ఫోను లేనిదే ఎవరికీ దినం గడవడం లేదు. కానీ, చాలామందికి ఫోనులో మాట్లాడే పద్ధతి తెలియడం లేదు. ఆఫీసులోనయితే ఫోను విషయంలో మరింత శ్రద్ధ అవసరం.
# మూడు రింగుల లోపలే ఫోను ఎత్తి ఆన్సర్ చేయం గౌరవకరంగా ఉంటుంది. నిజంగా బిజీగా ఉంటే, అటువేపువారికి ఆ మాట చెప్పండి. అర్జెంటయితే వారు లైనులో ఉంటారు. లేదంటే మరో మారు ఫోన్ చేస్తామంటారు. అది మీరు కూడా నిర్ణయించవచ్చు.
# ఫోన్‌లో వారి మీద మీ చిరాకు, పరాకు ప్రయోగించకండి. చిరాకులో ఉన్నాసరే, ఫోన్‌లో మాత్రం ఉత్సాహంగానే మాట్లాడాలి. అవతల వారికి మీ పరిస్థితి తెలిసి ఉండదు. వారు మీరే మీ కంపెనీ పద్ధతులకు ప్రతిబింబం అనుకుంటారు.
# మీ పేరు చెప్పి గ్రీట్ చేస్తే, సంభాషణ నేరుగా విషయంలోకి వస్తుంది. కంపెనీ గురించి, కావలసిన మనుషుల గురించి అవసరమయిన ప్రశ్నలుండవు.
# ఫోన్‌లో నెమ్మదిగా, తక్కువస్థాయి గొంతుకతో మాట్లాడడం మంచిది. గుసగుసలాడడం తప్పు. అవతలివారికి మన గొంతు స్ఫుటంగా వినిపించాలి.
# మొరటుతనం ఏ మాత్రం కూడదు. ‘తెలియదు!’ అనేకన్నా‘తెలుసుకుని చెపుతానండీ!’ అంటే గౌరవంగా ఉంటుంది.
# మరొకరికి ఎవరికయినా మెసేజీ తీసుకోవలసి వస్తే, వివరాలన్నీ రాసుకోవాలి. మెసేజ్‌ను మరిచిపోకుండా అందించాలి.
చిన్న చిన్న జాగ్రత్తలతో మన కంపెనీ, ఆఫీసు, చివరకు మనం మంచితనానికి గుర్తులుగా మిగులుదాం.

No comments:
Post a Comment