నాకు పుస్తకాలంటే, సంగీతమన్నానూ ఎంతో ఇష్టం.
బతుకంతా వాటితోనే సాగింది. సాగుతున్నది.
కానీ చాలా మందికి చదవడం కష్టంగా ఉంటుందని నాకు తెలుసు.
ఎవరి దారి వారిది.
కానీ నాదొక మనవి.
మీ ఇంట్లో పుస్తకాలు ఉన్నాయనుకోండి.
వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదనుకోండి.
అప్పుడు వాటి వల్ల నష్టమే గాని లాభం ఉండదు.
పుస్తకాల కొరకు ఏమయినా చేసే వారు కొందరు.
వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించే వారు మరి కొందరు.
నేను మాత్రం ఇండ్లలో ఉన్న పాత వుస్తకాలు సేకరించాలన్న ప్రయత్నంలో ఉన్నాను.
మీ వద్దగానీ మీకు తెలిసిన వారి వద్దగానీ రనికి రావనిపించిన పుస్తకాలు ఉంటే వివరాలు నాకు పంపండి.
వాటిని నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను.
పుస్తకాలు తెలుగు, ఇంగ్లీషు. హిందీ, ఉరుదూ, సంస్కృతాలలో ఏవయినా సరే వివరాలు పంపండి.
పుస్తకాలను పాడు గాకుండా చూచి నిజంగా అవసరమనుకున్న వారికి అందించే పని నేను చేస్తాను.
ఈ కార్యక్రమం త్వరలోనే ఒక ఉద్యమంగా మారనున్నదని మనవి
భవదీయుడు
గోపాలం కె బి.

చాలా మంచి ప్రయత్నం. ప్రింటెడ్ బుక్ మానవ వికాసక్రమంలో ఒక విప్లవాన్ని తీసుకు వచ్చింది. మానవుని ఆలోచనలకు రూపం కల్పించటానికి, వాటిని పంచుకోవటానికి అవకాశం కల్పించింది. మానవ సంస్కృతికి, సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు ఆధారంగా నిలిచింది. దీనిని సంరక్షించవలసిన అవసరం చాలా ఉంది. ఇది డిజిటల్ యుగమే ఐనా, మనకు కావలసిన ప్రతి పుస్తకం ఈ-బుక్ గా దొరికే అవకాశం చాలా తక్కువ కదా?
ReplyDelete