సెషన్ జరుగుతుండగా, ఒక అమ్మాయిని చూపించి, ఆమెకు ఆరోగ్యం బాగుండలేదని చెప్పారు. నేను జాలిగా దగ్గరకు వెళ్లి, తల మీద చెయ్యి పెట్టి ‘వెళ్లి రెస్ట్ తీసుకొ’మ్మన్నాను. ఆ అమ్మాయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ మిగతా ఒకరిద్దరికి మాత్రం నేను ఆ అమ్మాయిని తాకడం తప్పుగా తోచిందని తరువాత తోచింది.
మన దేశంలో, మరిన్ని దేశాలలోనూ తాకడానికి అందరికీ ఒకే అర్థం తోచదు. ఒకరిని ఒకరు తాకడంలో ఒక నమ్మకాన్ని ఇవ్వడం, ఒక మైత్రీ బంధాన్ని ప్రదర్శించడంలాంటి అర్థాలు ఉన్నాయి. మన మద్దతు, ప్రోత్సాహం తెలియజేయడానికి మన దేశంలో వెన్నుతట్టడం అని పేరుంది. అంటే వీపు మీద తట్టి ‘్ఫరవాలేదు! మేమున్నాం’ అనడమని అర్థం. కానీ కొందరు ఎదుటివారు మాట్లాడుతుంటే తాకుతారు. ఆ తాకడానికి, మాటలకు అడ్డు రావాలన్నది అర్థం. ఇక ఏదో ఆనందం ప్రదర్శించే సందర్భం వచ్చినా షేక్‌హాండ్‌లూ, ఒకరినొకరు దగ్గరకు తీసుకోవడం, చరుచుకోవడం లాంటివి చేస్తుంటారు. అందుకు పూర్తి వ్యతిరేకమయిన శోక సందర్భాలు, మొదలయిన సమయాల్లో కూడా తాకి సాంత్వన చెప్పడం ఉంది. ఒకరిని మరొకరు తగలడంలో ఎన్నో రకాలున్నాయి. ఎన్నో అర్థాలున్నాయి. ఆ పనేదో సరిగా చేస్తే, సరిగా అర్థం చేసుకుంటే, చాలా మంచి కమ్యూనికేషన్ జరుగుతుంది. మాటలలో చెప్పలేని భావాలను ఒక్క స్పర్శతో చెప్పగల సందర్భాలున్నాయి. అదే స్పర్శ సరిగా ఉండకపోతే మాత్రం రకరకాల అపార్థాలు వస్తాయి. ఈ సరిగా అన్న పద్ధతికి నిర్వచనం ఇద్దరిలోనూ చెడే అవకాశం ఉంది. మామూలుగా తాకినా తప్పుడు అర్థం తోచవచ్చు. పనిగట్టుకుని తగిలినా ఫరవాలేదనిపించవచ్చు. ఇక్కడ ఏం చేశారన్నది ముఖ్యం కాదు. ఎట్లా చేశారు, ఎట్లా అర్థం చేసుకున్నారు అన్నది అసలు విషయం!
సాంప్రదాయికంగానే మన దేశంలో ఒకరినొకరు ముట్టుకుని పలకరించే పద్ధతి లేదు. షేక్‌హ్యాండ్ పద్ధతిని మనం ప్రయత్నించి నేర్చుకున్నాము. స్నేహంగా ముందుకువచ్చిన చేతికి ‘నమస్కారం’ ఎదురయిన సంఘటనలు ఇటీవలి వరకు కనబడ్డాయి. కరచాలనం కన్నా ఎక్కువ ‘తాకడం’ అట. పడమటి ప్రపంచంలో కూడా అనాగరికమే! సపోర్ట్‌లాంటి మంచి భావంతో తాకినా యుకె, యుఎస్ దేశాలలో అదేదో తప్పుడు భావంతో తాకుతున్నారనుకోవడం ఈనాటికీ ఉంది? ఇది ఎవరికి వారికే సంబంధించిన విషయం. కొంతమంది ఊరికే పక్కవారిని తాకుతుంటారు. తమను ఎవరయినా తాకినా తప్పుగా భావించరు. మరికొందరికి తాకడం పెద్ద తప్పుగా కనబడుతుంది. అందుకే ఎదుటివారి సంగతి అర్థమయితేగాని, ఎవరూ చెయ్యి కదిలించరు. అదే మంచి పద్ధతి.
