ఈ విశాల విశ్వంలో మనుషులనే మనం నిజంగా ఒంటరి జీవులం. బుద్ధిజీవులు మరెక్కడయినా ఉన్నారేమోనని వెతకడమే గానీ, ఎవరూ కనిపించడంలేదు. ఇదిలా ఉండగా- ఈ విశ్వం వేగంగా విస్తరిస్తున్నది. గెలాక్సీలు, నక్షత్రాలు మొదలయినవన్నీ ఒకదాన్నుంచి మరొకటి దూరంగా మరింత దూరంగా వెళ్లిపోతున్నాయి. మనం చూడగలిగిన ప్రాంతం కొంత మాత్రమే.
వెలుగున్నంత దూరం వరకే కనబడుతుంది. విశ్వం వ్యాపించడం ఇట్లాగే కొనసాగితే కొంతకాలం తరువాత, మనకు కనిపించే ప్రాంతంలో ఖాళీ ఎక్కువ, నక్షత్రాలు తక్కువగా మిగులుతాయి. ఇంతకూ ఈ పరిస్థితి రేపెప్పుడో మాత్రం రావడంలేదని, అందుకు బిలియన్ల సంవత్సరాలు పడుతుందని గుర్తుంచుకోవాలి. కొన్ని పదుల బిలియన్ల సంవత్సరాలు సాగితే, మన చుట్టూ మరేవో కొన్ని గెలాక్సీలు మాత్రమే మిగులుతాయి. మిగతావన్నీ మనకు కనిపించని చీకటి ప్రాంతంలోకి వెళ్లిపోతాయి.
ఇదంతా జరగడానికి ఒక శక్తి కారణంగా ఉంది. దాన్ని డార్క్ ఎనర్జీ అంటారు. అంటే ఏమిటని? ఎవరైనా అడిగితే వెర్రిమొగమే సమాధానం. మహామహా పరిశోధకులకే ఈ శక్తి గురించి, దాని స్వభావం గురించి అర్థంకావడంలేదు. అలాంటిదేదో ఉందన్న అనుమానం మాత్రం అందరికీ ఉంది. విశ్వంలోని ఖాళీలలో శక్తి ఉంది. పదార్థమంతా కూడా శక్తియొక్క రూపమే. పదార్థంగా మారని శక్తినుంచి ఒక రకమయిన వికర్షణ పుడుతుంది. డార్క్ ఎనర్జీ అంటే అదేనా? తెలియదు! గురుత్వాకర్షణ శక్తి మరీ ఎక్కువయినందుకు ఈ డార్క్ ఎనర్జీ పుట్టిందా? అంతకన్నా తెలియదు! ఈ అనుమానాలకు ఆధారాలున్నాయి. వాటిలో సమస్యలు కూడా ఉన్నాయి.
విశ్వంలోని కాంతిని ఈ డార్క్ ఎనర్జీ మింగుతున్నది. అయినా, ఇది కాంతినుంచే పుట్టి ఉండవచ్చునన్న అనుమానం కూడా ఉంది. కాంతి, వెలుగు అంటే విద్యుదయస్కాంత తత్వానికి ఒక రూపం లేక ఫలితం. అందరికీ తెలిసిన ఫిజిక్సుకు అందని రకం విద్యుదయస్కాంత తరంగాలు ఉన్నాయని మరో అనుమానం. వాటి అలల నిడివి, మనకు కనిపించే విశ్వంలోని తత్వానికి ట్రిలియన్ల రెట్లు ఎక్కువ. అదే డార్క్ ఎనర్జీ అంటున్నారు కొందరు. వెలుగుగానీ, అయస్కాంత శక్తిగానీ, వాటి వాటి అలల నిడివి వల్ల రకరకాలుగా ప్రభావాన్ని చూపుతాయి. మనకు కనిపించే కాంతి కొంత. దానికి, అటు యిటూ కనిపించని కాంతులున్నాయని తెలుసు. అదే దారిలో విద్యుదయస్కాంత తరంగాలు కూడా ఉన్నాయని ఇద్దరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. విశ్వంలోని పూర్తి ఖాళీ ప్రాంతాలలో కూడా అర్థంకాని అయస్కాంత క్షేత్రాలున్నాయని గమనించారు. వాటికి ఈ అతి దీర్ఘ తరంగాలు గల విద్యుదయస్కాంత తత్వం ఆధారమని వీరిద్దరూ అంటున్నారు. మన గెలాక్సీలోనే బ్లాక్‌హోల్స్ ఉన్నాయి. వాటిలోనుంచి కూడా కొన్ని అయస్కాంత క్షేత్రాలు పుడుతున్నాయి! అవి కూడా ఇలాంటివేనంటున్నారు!
