బతుకు బంఢి దానంతటది ముందుకు సాగుతున్నదా? లేక మనం నడపదలుచుకున్న దారిలో నడుస్తున్నదా? మనమనుకున్న దారిన సాగాలంటే మనం అప్పుడప్పుడు నిర్ణయాలు చేసి బండిని పక్కకు మళ్లించవలసి ఉంటుందేమో? ఏ పక్కకు మళ్లవలసిందీ మనకు తెలుసునంటే మనం నిర్ణయాలు చేస్తున్నామని అర్థం. మంచి చెడ్డలను గమనించి నిర్ణయం చేస్తున్నామంటే, మనం ఆలోచిస్తున్నామని అర్థం! అవునా? ఆలోచిస్తున్నామా?
ఎందుకు ఆలోచన? అంతా బాగానే నడుస్తున్నప్పుడు దేని గురించి ఆలోచన? ఈ ఆలోచనలతో మనమేమైనా బాగుపడే పద్ధతి ఉందంటారా? జవాబు చెప్పడం సులభం. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే ఆలోచన చేసినందుకే కదా? అది బతుకు దారిగానీ మరో విషయంగానీ తెలిసీ, తెలియకుండా మన మెదడులో ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. వాటి ప్రభావం మనకు అర్థమయి, మార్పులు చేర్పులు చేయగలగడం, అది తర్వాతి మెట్టు. కొన్ని పనులు మాత్రం అలవాటయిపోతాయి. వాటి గురించి ఆలోచన అవసరం ఉండదు. ఉదాహరణకు చేతిలోకి తీసుకున్న తిండి పదార్థాన్ని నోట్లో బదులు ఎప్పుడయినా ముక్కులో పెట్టుకున్నారా? కానీ ఏం తినాలనేది మాత్రం గొప్ప ఆలోచన, చర్చ! దానిమీద రకరకాల నిర్ణయాలుంటాయి. ఆలోచన లేనిది ఈ నిర్ణయాలన్నీ జరగవు.
మనిషి అన్న తర్వాత మెదడులో నిరంతరం ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. నిజానికి మనకు ఆలోచనకన్నా సులభంగా చేతనయిన పని ఇంకొకటి లేదు. అయితే చాలావరకు ఈ ఆలోచనలను మనం వాటిదారిన వదిలేస్తుంటాము. అందుకే వీలు దొరికితే చాలు, మనకు ప్రమేయం, మన మీద ప్రభావం లేని విషయాలను గురించి ఆలోచిస్తాము. వాటి గురించి మాట్లాడతాము కూడా. (బుచ్చిబాబుగారు, నవీన్‌గారు లాంటి కథా రచయితలు అదుపు లేకుండా సాగే ఈ ఆలోచనలను కథలుగా, నవలగా రాశారు. దాన్ని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అన్నారు). నిద్రలేచిన మరుక్షణం ఆలోచనలు మొదలవుతాయి. నిద్రలో కలలకు మన ఆలోచనలే కారణం. మెలుకువ ఉన్నంతసేపు ఏదో ఆలోచిస్తూనే ఉంటాము. మరో పనిలో ఉన్నా కూడా ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. ఈ నాలుగు అక్షరాలు చదువుతూ మీరు, ‘ఏమిటీ ఈ మాటలకు అర్థం? వీటిని పట్టించుకోవాలా? పోనివ్వాలా?’ అని ఆలోచిస్తున్నారు. ఈ రకంగా, మనకు తెలియకుండానే, ఆలోచనలు సాగుతుంటాయి. కనుకనే మనకు స్వంత భావాలుంటాయి. ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. మనకు, మన ప్రవర్తనకు ఒక తీరు ఉంటుంది. మనం చేయదలుచుకున్న పని, ఉద్యోగం, వ్యాపారం మొదలయిన వాటి గురించి ఆలోచన జరుగుతుంది. నిర్ణయాలు జరుగుతాయి. బతుకు బండి ముందుకు సాగుతుంది. సీరియస్‌గా ఆలోచించటం మాని, జరుగుతున్న పనులను జరగనిస్తే అసంతృప్తి మిగులుతుంది. ‘ప్రవాహంలో కొట్టుకుపోవడమే నరకం, ఈది మన దారిన పోవడం స్వర్గం’ అన్నారొకాయన.
ఆలోచించడం ఇంత సులభంగా జరిగేదయితే, దాని గురించి అంత ఆలోచించడం ఎందుకు, అని అనుమానం ఎవరికయినా రావచ్చు! అందరూ సరిగా ఆలోచించి తమ బతుకు బండి పగ్గాలు తమ చేతులో ఉంచుకుంటే, సమస్య ఏముంది? మనిషి మనసు తన దారిలో ఆలోచిస్తుంది. దాన్ని ఆలోచించే మెదడు, అదుపులో ఉంచుకోవాలి. సైకాలజీ, సమస్యలు మొత్తం ఈ మనసు, మెదడులో పోటీలోనుంచే పుట్టుకు వస్తాయి.
