‘చాల్లే!’ అంటుంది. కనుక, వందతో మొదలుపెట్టి, తగ్గింపు పద్ధతిలో లెక్కపెడుతుంటే, సున్నా వచ్చిన దాకా, ఆగకూడదని, ఆ మనసే చెపుతుంది. మరుసటి నాడు నూట ఇరవై నుంచి తగ్గిస్తూ వచ్చే వీలు కూడా ఉంటుంది.
మాటలతో కుదరదు!
కొన్ని మాటలు వినడానికి, చదవడానికి బాగుంటాయి. ‘నిజం!’ అనిపిస్తాయి. పక్కకు కదిలిన తరువాత, ఆ మాటలు కూడా, మనసు తెరమీద నుంచి మరలిపోతాయి. కనుకనే మననం అనే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. నచ్చిన పద్ధతులను, అమలు చేసుకోవాలి. ఒక్క అంశంలో మంచి ఫలితాలు కనిపిస్తే, దాన్ని బట్టి ఆ పద్ధతిని మన స్వభావంగా మార్చుకోవాలి.
తెలిస్తే బాగుండేది, అనుకుంటే ఏదీ తెలియదు. తెలిసింది కొంతయితే, ఇంకా కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో ఉందాము! కొంతయినా తెలుస్తుంది!

Wednesday, August 29, 2012
మనుషులంతా ఒక్కటే(నా?)
చుట్టూ చూడండి. మీవంటి స్వభావం గలవారు ఎక్కడోగాని ఉండరు. మీవంటి రూపం గలవారు అసలే కనపడరు. ఇక నూటికి నూరుశాతం మీ వంటివారు ఉండరుగాక ఉండరు. ఇంతమంది మనుషులు కనబడుతుంటారు. అయినా అందరూ అన్నిరకాలుగానూ ఉంటారు. ముఖాలు, శరీరాలు, నడవడి, తీరు అన్నీ ఎవరి తీరు వారిదిగానే ఉంటాయి. ప్రపంచంలోని మనుషులందరినీ ఒకచోట చేర్చినా లెక్క అంతే! ఈ భూ ప్రపంచంలో ఈ క్షణాన మనుషుల సంఖ్య 705 కోట్లపైన ఎక్కడో ఉందని అంచనా. గడిచిన 50 వేల సంవత్సరాలలో పదివేల కోట్లమంది పుట్టి గతించారని లెక్క చెపుతున్నారు. మరి అంతమందికీ ఎవరి ప్రత్యేకత వారికి ఉండేది. ఇకమీద పుట్టే వారందరూ కూడా అదే రకంగా ఉంటారు. ప్రతి తల్లీ- పుట్టిన ప్రతి సంతునూ ‘చుక్కల్లో చంద్రుడ’నే అంటుంది మరి!
ఆశ్చర్యంగా అందరూ మనుషులే. కానీ అందరూ ప్రత్యేకత గలవారే. జీవ వైవిధ్యం చాలా గొప్పది అనుకుంటే, శతకోటి జీవాలలో ఒకటయిన మానవజాతిలోని వైవిధ్యం అంతకన్నా ఎంతో గొప్పదని అర్థం. ఇందరిలోనూ ఎవరి గుర్తింపు వారిదిగా ఉండడానికి, ఆధారాలను వెదుకుతూ లోతులకు పోవచ్చు. అక్కడ మనకు డిఎన్‌ఏ, వేలి ముద్రలు, కంట్లో గీతలు మొదలయినవి ముందు కనబడతాయి. ఇంకొంచెం లోతుకు పోతే మరెన్నో సంగతులు ఆశ్చర్యం కలిగిస్తాయి.