విశ్వం తననుంచి తాను దూరంగా పోతున్నది. అంటే అంతులేకుండా విస్తరిస్తున్నది. ఈ సంగతి సుమారు ఇరవయి సంవత్సరాల క్రితమే గట్టిగా రుజువయింది. సూపర్‌నోవాలు ఉండవలసిన వెలుగు లేకుండా, ఉండవలసిన దానికన్నా, మరెంతో దూరంగా ఉన్నాయని గమనించారు. ఈ సంగతిని ఆధారంగా ‘విశ్వం విశాలమవుతున్నద’ని చెప్పినవారికి 2011లో నోబెల్ బహుమతి కూడా ఇచ్చేశారు. విశ్వంలో చాలా భాగం ఖాళీగా ఉంది. అక్కడ కొన్ని వర్చువల్ పార్టికల్స్ పొంగుతున్నాయని క్వాంటమ్ సిద్ధాంతం చెపుతుంది. ఆ పొంగులోనుంచి కొంత శక్తి పుడుతుంది. పార్టికల్స్‌మాత్రం ఈ క్షణం పుట్టి మరో క్షణంలో మాయమవుతాయి, శక్తి మిగులుతుంది. మార్పేమీ లేకుండా మిగులుతుంది. దీనే్న కాస్మలాజికల్ కాన్‌స్టాంట్ అన్నారు. ఇందులోనుంచి లేదా ఇందుకు సంబంధించి డార్క్ ఎనర్జీ పుడుతుందని మరో అనుమానం.
విశ్వం విచ్చుకుంటూ పోవడానికి కొంత, నిజానికి చాలా శక్తి అవసరం. ఒక ఘనపు కిలోమీటరు విశ్వానికి అర జౌల్ శక్తి కావాలి (అసలు, విషయమే అర్థం కావడంలేదంటే, అందులో ఈ లెక్కలు అంతకన్నా అర్థం కావు గనుక వదిలేద్దాం!). వర్చువల్ పార్టికల్స్‌లో నుంచి పుట్టుకు వస్తున్న శక్తి మొత్తాన్ని లెక్కించే ప్రయత్నం చేశారు. అది ‘సున్నా’అని లెక్క తేలింది.
(ఇదేమిటని ముక్కున వేలేసుకుంటే తప్పులేదు!) మరో లెక్క ప్రకారం, ఈ శక్తి అపారం. ఎంత అపారమంటే, దాని ప్రభావంవల్ల విశ్వంలోని పదార్థమంతా సర్వనాశనమవుతుంది. (ఈసారి ఇదేమిటని బుర్ర పట్టుకుంటే అంతకన్నా తప్పులేదు. ఫిజిక్సు అనే మదర్ ఆఫ్ సైన్సెస్ పద్ధతి అలాగే ఉంటుంది మరి!) ఇదంతా మనకు అర్థం కాలేదంటే ఆశ్చర్యం లేదు. పరిశోధకులకు కూడా ఈ సంగతులు అర్థం కాలేదు. కనుక వాళ్లు రూటుమార్చి, డార్క్ ఎనర్జీకి, గురుత్వాకర్షణ శక్తికి మధ్య సంబంధాలను వెతుకుతున్నారు. గురుత్వాకర్షణ అన్న విషయానికి ఆధారం ఆకర్షణ. రెండు పెద్ద పెద్ద ఆకారాల మధ్యన ఆకర్షణ ఉంటుందని దీని భావం. కానీ, వాటిమధ్యన దూరం బిలియన్ల కాంతి సంవత్సరాలయితే, ఆకర్షణ పోయి వికర్షణ మొదలవుతుందని ఒక సిద్ధాంతాన్ని తెచ్చారు వారు.
గురుత్వాకర్షణ గురించి ఇంత తేలికగా మాట్లాడడం తప్పు అంటారు మరికొందరు. ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, గ్రావిటీ అంటే స్థలకాలాలు వంపు తిరగడం. ఈ లెక్క ఆధారంగానే సౌర మండలంలోని గ్రహాలు, మనిషి ప్రయోగించే కృత్రిమ ఉపగ్రహాల దారులను, కదలికలను లెక్క వేస్తున్నారు. దాన్ని మొత్తం విశ్వం స్థాయిలోకి పెంచి, స్థలకాలాలను వంచగలిగితే- లెక్క ఎలాగుంటుందో అర్థంకాదు! పరిశోధకులు ఏదో అడ్డు వచ్చిందని పని మానే రకం కాదు. జోస్ బెల్ట్రాన్, ఆంటోనియో మరోటోలు మరీ రాటుదేలిన పరిశోధకులు. వాళ్లు స్పెయిన్‌లో గ్రావిటీ గురించి ఎంత కాలంగానో పరిశోధిస్తున్నారు. ఆకర్షణ పోయి వికర్షణగా మారడం గురించి ముందు ఊహించినది వీళ్లే. అంతలోనే మరో సంగతి తోచింది. అక్కడ విద్యుదయస్కాంత తత్వం లక్షణాలు కనిపించాయి. స్థలకాలాల బదులు దృష్టి అయస్కాంతాలు, వోల్టేజీలవైపు మళ్లింది. తరువాతి సంగతులు మరెప్పుడయినా చూద్దాం!
పాఠక మిత్రులకు ఒక మనవి! సైన్సు అంటే- తెలిసిన విషయాల గురించి అని మన భావన! కానీ సైన్సులో తెలిసిన సంగతులకన్నా, తెలియని సంగతులే ఎక్కువ. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం గనుక సైన్సు కొనసాగుతుంది. ఈ విషయం అర్థం కావడానికే ఇలాంటి వ్యాసాలు!

chakkaga, aasakthini penche vidham ga raasaaru. thank you sir.
ReplyDelete