మనిషి ఆలోచన మొదలయిన నాటినుంచి సదుపాయాలు కొరకు వెతికాడు. రాళ్లతోనే గొడ్డళ్ళను, కత్తులను తయారుచేసుకున్నాడు. కడుపు నిండిన తరువాత మరి కాలక్షేపం కావాలి. సరదా కావాలి. అందుకని ఆటలు మొదలయినయి. ఆటల్లో కొన్ని శరీర శక్తి మీద ఆధారపడినవి. కొన్ని మెదడు మీద ఆధారపడినవి. మరికొన్ని రెండూ కలిపిన రకం. టెక్నాలజీలో కూడా ఈ రెండూ ఉన్నాయి. వేటకొరకు బాణం కడితే అది అవసరం. బాణాన్ని ఎంత దూరం వరకు వేయగలమని పోటీపడితే అందులో సరదా కూడా ఉంది. బాణాన్ని ఎక్కువ దూరం వేయగలగాలంటే విల్లు, అమ్ములను మరింత ‘బాగా’ తయారుచేయాలి. అట్లా టెక్నాలజీ పుడితే అది ‘ఆట’ మాత్రం కాదు. ఆటలోకూడా రూల్స్‌ను దాటనంతవరకు ఎంత టెక్నాలజీ వాడినా తప్పులేదు. చిత్రంగా, మిగతా రంగాలకన్నా ఆటలో ఎక్కువగా ఈ టెక్నాలజీ వాడకం మొదటినుంచి జరిగింది.
మనుషుల నాగరికత నడకలో ఒలింపిక్స్‌ను ఒక మలుపుగా గుర్తించారు. క్రీస్తు పూర్వం 776లో గ్రీస్‌లోని ఒలింపియా నగరంలో మొదటి ఆటల పోటీలు జరిగాయి. అప్పుడు ఒకే ఒక పోటీ జరిగింది. దాని పేరు స్టేడియాన్. సుమారు రెండు వందల మీటర్ల నిడివి గల ట్రాక్ వెంట పరుగుపెట్టి వెనక్కు రావాలి. త్వరలోనే ఆ పోటీకి కొన్ని రూల్స్ వచ్చాయి. అంటే కొంత టెక్నాలజీ కూడా వచ్చిందనవచ్చు. పరుగు మొదలయ్యే చోట, కాళ్లకు ఆధారంగా గుంటలు, అటు చివర కొయ్యలువచ్చాయి. ఆ తరువాత ఒలింపియాడ్స్ వందల ఏళ్లు కొనసాగినయి. క్రీస్తుశకం నాలుగవశతాబ్దం నాటికి రథాల పరుగులు, బల్లెం విసరడం, అస్తశ్రస్త్రాలన్నీ మోస్తూ పరుగు తీయడం లాంటి రకరకాల పోటీలు అందులోకి వచ్చి చేరుకున్నాయి. అన్నింటిలోనూ ఎన్నో నియమాలు, ఎంతో టెక్నాలజీ కూడా వచ్చాయి.
ఒక్కసారిగా పారిశ్రామిక విప్లవకాలం నాటికి కప్పదాటు వేస్తే, అదంతా సాంకేతికత కాలం. పనివారికంతా, తీరిక, సరదాలు కావాలి. అందరికీ హాయిగా తిండి దొరుకుతున్నది. ఆటలకు కావలసిన సరంజామా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అప్పటివరకు ఆట పోటీల్లో కర్ర, చర్మం లాంటి పదార్థాలను మాత్రమే వాడుతున్నారు. అవి సులభంగా, అందరికీ దొరుకుతాయి. అప్పుడప్పుడే హాన్‌కాక్, గుడ్‌యియర్, మాకింటాష్‌లు రబ్బరు తయారీని కనుగొన్నారు. సహజంగా దొరికే రబ్బరుకు గంథకం కలిపి ఉడికిస్తే, మన్నికగల రబ్బరు వచ్చింది. దానితో 1800 ప్రాంతంలో ఆటలలో వాడుకునే బంతుల తీరు మారింది. జంతు చర్మంతో తయారుచేసిన బంతులు అన్నీ ఒకే రకంగా ఉండవు. రబ్బరు బ్లాడర్లు అన్నీ ఒకేరకంగా, ఎన్నయినా తయారుచేయవచ్చు. రబ్బరుతో షూస్, దుస్తులు కూడా తయారుచేయడం వీలవుతుంది. డన్‌లాప్ తయారుచేసిన టైర్ల కారణంగా మంచి బైసికిళ్లు, మిగతా వాహనాలు వచ్చేశాయి. ఈ రకంగా ఒకవేపు బతకడానికి సదుపాయాలు పెరుగుతున్నాయనుకుంటే, అవన్నీ ఆటల పోటీలోనూ మార్పులను తెచ్చాయి.