జన్యు పదార్థం- డిఎన్‌ఏ
వైవిధ్యం మొత్తానికి మూలకారణమంతా ఇందులోనే ఇమిడి ఉంది. ఇదొక గట్టి నిజం. మనం మనంగా, మీరు మీరుగా ఉండడానికి ఆధారం ఈ జన్యు పదార్థమే. ఇక్కడ కూడా కొన్ని లెక్కలున్నాయి. 2001లో మానవుల డిఎన్‌ఏ మొత్తాన్ని మ్యాపింగ్ చేశారు. మనుషులందరిలోనూ 99.9 శాతం డిఎన్‌ఏ ఒకేరకంగా ఉంటుంది, అన్నారు. అంటే, ఇప్పటివరకూ మనం లెక్కించిన వైవిధ్యానికి కారణం 0.1 శాతం మాత్రమేనని అర్థం. గడిచిన పదేళ్ళలో లెక్కలు వేసి తేడాను 0.5 శాతంగా పెంచారు. వైవిధ్యం దృష్టితో చూస్తే అది కూడా తక్కువే మరి! లెక్కను మరింత ముందుకు నడిపితేగాని సంగతి అర్థం కాదు. మనిషి డిఎన్‌ఏ- అనే పుస్తకంలో 320 కోట్ల అక్షరాలుంటాయి. అందులో 0.5 శాతం అంటే సుమారు కోటి అరవయి లక్షలు. వాటిలో మళ్లీ రకరకాల కలయికలు. ఒకటి, రెండు అన్న రెండు అంకెలుంటేనే, 1, 2, 12, 21, 122, 111, 121.. ఇలా కొన్ని అంకెలు వీలవుతాయి. ఇక కోటి అరవయి లక్షల అక్షరాలుంటే ఎన్నో రకాల కలయికలు వీలవుతాయని ఊహించడం కూడా కష్టం. ఇప్పటివరకు పుట్టి, చనిపోయిన వారి సంఖ్య ఆ వీలయ్యే రకాలలో ఎంతమాత్రమూ కాదని తేలిపోతుంది. అంతమందిలో కూడా ఒకే రకం జన్యు అక్షర క్రమం ఉండే వీలు ఇంచుమించు సున్నా మాత్రమే. కవలలో కూడా ఆ వీలు లేదు. అందుకే కవలలను గుర్తించడం వీలవుతుంది. మొదట్లోవారు ఒకే రకం జన్యు పదార్థంతో మొదలవుతారు. పెరిగిన కొద్దీ తేడా పెరుగుతుంది. జన్యు పదార్థం కాపీ జరిగితేనే కణాలు పెరుగుతాయి. శరీరం పెరుగుతుంది. ఈ కాపీ జరిగే సమయంలో మ్యుటేషన్స్ అనే చిన్న మార్పులు జరుగుతాయి. కవలల మధ్య తేడా రావడానికి ఈ మార్పులు చాలు. ఇక జన్యువులు పనిచేసే తీరును అదుపు చేసే మార్కర్ జన్యువులలో మార్పు వస్తుంది. కవలలుగానీ మిగతావారు గానీ, ఎవరిదారిన వారు పెరగడానికి ఈ మార్పులు కారణాలవుతాయి. జరిగే మార్పులన్నింటికీ ప్రభావం బయటకు కనిపించదు. కానీ, చిన్న మార్పుల ప్రభావం పెద్ద ఎత్తున కనబడుతుంది. మీరు మీలాగే ఉన్నారంటే, అందుకు మీ జన్యువులే ఆధారం. జన్యువులు మాత్రమే ఆధారం కావు. వాతావరణం, అమ్మ కడుపులో వాతావరణం లాంటివి కూడా ఈ ఆధారాలలో కొన్ని.

అసలయిన గుర్తింపు- వేలి ముద్రలు
వేలిముద్రలు ఎవరివి వారివేనని అందరికీ తెలుసు. వీటి వెనక జన్యువులు కారణంగా ఉంటాయని తెలియకపోవచ్చు. కనీసం వాటి సైజు, ఆకారాలు జన్యువుల మీద ఆధారపడతాయి. కానీ, అమ్మ కడుపులో ఉండగా- శిశువు మీద ఉమ్మ సంచి ఒత్తిడి పెడుతుంది. అందులోని నీరు కదులుతూ కుదుపుతుంది. వీటి ప్రభావంతో వేలి ముద్రలు మారతాయంటే నమ్మగలరా? నమ్మక తప్పదు. ఒకే రకంగా ఉండే కవలల్లో కూడా వేలిముద్రలలో కొంతవరకు తేడాలుంటాయి. లోపలి వాతావణం వారిమీద, అంత సమానంగా ఉండకపోవడం అందుకు కారణం. ఒక గీత రెండుగా విచ్చుకునే చోటులో తేడా, శంఖం, చక్రాలలో గీతల మధ్య బాగా వేరుగా ఉంటాయి. కాలి గీతల్లో కూడా ఈ తేడాలు కనబడతాయి.
