ఫ్రపంచం గురించి మనకు చాలా తెలుసును, అనిపిస్తుంది. అన్ని రకాల పనులు మనకు వచ్చుననిపిస్తుంది. అయినా, మనకు బాగా అలవాటున్న పనిలో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. ఇక తెలియని పని చేయడానికి పూనుకుంటే, ఏమవుతుందో ఎవరూ ముందుగా చెప్పలేరు. పని బాగా జరగవచ్చు. ప్రహసనంగానూ ముగియవచ్చు!
ఈ మధ్యన ఎక్కడో ఒక వింత సంఘటన గురించి రాశారు. అది నిజంగా జరిగిందా? అని అడగడానికి లేదు. అది కేవలం కల్పన అయ్యుండవచ్చు కూడా. కానీ, అందులోనుంచి ఒక ఆలోచన మాత్రం అందరికీ తప్పకుండా పుడుతుంది. ఒక పెద్దాయన ఇల్లు కట్టిస్తున్నాడు. మధ్యలో పనివాళ్లు, పండగ పేరునో మరో కారణంగానో ఎవరూ రాలేదు. పని నడుస్తున్న పై అంతస్తులో అనవసరంగా మిగిలిపోయిన కొన్ని ఇటుకలున్నాయి. వాటిని కిందకు చేర్చితే, కొంత సమయం ఆదా అవుతుందన్న ఆలోచన పెద్దాయనకు వచ్చింది. తగిన ఏర్పాటు కోసం అతను చుట్టూ గమనించాడు. బరువులను పైకి చేర్చడానికి, బావినుంచి చేంతాడులాగ లాగడానికి ఒక చక్రం అమర్చి ఉండటం చూచాడతను. పని సులభంగానే జరుగుతుందనిపించింది. తాడు కూడా ఉంది. అది చాలా పొడుగుగా కూడా ఉంది. సిమెంటు, ఇటుకను తోడుకోవడానికి అమర్చిన ఒక బకెట్‌లాంటి నిర్మాణం కూడా ఉంది.
అతగాడు తాటిని చక్రం మీదుగా కిందకు వదిలాడు. ఒక చివరను బకెట్‌కు కట్టి మరో చివరను కిందకు వదిలాడు. కిందకు వెళ్లి తాటిని ఏదో బరువుకు కట్టాడు. పైకిపోయి, బకెట్‌ను వేలాడదీసి అందులో ఇటుకలు వేశాడు. కిందకువచ్చి తాటిని వదిలి బకెట్‌ను కిందకు దింపడానికి, నెమ్మదిగా, తాటిని వదలసాగాడు. బకెట్‌లో ఇటుకలు ఆ మనిషికన్నా ఎక్కువ బరువు ఉండడం ఇక్కడి, అసలు విశేషం.
బకెట్ బరువు కారణంగా కిందకు వచ్చింది. తక్కువ బరువున్నాడు గనుక తాటి చివరతో ఇతను పైకి ఎగిరాడు! బకెట్ నేలకు గుద్దుకుంది. దాని అడుగు ఊడింది. బరువు కారణంగా ఇతను కిందకు వచ్చిపడ్డాడు. ఖాళీ బకెట్ పైకిపోయింది. ఈ రెండుసార్లూ బకెట్ ఇతనికి తగిలిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతను కిందపడ్డాడు. బకెట్ పైకి పోయింది. పడ్డ తాకిడిలో అతడు తాటిని వదిలేశాడు. పక్కకు కదలవచ్చని తోచేలోగా బకెట్ తిరిగి కిందకు వచ్చి ఇతనిపై పడింది!!
ఇలాంటి సంఘటనలు కామెడీ సినిమాల్లోనూ, కార్టూన్ ఫిల్ముల్లోనూ కనబడుతూ ఉంటాయి. నిజంగా మన ముందు జరిగినా, మొదట తప్పకుండా నవ్వు వస్తుంది! కామన్‌సెన్స్ పని చేయకపోవడాన్ని ఆధారంగా ఎన్నో హాస్య సంఘటనలు పుడుతుంటాయి. మనందరికీ ఎప్పుడో ఒకసారి ఇలాంటి అనుభవమేదో ఎదురయి ఉంటుంది. వంట బాగా చేతయిన వారు కూడా చేతులు కాల్చుకుంటూనే ఉంటారు మరి!