కరచాలనం చేసేవారు కొంతమంది ప్రేమగా చేతిని నొక్కి వదులుతారు. కొన్ని దేశాలవారు చేతులు కలిపి కొంతవరకు నిజంగా షేక్ చేస్తుంటారు. కొంతమంది మాత్రం షాక్ తగులుతున్నంత త్వరగా చేతిని వెనక్కు లాక్కుంటారు. దీంతో వారి వారి మనస్తత్వాలు మనకు అర్థమవుతాయి. ఎందుకొచ్చిన సందడి అన్నట్లు, చేతిని చెక్కలాగా అందించి, అంతే చల్లగా వెనక్కు తీసుకునేవారున్నారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరు ఎదురవుతారు. మాటలు సాగుతాయి. భావాలు, మాట తీరు నచ్చుతాయి. అప్పుడు సూచనగా మనం వారి చేతిని ఒకసారి తాకడం అనుకోకుండానే జరుగుతుంది. తొలిపరిచయం జరిగినప్పుడు కూడా మామూలుగా కలిసిన చేతులు ఒక క్షణం ఎక్కువగానే కలిపి ఉంటాయి. కదులుతాయి. అది సహజం. ఒక గొప్ప మాట చెప్పిన భావం కలిగినవారు, మరొకరిని తాకడం, చరచడం లాంటివి మన దేశంలో మామూలుగా జరుగుతుంటాయి. దేశ సంప్రదాయాలను బట్టి ఈ తాకడం శరీరంలోని భాగాలు కొన్నింటికి పరిమితమవుతుంది. చేతిమీద, భుజం, వెన్నుమీద తట్టడం మనకు మామూలే. చిన్నపిల్లలను పలకరించడానికి మనం తలమీద తాకుతాము. కొన్ని దేశాల్లో మిత్రులు ప్రేమగా ఒకరి జుట్టును మరొకరు వేళ్లతో కదిలిస్తారు. థాయ్‌లాండ్ దేశంలో ఈ రెండు పనులను తప్పుగా భావిస్తారు! స్పర్శతో మనుషుల మధ్య కొత్త బంధాలు ఏర్పడతాయి. తలిదండ్రులు పిల్లలను, మిత్రులు ఒకరినొకరిని, డాక్టర్లు పేషెంట్లను తాకుతారు. అందులో ఎనె్నన్నో మంచి భావాల ప్రకటన జరుగుతుంది. వ్యాపారం, పాలిటిక్స్ లాంటి రంగాలలో ఉండేవారికి, తాకి, మైత్రిని మొదలుపెట్టడం, బలపరచడం బాగా తెలిసి ఉండాలి. ఎదుటి మనిషి చేతిని రెండు చేతులతోనూ పట్టుకుని మాట్లాడడం మనం చూసే ఉంటాము. షేక్ హ్యాండ్ చేస్తూనే మరో చేత్తో మనం ఎదుటి మనిషి చేతిని, పట్టుకున్నామంటే మన మధ్య బంధం మామూలు రకం కాదు సుమా!’ అని చెప్పడమే గదా!
ఈమారు కొత్తగా ఎవరితోనయినా పరిచయం జరిగినప్పుడు, కరచాలనం చేస్తూనే ఎడమ చేతితో కూడా వారిని చేతిమీద తాకుతూ వారి పేరును మరోసారి అని చూడండి. మీకు పేరు మరింత బాగా గుర్తుంటుంది. వారికి మీరెంతో స్నేహభావం గలవారన్న సందేశం అందుతుంది! ఒకే స్థాయి మనుషులమధ్య స్పర్శ సులభంగా జరుగుతుంది. మిత్రులను వీపుమీద చరిచినా అది ప్రేమ! కౌగిలించుకున్నా, చేతిని గట్టిగా నొక్కినా, మరింత ప్రేమ ప్రదర్శించినట్టు లెక్క! అదే పని కొత్తవారితో చేస్తే వెకిలిదనమవుతుంది. కొత్తవారితో కరచాలనం సెకండ్లపాటు మాత్రమే. నిడివి ఏమాత్రం ఎక్కువయినా అందులో మరేవో అర్థాలు తోచే ప్రమాదం ఉంది! మనకంటే పెద్దవారితో, పైస్థాయి వారితో గౌరవంగా క్షణాల షేక్ హ్యాండ్ వరకే పరిమితం కావాలి.
పెద్దవారు, ముఖ్యంగా పై ఆఫీసర్లు, అందరినీ భుజంమీద తట్టి తమ మన్నన తెలియచేస్తారు. డాక్టర్లు తమ పేషంటుకు భరోసా ఇవ్వడానికి తాకుతారు. టీచర్లు పిల్లలను మెచ్చుకుంటూ తాకుతారు. పెద్దలు ఆశీస్సులిస్తూ తలను తాకుతారు. ఈ రకంగా తాకడానికి ఎన్నో అర్థాలున్నాయి. ఎన్ని చేసినా, మన దేశంలో యింకా స్పర్శ విషయంలో ఆడా, మగ, తేడా ఎక్కువగా ఉంది. ఉంటుంది. ఈ తేడా మిగతా దేశాలలో లేదని కాదు. ఇందులో వయసు పాత్ర కూడా ఉంది. పెద్ద వయసుగలవారు ఎవరినయినా ప్రేమగా భుజంమీద తట్టవచ్చు!
స్పర్శ నిజానికి బలమయిన సందేశాలనిస్తుంది. విషయాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి స్పర్శ అర్థాలు మారుతుంటాయి. హద్దులు మీరనంతవరకు తప్పులేదు.

No comments:
Post a Comment