నేర పరిశోధనలో వాడుకుంటారుగానీ, నిజానికి మనకు వేలిముద్రలవల్ల ప్రయోజనం ఉందా? ఉంటే ఏమిటి? అన్నసంగతి ఇప్పటికీ అర్థం కాలేదు. అందరూ సులభంగా ‘ఆ గీతల వల్ల పట్టు దొరుకుతుంది!’ అంటారు. కానీ వాటివల్ల పట్టు సడలుతుందని పరిశోధకులు గుర్తించారు. చర్మం విస్తారం పెరుగుతుందనీ, చర్మానికి సాగే శక్తి వస్తుందని, స్పర్శ బాగా తెలుస్తుందనీ ఎన్నో చెప్పుకున్నారు. వీటిలో ఏది ఎంత నిజమని తేలలేదు. మొత్తానికి వేలిముద్రలు లేకుండా కూడా మనం బతకగలుగుతామని తెలిసిపోయింది. జన్యువులలో అనుకోని మార్పుల కారణంగా అయిదు కుటుంబాలలో కొందరు వేలిముద్రలు లేకుండా పుట్టారు. వాళ్లందరూ బాగానే బతుకుతున్నారట.
ముఖం చూడు..
ఎవరి ముఖం వారికి గుర్తింపు. శరీరంలోని భాగాలన్నింటినీ చూడడం ఒక ఎత్తు. మనిషిని గుర్తించడానికి ముఖం చూడడం మరో ఎత్తు. అయినా ముఖాలలో నిజానికి అంతగా తేడా ఉండదట. మీ లాంటి ముఖం పోకడలు, పోలికలు గలవారు అక్కడో ఇక్కడో ఉండనే ఉంటారు. మనమనుకుని మరెవరినో పలకరించిన వారు, కనీసం అనుకున్నవారు మనకు ఆ సంగతి చెప్పి ఉంటారు కూడా. కంప్యూటర్‌లో ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ వచ్చింది. ప్రపంచంలోని మనుషులలో 92శాతం మందికి ఒకరయినా ఈ సాఫ్ట్‌వేర్‌ను కూడా తికమక పెట్టేంత పోలికలున్నవారు ఉంటారని పరిశోధనలో తెలిసింది.
ఒకేవ్యక్తి రెండు ఫొటోలను చూపిస్తే, ఈ సాఫ్ట్‌వేర్, మనుషులు తికమకపడిన సందర్భాలను పరిశోధకులు గమనించారు. ఆ ఫొటో తెలిసిన వారిదయితే గుర్తించడం కొంచెం సులభమవుతుంది. తెలియని వారిలో వయసుతో, కోణంతో వచ్చే తేడాలు తికమకపెడతాయి. అంటే, మనం ముఖం మనకు గుర్తింపు అన్న విషయంలో అనుమానం ఉందని అర్థమేమో?
నడక తీరులో తేడా
మనిషి కూడా మొదట్లో నాలుగు కాళ్లమీద నడిచేవాడు. పదిహేను లక్షల సంవత్సరాల క్రితం నిటారుగా నడవడం నేర్చుకున్నాడు. నాటినుంచి నేటివరకు అందరూ ఒకే తీరుగా నడుస్తున్నారు. ఒక కాలు ఎత్తి, మరో కాలు కన్నా ముందుకు వేయడం, తుటి నుంచి మడమ, కాలివేళ్ల వరకు ఒక రకమయిన కదలికలు కలకాలంగా సాగుతున్నాయి. కానీ, ఆ కదలికల్లో ఎక్కడో ‘కొంత’ తేడా ఉంటుంది. ఎవరి నడక తీరు పూర్తిగా వారికే ప్రత్యేకమని చెప్పడానికి లేదు. కానీ, కేవలం నడక ఆధారంగానే మనుషులను గుర్తించడానికి 90 శాతం వరకు వీలుందని 70 దశకంలోనే నిరూపించారు.