మేకును దిగగొట్టాలనే ప్రయత్నంలో సుత్తితో చేతిని కొట్టుకోవడం ఒక మామూలు రకం ఉదాహరణ!
‘పనిలో మూర్ఖత్వంకన్నా భయంకరమయింది మరోటి లేదు’ అన్నాడు జెర్మన్ కవి గ్యోఠే. ఏం చేస్తే ఏం జరుగుతుందని ఊహించగలగడం, మామూలు తెలివికన్నా ఒక మెట్టు ఎత్తున ఉండే మరోరకం తెలివి. పెద్ద వాళ్లనడిగితే, దీన్ని మరింత బరువుగా చెపుతారు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలు (సమస్యలు) అవకాశాలను అర్థం చేసుకుని తట్టుకోగలగడం అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రాక్టికల్ తెలివి. పనితనంలో తెలివి. దీనే్న కామన్‌సెన్స్ అనవచ్చు. ప్రపంచజ్ఞానం అన్నా తప్పుకాదేమో! దీనికి ఒక సిద్ధాంతం ఉండదు. కేవలం సందర్భం మాత్రం ఉంటుంది.
ఒక వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం చాలా బాగా చేస్తూ ఉండవచ్చు. కానీ, వీరికి మిగతా మామూలు పనులు అంతగా చేతగాకపోవచ్చు. మాటలాడడం, సరదాగా ఉండడం ఈ మామూలు పనులు అంటే ఆశ్చర్యం లేదు. గొప్ప తెలివిగలవారని పేరున్న వారికి, చొక్కా గుండీ కుట్టుకోవడం చేతగాక పోవచ్చు. అయితే కొంపమునుగుతుందా అని ఎవరైనా అడిగితే చేయగలిగింది లేదు! అందుకే ఈ ప్రాక్టికల్ తెలివిని, మిగతా తెలివి, జ్ఞానాలతోబాటు కట్టడానికి లేదు. చూడడానికి అంతకన్నా లేదు.ఈ తెలివిలో ఎన్నో ఆలోచనలు, మెళకువలు, అలవాట్లు కలగలిసిపోయి ఉంటాయి. ఈ తెలివికీ, ఐక్యూ పరీక్షలకూ సంబంధం ఉండదు. ‘మీకు స్టవ్ రిపేర్ చేయడం కూడా వచ్చా?’ అని అడిగారు ఎవరో! నిజానికి ఆ రోజు వరకు ఆ పని వచ్చునన్న భావం లేదు! అందుకు సంబంధించి ఎక్కడన్నా నేర్చుకోవడం వీలవుతుందా, అంతకన్నా తెలియదు. స్టవ్ రిపేర్ చేయగలగడం ఏ రకం తెలివి? పీహెచ్‌డీలకు ఈ పనికీ సంబంధం లేదే? ఇది మరి ఏ రకం తెలివి?
కూర్చుని, ఆలోచించడం, కాయితాలు నలుపు చేయడం ఒక రకమయిన తెలివి. ఆ కాయితాలను, అందించ వలసిన వారికి, సకాలంలో, అన్నింటికన్నా సులభమయిన పద్ధతిలో అందించగలగడం, మరోరకం తెలివి. అదే దక్షత! ప్రాక్టికల్ తెలివి. ఈ రెండవ రకం సంఘటన, సమస్య, అవకాశం గురించి, ఒక్క మెదడుతో పని చేస్తే లాభం లేదు. మొత్తం శరీరంతో ఆలోచించాలి! శరీరంలోని నాడీ మండలమంతా అందులో పాలు పంచుకోవాలి! చివరకు శరీరంలోని హార్మోనులకూ ఇందులో భాగం ఉంది. అన్నీ కలిస్తేనే ఈ తెలివి పని చేస్తుంది!
తెలివి..
తికమక
నీటిలో కొట్టుకుపోయే వారు, గడ్డిపరక కూడా తమను ఒడ్డుకు చేర్చగలుగుతుంది, అనుకుంటారు! తెలిసి కూడా ఎందుకీ తికమకకు గురవుతాడు మనిషి?