ఇంత జరిగిన తరువాత ఆటలనే తమ పనిగా ఎంచుకునే వారు రావడంతో ఆశ్చర్యం లేదు. పోటీలో కాలాలు, నిడివి లాంటి వాటిని సరిగ్గా కొలతవేసే పద్ధతులు అవసరమయ్యాయి. 1885 ఫొటో ఫిల్మ్ వచ్చింది. గుర్రాలు, మనుషుల పరుగులలో ‘్ఫటోఫినిష్’ అనే మాట వచ్చింది. కంటిచూపు కాక, ఫొటోల ఆధారంగా గెలుపు నిర్ణయాలు చేయడం అసలయిన స్పోర్ట్స్ టెక్నాలజీ! అక్కడితో ఆగక, క్రీడాకారుల శిక్షణలో కూడా ఫొటోలు, ఫిల్ముల వాడకం అప్పుడే మొదలయింది. బొమ్మలను చూచి, పద్ధతులను మార్చుకుని అందరూ, ‘మరింత బలంగా, మరింత ఎత్తులకు, మరింత వేగంగా’ చేరడం నేర్చుకున్నారు.
పరుగులలో సమయం నిడివి చాలా ముఖ్యం. 1930లోనే సెకండులో పదవ భాగాన్ని లెక్కించడం మొదలయింది. 1970లో గెలుపులు, సెకండులో వందవ భాగం ప్రకారం నిర్ణయం చేయడం మొదలయింది. పరుగు మొదలయే చోట పిస్టల్ పేలుతుంది. దానికీ క్వార్ట్స్ క్రిస్టల్ గడియారానికి లంకె ఉంటుంది. పరుగు ముగిసే చోట లేజర్ కన్ను ఉంటుంది. రెంటినీ కలిపి పరుగు సాగిన సమయాన్ని లెక్కవేస్తారు. ఈ లెక్కలు చెప్పడానికి సులభంగా కనబడతాయి. కానీ వాటి గురించి ఎంతో పరిశోధన జరిగింది. చిక్కులు వచ్చాయి కూడా.
పరికరాలు, పదార్థాలు: ఆటల పోటీలలో, సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పులు అంతులేనివి. ఉదాహరణగా టెన్నిస్ రాకెట్లగురించి చెప్పవచ్చు. శతాబ్దాలుగా వాటిని కర్రతో చేసి వాడుకున్నారు. గ్రాఫైట్‌తో రాకెట్లు తయారుచేయవచ్చునని తెలిసిన తరువాత ఆట మారిపోయింది. రాకెట్లు మరింత పొడుగయ్యాయి. వెడల్పు కూడా పెరిగింది. అందులో బంతి తగిలే ‘స్వీట్ స్పాట్’ ఏరియా పెరిగింది. అంతకుముందు రాకెట్లలో, బంతి గనుక అంచున తగిలితే, రాకెట్, చేతిలో తిరిగేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. దీంతో ఆట నేర్చుకునే వారు ఎక్కువయ్యారు. నేర్చిన వారి ఆటలో వేగం పెరిగింది. గోల్ఫ్‌లో టైటేనియం వాడుకలోకి వచ్చింది. అంతకన్నా మించిన మార్పులు బైసికిల్ విషయంలో వచ్చాయి. బ్రిటీష్ డిజైనర్, మైక్ బరోస్, కార్బన్ ఫైబర్ ఫ్రేమ్‌తో కొత్త రకం సైకిల్‌ను తయారుచేశాడు. 1992 బార్సెలోనా ఒలింపిక్స్‌లో క్రిస్ బోర్డ్‌మన్ అనే క్రీడాకారుడు, ఆ సైకిల్‌ను వాడి నాలుగువేల మీటర్ల పోటీని సునాయాసంగా గెలిచాడు. సైకిలు చూడడానికి అందంగా ఉండడం అటుంచి, దాని బరువు తగ్గింది. స్ట్ఫినెస్ పెరిగింది. గాలిలో సైకిలు కదిలే ఏరోడైనమిక్ ఎఫిషియెన్సీ పెరిగింది. రైడర్‌కు ఇవన్నీ అదనపు సౌకర్యాలు!
రకరకాల ఆటవస్తువుల కొరకు వాడడానికి ఎన్నో పదార్థాలున్నాయి. వాటన్నింటి గురించి గొప్ప పరిశోధన మొదలయింది. రకరకాల పదార్థాలను కలిపి వాడినందుకు వచ్చే లాభాల ఛార్ట్‌లు దొరుకుతున్నాయంటే ఆశ్చర్యం. బోటు నడపడంలో తెడ్లు, పోల్‌వాల్ట్‌లోని గడకర్ర అన్నీ పరిశోధన అంశాలయ్యాయి. వెదురు గడలు చాలా గొప్పవి కనుక అవి 1950 దాకా వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఫైబర్ గడలు వాడుతున్నారు. మొత్తానికి ఆటలలో సాంకేతిక శాస్త్రం ఒక భాగమయింది!

No comments:
Post a Comment