పిల్ల వయసులో నడక తీరు మారుతూ పోతుంది. శరీరం పెరుగుదల ఆగేసరికి నడక తీరు స్థిరమవుతుంది. కాళ్ల పొడుగు, తుంటి వెడల్పు, శరీరం బరువు, కండరాల తీరు లాంటి లక్షణాలు ఆధారంగా నడకకు ఒక ప్రత్యేకత వస్తుంది. ఆ నడక తీరును అందరూ గుర్తిస్తారు. వర్ణించడం మాత్రం సులభంగా కుదరదు. ఇది నడక గురించి పరిశోధకులు అంటున్న మాట. కాళ్లు, చేతులు కదిలే మార్గాన్ని గీతలలో గుర్తించి, పిరుదులు, మోకాళ్లు, పాదాలు కదలికలను లెక్కించి, ఒక దాంతో మరొక దానికి గల సంబంధాలను లెక్కించి కంప్యూటర్లు నడకను గుర్తించగలిగాయి. కాలిగుర్తుల తీరు, వాటిలో పడిన ఒత్తిడి ఆధారంగా కూడా నడక తీరును గుర్తించారు. జపాన్‌లో ఈ రకమయిన పద్ధతిలో మనుషులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్మార్ట్స్ ఫోన్స్‌లో కదలికలను గుర్తించే సెన్సర్స్ మామూలయినాయి. వాటి ఆధారంగా నడక తీరును గుర్తించే ప్రయత్నాలు కూడా ఈ మధ్యనే మొదలయినయి. సెన్సర్స్‌ను కాలికి కడితే వేగం, కదలిక లాంటివన్నీ తెలుస్తాయి. అది తెలిసిన ఫోన్- మరెవరో వాడితే పలకదు!
చెవులను గమనించారా?
మనుషులను గుర్తించడానికి వేలిముద్రలు, కంటిపాపలను వాడినట్టే చెవి తీరును వాడవచ్చు! పైగా, కాళ్లలాగే, కుడి, ఎడమ చెవులు రెండూ ఒకే రకంగా ఉండవు! ఏ ఇద్దరి చెవులూ ఒకే రకంగా ఉండవు. అమ్మ కడుపులో ఒక వ్యక్తి ఉనికి మొదలయిన తర్వాత అయిదు వారాల వరకు చెవులుండవు. అప్పుడు తలకు ఇరువేపులా ఆరేసి బుడిపెలు పుడతాయి. అవి పెరుగుతూ కలిసి చెవులవుతాయి. వాటి ఆకారానికి జన్యువులలో సమాచారం ఉంటుంది. అయినా వేలిముద్రలలాగా చెవులు కూడా అక్కడి ఒత్తిడి, ఒరిగిన దిక్కులాంటి సంగతులను బట్టి పెరుగుతాయి. మనుషుల శరీరంతోపాటు, చెవులు కూడా పెరుగుతాయి కానీ, వాటి ఆకారం మాత్రం మారదు!
చెవి గుర్తుల ఆధారంగా నేరస్తులను పట్టుకున్న సందర్భాలు అమెరికా, నెదర్లాండ్స్ దేశాలలో నమోదయి ఉన్నాయి. అయితే, ముద్రలు పడిన తీరు ఒత్తిడి కారణంగా మారుతుంది గనుక, దీన్ని పూర్తిగా నమ్మదగిన పద్ధతిగా అందరూ అంగీకరించలేదు. ముఖాన్ని చూచి తికమకపడినట్లే, చెవి విషయంలోనూ కొంత తికమక ఉంది. ఈ మాటను అడ్డుగా పెట్టుకుని యుఎస్‌లో ఒక నేరగాడు శిక్షను తప్పించుకున్నాడు కూడా!
కళ్ళలో తేడా ఉంటుంది
యుకె, యుఎస్, కెనడా లాంటి దేశాలలో మనుషులను గుర్తించడానికి కంటి పాపలను కంప్యూటర్ సాయంతో స్కాన్ చేస్తున్నారు. ‘అచ్చం అమ్మ కళ్లే’ అనడం మనం వింటూనే ఉంటాము. మరి కళ్లసాయంతో మనుషులను గుర్తించడం ఎట్లా కుదురుతుంది? కంటి పాపలో రకరకాల కండరాలు చిక్కులు పడినట్టు ఉంటాయి. వాటి మధ్యన లిగమెంట్స్, రక్తనాళాలు, రంగు కణాలు కూడా ఉంటాయి. వీటన్నింటి కారణంగా కళ్లలో రంగు, లోతు, ఎత్తులు, చుక్కలు మొదలయిన తేడాలు ఏర్పడి ఉంటాయి.
