ఒక పోలీసాయన ఉంటాడు. చాలా మొరటుగా ప్రవర్తిస్తుంటాడు. ఇంట్లోకూడా అట్లాగే ఉంటాడేమో తెలియదు. తన పనిలో మాత్రం చాలా మొరటుగా ఉంటాడు. ఆయనకు ప్రపంచంలోని అందరూ నేరస్తులలాగా కనబడతారు. వాళ్లతో తాను మొరటుగానే ఉండాలని ఆయన అభిప్రాయం. నేరం చేసిన వారి మీద జాలి ఎందుకని భావం. తనకు అధికారం ఉంది గనుక, తన స్వంత అభిప్రాయాలు తనకున్నాయి గనుక, మొరటుగా ప్రవర్తిస్తున్నానని ఆయనకు తోచదు. తన అధికారాన్ని అనవసరంగా వాడుతున్నాననీ, ఆ అమాయకులు తనను ఎదిరించలేక పోతున్నారనీ ఆలోచన రాదు. తనకు తాను న్యాయంగా బాధ్యతాయుతంగా ఉన్నాననే అనుకుంటాడు. తానెంతో క్రూరుడినన్న సంగతి తోచనే తోచదు. మొరటుగా ఉండే ఆడ పోలీసులున్నారంటే, అనుమానం అవసరం లేదు.
అదీ మనిషి తీరు. మనకందరికీ, రకరకాలస్థాయిలో స్వంత స్వభావాలు, అభిప్రాయాలు, అనవసరంగా పుట్టిన యిష్టాయిష్టాలు ఉన్నాయి. వాటిలో కూరుకుపోయి మనం అందరినీ ఏమారుస్తుంటాము. మంచితనం, సత్యం మనలోనే ఉన్నాయనుకుంటాము. అందరూ ఇలాగే అనుకుంటారు గనుక మనం కూడా అడుగడుగునా మోసానికి, వంచనకు గురవుతాము. అయితే అన్నిసార్లూ పరిస్థితి ఒకేరకంగా ఉండదు. మనలో ఎవరికీ నిజంగా సరైన ఆలోచనలు ఉండవు. పర్‌ఫెక్షన్ ఉండదు. కానీ, మనం మరింత మంచి ఆలోచనలు చేయగలుగుతాము. ఈ సంగతిని మాత్రం మరువకూడదు.
అందరూ ఆలోచించనవసరం లేకుండా, ఆలోచించకుండా బతుకుతున్నారు. అందులో మనం కూడా ఉన్నాము. ఇది ఒకరకంగా అబద్ధం. మనకు తెలియకుండానే మనలోపల ఆలోచనలు సాగుతూ ఉంటాయి. ఉదయం లేవాలంటే ఆలోచన. మరేదో పని చేయాలన్నా, మానుకున్నా ఆలోచన ఉంటాయి. ఈ ఆలోచనలు మామూలుగా మనకు తెలియకుండానే (అచేతనలో) జరుగుతుంటాయి. వాటిని చేతనలోకి అంటే తెలిసి జరిగే స్థితికి మనమే తేగలగాలి. ఈ పని ఒకసారి జరిగితే చాలదు. ఒకనాడు జరిగితే చాలదు. అలవాటు చేసుకుంటే, మన ఆలోచనలన్నీ మనకు తెలిసి జరుగుతాయి. సమస్యలు సంతోషాలు ఎదురవుతాయి. అవన్నీ ఆలోచనల్లో ఉంటాయి. సమస్య అన్నా, సంతోషం అన్నా ఆలోచనలే! వాటన్నింటినీ మనం గుర్తించగలగాలి. ఇది చేతనయితే మన ఆలోచనల్లోనూ మన బతుకులోనూ మార్పులు వీలవుతాయి. గిరి గీసుకుని అందులోనే బతకడం, ఆలోచించడం మనిషికి మామూలే. కానీ, అందులోంచి బయటకు వచ్చి, ఎత్తులకు ఎగిసి, గొప్ప ఆలోచనలు చేయగలగడం మనిషికి చేతనవుతుంది. మనముందే ఎంతోమంది ఈ పని చేస్తుంటారు. మనం వాళ్లను గుర్తించలేకపోతాము. మనం మన మెదడు సాయంతో మన మెదడుకు పాఠాలు నేర్పగలుగుతాము. ఆలోచనలను వాడుకుని ఆలోచనలను మార్చగలుగుతాము. మనం ఇప్పుడున్న తీరునుంచి మరో తీరులోకి మారగలుగుతాము. అందుకు మనకు ఆలోచనలే ఆధారం. మారాలన్న పట్టుదల, కోరిక అవసరం. ఇదిమరెవరో చేయగల పని కాదు. ఇది మనకు మనం చేసుకోగల, చేసుకోవలసిన ఉపకారం.
ఆలోచన మనసులో ఉంటుంది. మనసు మెదడులో ఉంటుంది. వీటి బలం పెరగాలి.