నీటిలో కొట్టుకుపోయే వారు, గడ్డిపరక కూడా తమను ఒడ్డుకు చేర్చగలుగుతుంది, అనుకుంటారు! తెలిసి కూడా ఎందుకీ తికమకకు గురవుతాడు మనిషి?
కొన్ని పనులు ఎప్పుడూ ఒకేలాగ జరుగుతుంటాయి. వాటివల్ల మనకు ప్రపంచం మీద పట్టు దొరికిందన్న భావం కలుగుతుంది. అట్లాకాక, కొత్తగా ఏదయినా జరిగితే, అనుమానాలు పుడతాయి.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని మన ప్రయత్నమంతా. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలిసినంత వరకు అంతా క్షేమంగానే ఉంటుంది. అనుభవంలో లేని సంగతులు ఎదురయితే, తికమక, భయం మొదలవుతాయి. గడ్డిపరక కూడా సాయపడగలదేమో అనిపిస్తుంది.
ఏం జరుగుతుందో తెలుసు అనుకుంటే, ఆ ఫలితాల కొరకు చూస్తాము. జరిగింది, ఫలితంగా వచ్చింది మరోరకంగా ఉంటే, ముందు ఆశ్చర్యం, అందులోనుంచి తికమక మొదలవుతాయి. ఇక జరుగుతున్నదేదీ అర్థంకాని స్థితి పుట్టుకు వస్తుంది.
ఒక చేతితో చరిస్తే చప్పట్లు కావు. ఎవరూ లేని అడవిలో చెట్టు విరిగిపడినా చప్పుడు రాదు, అంటారు జెన్ పద్ధతి ఆలోచన గలవారు. వీటిని గురించి ఆలోచించాలి. అప్పుడు అసలు తత్వం అర్థమవుతుంది. తికమకలోనుంచి కూడా ఆలోచన పుట్టాలి. జవాబులేని ప్రశ్నలు పుడతాయి. మొదడు ఖాళీ అవుతుంది. హిప్నాటిస్టులు ఈ పద్ధతిని వాడుకుని మెదళ్లను ఖాళీ చేస్తారట!
ఆలోచనలో...
ఇద్దరు భిక్షువులు సాయంత్రం పూట నడిచి ఎక్కడికో పోతున్నారు. వర్షం కురిసింది గనుక, దారి మొత్తం నీళ్లు నిలిచి ఉన్నాయి. అటువైపున ఒక అందమయిన అమ్మాయి నిలబడి, మడుగు దాటలేక తికమక పడుతున్నది. భిక్షువులలో పెద్దతను, అక్కడికి వెళ్లి, అమ్మాయిని అమాంతంగా ఎత్తి తెచ్చి ఇవతల దింపాడు. ఆ సాయంత్రం చిన్న భిక్షువు పెద్దతని దగ్గరకు వచ్చాడు.
‘మనం భిక్షువులము. అమ్మాయిలను ముట్టుకోగూడదు కదా?’ అని అడిగాడు.
‘అవున’న్నాడు పెద్ద భిక్షువు. ‘మరి మీరు అమ్మాయిని ఎత్తుకుని తెచ్చారెందుకు?’ అడిగాడతను.
పెద్ద భిక్షువు చిరునవ్వు నవ్వాడు. ‘కదూ! నేనామెను అక్కడే దింపేశాను. నువ్వింకా మోస్తున్నావు’ అన్నాడు.
తికమక
గురువు రోషీతో ఒక శిష్యురాలు ‘నాకు మీమీద ప్రేమ పెరుగుతున్నది. తికమకగా ఉంటున్నది’ అన్నది.
‘ఏం ఫరవాలేదు! నీకు నీ గురువు గురించి కలిగే భావాలను నీలోనే ఉంచుకో! నిజానికది మంచిది. నాకు మనిద్దరికి సరిపడేంత క్షమశిక్షణ ఉందిమరి!’ అన్నాడు గురువు.
ఏంటో తికమక పెట్టేశారు. తెలివిలేకపోయింది, తెలుసుకోడానికి.:)
ReplyDelete:)
ReplyDelete