మామూలుగా కంటిపాప రంగు జన్యుపరంగా వస్తుంది. అందుకే అమ్మ కళ్లు, నాన్న కళ్లు అంటారు. కుడి, ఎడమ కనుపాపల రంగు ఒకే రకంగా ఉంటుంది. అందుకే కంప్యూటర్ సాయంతో కళ్లను స్కాన్ చేసే చోట రంగు లాంటి అంశాలను పట్టించుకోరు. ఎత్తులు, పల్లాలు, గీతలను మాత్రమే చూస్తారు. కంటిలోని ఐరిస్- వ్యక్తి పుట్టకముందే తయారవుతుంది. దాని నిర్మాణానికి జన్యువులకు సంబంధం లేదు. కనుక వాటిలోని కండరాలు, లింగమెంట్స్, రంగు కణాలు రకరకాలుగా పరచుకుంటాయి. అంటే ఏ ఇద్దరి కళ్లూ ఒకే రకంగా (పాప విషయంలో) ఉండవు.

గొంతు అంటే ధ్వని
గొంతులోనుంచి మాట బయటకు రావాలంటే ఎంతో ఫిజిక్సు జరగాలి. స్వరపేటికలోనుంచి గాలి వస్తూ ధ్వనికి కారణమవుతుంది. అది నోరు, ముక్కులలో చాలా రకాలుగా కొట్టుకుంటుంది. అంగిలి, నాలుక, పెదవులు, దవడల కారణంగా ‘మాట’వుతుంది. స్వరపేటిక, నోరు, ముక్కు, దంతాలు, కండరాలు, అన్నీ ఏ ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండవు మరి! అందుకే ఎవరి మాట ధ్వని వారిదిగానే ఉంటుంది.
వేలిముద్రలను, కంటిపాపలను మార్చ డం కదురదు. కానీ, కండరాల సాయంతో స్వరపేటికను, మిగతా భాగాలను వేరుగా కదిలించి గొంతుకను మాత్రం మార్చవచ్చు. మిమిక్రీ కళాకారుల విజయ రహస్యం అదే! కొందరి గొంతు అనుకోకుండానే మారుతుంది. మనకు తెలియకుంటే మనం గొంతును మార్చి మాట్లాడుతుంటాము.
మిమిక్రీ ఎలా వీలవుతుందని పరిశోధించారు, పరిశోధిస్తున్నారు. అందరికీ ఆ విద్య వీలుగాదు. అంటే మొత్తానికి, గొంతు, ధ్వనుల ఆధారంగా వ్యక్తులను గుర్తించడం వీలుగాదని అర్థం. గొంతును గుర్తించే పద్ధతితోబాటు మరేదో గుర్తించి కూడా ఉండాలి. మిమిక్రీ ఫెయిల్ కావచ్చు!
వాసనలు వేరుగా ఉంటాయా?
వాసనల ఆధారంగా నేరగాళ్లను పట్టడానికి కుక్కలు అవసరం. ఎవరి కంపు (కంపు అన్న మాటకు అసలు అర్థం వాసన అని మాత్రమేనని గమనించాలి!) వారిదే. అయితే ఏడు వందల కోట్ల వాసనలున్నాయా? ఉన్నాయి అని అంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. డిఎన్‌ఏలో ఉండే మూల అక్షరాలు నాలుగు. మనిషి బాహుమూలంలో 20కిపైగా వాసన రసాయనాలున్నాయి. ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. వాటిని రకరకాల కలయికలు, మోతాదులుగా చూస్తే ఎన్ని రకాల వాసనలయినా ఉండవచ్చు.
