వైరస్‌లు చనిపోతాయా?
ప్రశ్న - జవాబు
November 27th, 2011
Q వైరస్‌లు చనిపోతాయా?
A సూటిగా జవాబు చెప్పాలంటే, వైరస్‌లకు మరణం లేదు. ఎందుకంటే వాటికి జీవం లేదు. జీవంలేని వైరస్‌లు మరి జీవులు ఎట్లా అయినవని ప్రశ్న పుడుతుంది. అదే విచిత్రం. వాటిలో డిఎన్‌ఏ, లేదా ఆర్‌ఎన్‌ఏ అనే న్యూక్లిక్ ఆమ్లాలు ఉంటాయి. వాటి పని తీరును నిర్థారించే సమాచారం ఆ ఆసిడ్‌లలో ఉంటుంది. జీవులన్నింటిలోనూ ఇదే పద్ధతి గనుక, వైరస్‌లను జీవులుగా అంగీకరించక తప్పదు. కానీ, అవిసంపూర్ణ, స్వతంత్ర జీవులు కావు. తమంత తాముగా మనుగడ సాగించలేవు. మరేదో జీవిలో ఉన్నంత కాలమే వాటి మనుగడ సాగుతుంది. అక్కడ అవి తామున్న ప్రాణినుంచి జన్యుసమాచారాన్ని దొంగిలిస్తాయి.
ఇక్కడ ఇంకొకప్రశ్న పుడుతుంది. స్వంత జీవం, ఉనికి లేని ఈ వైరస్‌లు, చావు లేకుండా ఎంతకాలం కొనసాగుతాయి. ఎంతకాలం ఇన్‌ఫెక్షన్ కొనసాగుతుంది? అన్నవి అనుమానాలు. ఒక శరీరంలోకి ప్రవేశించకుండా బయటి వాతావరంలో గనుక ఉండిపోతే, హెచ్‌ఐవి (ఎయిడ్స్), ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్‌లు కొన్ని గంటలకన్నా ఎక్కువ కాలం ఉండవు. అవి చనిపోతాయని కాదు గానీ, పని చేయలేకుండా సమసిపోతాయి. పరిశోధకులు, వాటిని పట్టి ఉంచి పరిశీలించడానికి చాలా కష్టపడతారు. అదే మశూచి (స్మాల్‌పాక్స్) వైరస్, ఎక్కడ పడి ఉన్నా సంవత్సరాలపాటుండి, అవకాశం దొరికితే చాలు తిరిగి ఇన్‌ఫెక్షన్‌కు కారణం కాగలుతుంది. 1787లో బ్రిటిష్ డాక్టర్ల కారణంగా ఈ వైరస్ ఆస్ట్రేలియాకు చేరిందట. అది అక్కడ రెండు సంవత్సరాలపాటు పడి ఉండి, ఆ తరువాత స్థానిక అబూరిజిన్స్‌లో ప్రవేశించి పెద్దఎత్తున మశూచి రావడానికి కారణమయిందట!
-----

Q కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు వేసే ఎర్రరంగు
మిగతా రంగులకంటే త్వరగా వెలిసిపోతుంది.. ఎందుకు?

A ఎర్రరంగులు మామూలుగా వెలుగుకు ఎక్కువ ప్రభావితమవుతాయి. ఎండలోని యువి కిరణాల కారణంగా ఎర్రరంగు ముందు విరిగిపోతుంది. ఈ విషయం ఒక్క వాహనాలలోనే కాక పుస్తకాలు, పెయింటింగులు మొదలైన ఎన్నో చోట్ల కూడా కనబడుతుంది. ప్రస్తుతం కార్లకు, మిగతా వాహనాలకు వేస్తున్న రంగులు బాగా అభివృద్ధి చెందిన రకం. కనుక ప్రస్తుతం ఎర్రరంగు అంతగా వెలిసిపోవటం లేదు. నీలం రంగు తొందరగా పాడవుతుందన్న భావం కూడా ఉందిప్పుడు. రంగుల మీద ఎండ ప్రభావాన్ని బట్టి వాటి మన్నిక ఉంటుంది.
No comments:
Post a Comment