ప్రతి విషయం గురించి ఏం జరుగుతున్నదీ మనం ఆలోచించగలగాలి. జరగవలసిన దాన్ని గురించి ఆలోచించగలగాలి. ఈ రెంటిలో ఏదో ఒకటే మనకుకావాలి. మరోదాన్ని మనం వదులుకోవాలి. రానివ్వకుండా ఎదుర్కోవాలి. మన ఆలోచన బలంగా సాగితే, విషయంలోని రెండువైపులూ మనకు చక్కగా కనబడతాయి. మనకు అనవసరమైనవి సులభంగా తెలుస్తాయి. మనకు తెలియకుండానే ఎన్నో పనులు మనమే చేస్తుంటాము. వాటి గురించి ఆలోచన ఉండదు. కనుక, ఆ పనుల ప్రభావానికి మనం తెలియకుండానే గురవుతుంటాము. ఆలోచిస్తే మాత్రం సంగతి అర్థమవుతుంది. కనుక ఆలోచన అలవాటుగా మార్చుకోవాలి.
*మనం మనలాగా ఆలోచించేవారి మధ్యన బతుకున్నాము. కనుక మన తీరును ఎవరూ తప్పు పట్టరు.
*ఎవరో ఒకరు మనలను తప్పుపట్టారని అనుకుందాము. మనం దుఃఖంలో మునిగిపోతాము. నిరాశకు గురవుతాము. ‘నువ్వు కూడా ఇట్లాగంటావని నేననుకోలేదు! నీవు నాకు కావలసిన మనిషివనుకున్నాను’ లాంటి అర్థంలేని మాటలు అంటాము. కొంతమంది అదేపనిగా తప్పులు పడుతుంటారు. వారిని వదిలేద్దాము. కానీ మనం మంచి కోరేవారు మనల్ని తప్పుపడితే గుర్త్తించగలుగుతున్నామా? మనకు అంత ఆలోచనా శక్తి ఉందా? ఎవరేమన్నా, ముందు ‘కాదు’ అంటుంది మనసు. కానీ, క్షణం ఆలోచించి ‘అవునా?’, ‘అవునేమో?’ అనుకోగలిగితే, అంటే ఆలోచించగలిగితే ఎంత బాగుంటుంది. అనవసరమైన మనస్తాపాలుండవు. వాదాలు ఉండవు. పైగా, ఆలోచించి మనం కాదనవలసినదేదో, మనలో ఉందని తెలుసుకుంటే, దాన్ని వదులుకునే వీలుంటుంది. ఒక్క క్షణం బాధ కలుగుతుంది! నిజమే! కానీ, మనం ఆలోచించడంలేదని అర్థమయి, విషయం తెలిస్తే మాత్రం, పశ్చాత్తాపం, మార్పు, ఆనందం వరుసగా వస్తాయి గదా!
* తప్పుడు మాటలంటాము. తప్పుడు పనేదో చేస్తాము. వెంటనే, మనలను మనం సమర్థిచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ‘అది కాదు నేననదలచుకున్నది’ అని తర్వాత అంటే లాభం లేదు. మన మాటలను, మన చేతలను మాత్రమే ఎదుటివారు అర్థం చేసుకుంటారు. మన భావాలు వారికి అర్థం కావు. కనుక తప్పు తప్పుగానే తోస్తుంది. వారికి మనం తప్పుడు మనుషులుగా గుర్తుండిపోతుంది. ఆలోచన లేని పనులవల్ల ఇలాంటి పర్యవసానాలుంటాయి. పోలీసాయనకూడా మనిషే. అతనూ కొందరితో ప్రేమగా, స్నేహంతో ప్రవర్తిస్తాడు. కొన్నిచోట్ల మొరటుగా ఉండవలసి వస్తుంది. కానీ అది స్వభావంగా మారుతుంది. దొంగతనాలు చేసే మనిషి, తన యింట్లోకి కూడా కన్నం వేసి దూరితే బాగుండదు మరి!
* బ్రతుకు భారంగా, జగము చీకటిగా కనబడవచ్చు. ఆలోచన అటువైపే ఉంటే ఇక వెలుగు ఉంటుందని కూడా తోచదు. ఇక్కడే మనిషి, సత్యాసత్యాలను, చీకటి వెలుగులను చూడగలగాలి. ఇవన్నీ ఆలోచనల నుంచి వస్తాయి. నాకు కావలసింది నాకు తెలుసు అని ముందే నిర్ణయించుకుంటే అది చీకటి అని తెలియదు. కావలసింది ఒకటి ఉంటే, కాకూడనిది, అనవసరమయినది కూడా ఒకటి ఉండాలి. ఈ వైరుధ్యాలను గురించి ఆలోచన కలిగితే, వాటిలో మనకు కావలసింది అర్థమవుతుంది. మొరటు ప్రవర్తన కూడా అవసరమే. కానీ, దానికి సమయం, సందర్భం ఉంటాయి ఆ సందర్భం తెలియాలి. మన మీద మనం నిఘా వేసుకోవాలి. ఒక సందర్భంలో మన మీద మనం మొరటుగా ప్రవర్తించాలి. ఏం జరిగినా అది ఆలోచన మీద జరగాలి! ఆలోచించండి!

చక్కటి విశ్లేషణ,మంచి టపా. అభినందనలు.
ReplyDeleteచాలా స్ఫూర్తివంతంగా, లోతైన విశ్లేషణతో రాస్తున్నారు సర్! ఇంత మంచి టపా అందించినందుకు ధన్యవాదాలు.
ReplyDelete