తెలిసి కూడా తప్పులు చేస్తున్నవారి గురించి మనకు తెలియదా? ‘నేను సిగరెట్లు ఎన్నిసార్లు మానివేశానో నాకే గుర్తులేదు!’ అన్న వ్యక్తి ఎంత చిత్రమయిన మనిషయి ఉండాలి? ఆలోచన అనుకున్నట్లు నడవదు. అందులోనుంచి సమస్యలు పుడతాయి. బతుకులోనూ సమస్యలు పుడతాయి. అప్పుడు కూడా చాలామందికి అర్థం కాదు. నేను ఇలాగెందుకు ఉన్నాను? అన్న ఆలోచన చాలామందికి కలగదు. ఈ ప్రపంచంలోని సమస్యలన్నింటికీ మూలం మనిషి ఆలోచన పద్ధతి! ‘అయితే ఏంటి?’ ‘నీకెందుకు?’ లాంటి ప్రశ్నలు తెలిసినవే! ‘నేను బాగానే ఉన్నాను. నా ఆలోచనలు అందరికంటే గొప్పవి’ అనుకుంటారు చాలామంది. మనుషులకు మొదటినుంచీ, ఆలోచనతో పనిలేకుండా బతకడం అలవాటయింది. నాకు సమస్య ఉంది అనుకోగలగడం ఒక మెట్టు. నా పరిస్థితికి, నా ఆలోచనలే కారణం అనుకోగలగడం ఆ తరువాతి మెట్టు! అందుకే మనం సీరియస్‌గా, ఆలోచించడం అలవాటు చేసుకోవాలి!
మంచివిగా గుర్తింపు పొందిన ఆలోచనలతో మన ఆలోచనలను సరిపోల్చుకోవాలి! అక్కడ అసలు కథ మొదలవుతుంది!
ఎందుకు ఆలోచన? అంతా బాగానే నడుస్తున్నప్పుడు దేని గురించి ఆలోచన? ఈ ఆలోచనలతో మనమేమైనా బాగుపడే పద్ధతి ఉందంటారా? జవాబు చెప్పడం సులభం. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే ఆలోచన చేసినందుకే కదా? అది బతుకు దారిగానీ మరో విషయంగానీ తెలిసీ, తెలియకుండా మన మెదడులో ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. వాటి ప్రభావం మనకు అర్థమయి, మార్పులు చేర్పులు చేయగలగడం, అది తర్వాతి మెట్టు. కొన్ని పనులు మాత్రం అలవాటయిపోతాయి. వాటి గురించి ఆలోచన అవసరం ఉండదు. ఉదాహరణకు చేతిలోకి తీసుకున్న తిండి పదార్థాన్ని నోట్లో బదులు ఎప్పుడయినా ముక్కులో పెట్టుకున్నారా? కానీ ఏం తినాలనేది మాత్రం గొప్ప ఆలోచన, చర్చ! దానిమీద రకరకాల నిర్ణయాలుంటాయి. ఆలోచన లేనిది ఈ నిర్ణయాలన్నీ జరగవు.
ఆలోచించడం ఇంత సులభంగా జరిగేదయితే, దాని గురించి అంత ఆలోచించడం ఎందుకు, అని అనుమానం ఎవరికయినా రావచ్చు! అందరూ సరిగా ఆలోచించి తమ బతుకు బండి పగ్గాలు తమ చేతులో ఉంచుకుంటే, సమస్య ఏముంది? మనిషి మనసు తన దారిలో ఆలోచిస్తుంది. దాన్ని ఆలోచించే మెదడు, అదుపులో ఉంచుకోవాలి. సైకాలజీ, సమస్యలు మొత్తం ఈ మనసు, మెదడులో పోటీలోనుంచే పుట్టుకు వస్తాయి.
తెలిసి కూడా తప్పులు చేస్తున్నవారి గురించి మనకు తెలియదా? ‘నేను సిగరెట్లు ఎన్నిసార్లు మానివేశానో నాకే గుర్తులేదు!’ అన్న వ్యక్తి ఎంత చిత్రమయిన మనిషయి ఉండాలి? ఆలోచన అనుకున్నట్లు నడవదు. అందులోనుంచి సమస్యలు పుడతాయి. బతుకులోనూ సమస్యలు పుడతాయి. అప్పుడు కూడా చాలామందికి అర్థం కాదు. నేను ఇలాగెందుకు ఉన్నాను? అన్న ఆలోచన చాలామందికి కలగదు. ఈ ప్రపంచంలోని సమస్యలన్నింటికీ మూలం మనిషి ఆలోచన పద్ధతి! ‘అయితే ఏంటి?’ ‘నీకెందుకు?’ లాంటి ప్రశ్నలు తెలిసినవే! ‘నేను బాగానే ఉన్నాను. నా ఆలోచనలు అందరికంటే గొప్పవి’ అనుకుంటారు చాలామంది. మనుషులకు మొదటినుంచీ, ఆలోచనతో పనిలేకుండా బతకడం అలవాటయింది. నాకు సమస్య ఉంది అనుకోగలగడం ఒక మెట్టు. నా పరిస్థితికి, నా ఆలోచనలే కారణం అనుకోగలగడం ఆ తరువాతి మెట్టు! అందుకే మనం సీరియస్‌గా, ఆలోచించడం అలవాటు చేసుకోవాలి!
మంచివిగా గుర్తింపు పొందిన ఆలోచనలతో మన ఆలోచనలను సరిపోల్చుకోవాలి! అక్కడ అసలు కథ మొదలవుతుంది!
No comments:
Post a Comment