మనిషి శరీరంలో వేరు వేరు భాగాలలో వేరు వేరు స్రావాలు పుడుతుంటాయి. అక్కడ రకరకాల సూక్ష్మజీవులుంటాయి. వాసనలేని స్రావాలకు కూడా వాటివల్ల వాసన పుడుతుంది. ఒక వ్యక్తి శరీరంలో మొత్తం ఐదు వేల రకాల రసాయనాలు వాసనలకు ఆధారాలు. ఆమ్లాలు, ఆల్కహాల్స్, కీటోన్‌లు, ఆల్డీహైడ్‌లు ఈ రసాయనాలలో రకాలు. వాటిలో కనీసం 44 మాత్రం వేరువేరుగా ఉంటూ, వేలిముద్రలలాగే రకరకాల వాసనలకు కారణమవుతాయి. ఈ రసాయనాలకు వాసన కలిగించడం తప్ప మరో పని లేదని కూడా గుర్తించారు. ఈ వాసనల ఆధారంగా మనుషులను గుర్తించడం ఒక సహజమయిన పద్ధతి అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
శరీరం మొత్తంమీది వాసనలను సేకరించి, వ్యక్తిని గుర్తించే పద్ధతి ఇంకా రాలేదు. ఆ ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి
లబ్-డబ్ లేదా హృదయలయ
కవులు, గాయకులు గుండె చప్పుడు గురించి ఊహించారు. నిజంగా కూడా ఏ రెండు గుండెలు ఒకే రకంగా కొట్టుకోవు. వింటే తేడా తెలియదు కానీ, విద్యుత్తు తరంగాలుగా చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇసీజీలో గుండెలోని మూడు రకాల కదలికలు తెలుస్తాయి. ప్రతి గుండె పరిమాణం, ఎత్తు, పొడుగు, ఆకారం వేరువేరుగా ఉంటాయి. వేగం మారినా గుండెలయ మాత్రం మారదు. దీన్ని మన ఇష్టప్రకారం మార్చడం కుదరదు. గుండె ఆధారంగా మనుషులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మెదడు నుంచి పుట్టే తరంగాలు
ఆలోచనలు ఎవరివి వారికి వేరంటే కొత్తేమీ లేదు. వాటినుంచి వచ్చే తరంగాలను గుర్తించి తేడా చూపవచ్చునని మాత్రం ఈ మధ్యే తెలిసింది. మెదడులో లెక్కలేనన్ని కణాలు మారి మారి, చివరికి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇఇజీ అనే యంత్రం మెదడు తరంగాలను చూపగలుగుతుంది. రామన్ పరాంజపే అనే పరిశోధకుడు కెనడాలో పరిశోధనలు జరిపి ఆలోచనా తరంగాల మధ్య తేడాను బయటకు చూపించాడు. అందరూ ఒకే పనిచేస్తున్నా, మెదడు పనిలో తేడా ఉందని నిరూపించాడు. అయితే, ఈ బ్రెయిన్ వేన్స్ ఎన్ని రోజులయినా, ఏ పరిస్థితిలోనయినా ఒకే రకంగా ఉంటాయా? ఈ ప్రశ్నకు జవాబు యింకా రాలేదు. ఆలోచనలు, వేలిముద్రల వంటివి కావని మాత్రం తెలుసు!
మనం కాని మనం
మనిషిని గుర్తించడానికి అన్నింటికన్నా ఆశ్చర్యకరమయిన ఆధారం- ఆ వ్యక్తిలోని సూక్ష్మజీవుల తీరు, కలయికలు. ఒక వ్యక్తి శరీరం బయట లోపల కలిసి వంద ట్రిలియనుల (అంటే ఎన్ని?) సూక్ష్మజీవులుంటాయి. శరీరం కణం ఒక్కింటికి 10 సూక్ష్మజీవి కణాలుంటాయి. (మనం అంటే మనం కాదని, మన సూక్ష్మజీవులని అనాలేమో?) మన జన్యువులు 23,000 మాత్రమే. మనలోని సూక్ష్మజీవుల జన్యువులు 33 లక్షలు. మనం 0.7 శాతం మాత్రమే మనం అంటారు పరిశోధకులు. ఈ సూక్ష్మజీవులను బట్టి మనుషులను గుర్తించడం చాలా సులభం అనాలి!
ఇప్పుడు చుట్టూ చూడండి, మీలాటివారు మరెవరయినా ఉన్నారేమో వెదకండి! మనుషులంతా నిజానికి ఒక్కటే. అందరిలోనూ అదే రక్తం పారుతున్నది. కానీ...!
Subscribe to:
Posts (Atom)