ఈ వ్యాసం ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది.
తేరి జీత్ అమర్ హోగీ
- కెబి గోపాలం
October 12th, 2011
"తు ఇత్‌న జో ముస్కురా రహే హో, క్యా గమ్‌హై జిన్‌కో చుపా రహేహో" - అంటూ మొదలయే పాట, సినిమా పాట, విని ఆదిలాబాద్‌లోని సదాశివగారికి ఉత్తరం రాశాను. మొత్తం గజల్ దొరికితే బాగుండును అన్నారాయన. గమ్, గజల్ అన్న మాటలలోని ‘గ’ అనే అక్షరం అసలయిన రూపాన్ని తెలుగులో రాయడం కుదరదు. అది ఒక విచిత్రమయిన ధ్వని ఉరుదూ, కాదు ఉర్దూ భాష తీరే అంత. ఇత్న అనగూడదు, ఇత్‌న అనాలి, జిస్‌కో అనాలి. గజల్ పాడడంలో వచ్చిన చిక్కే ఇది. అందుకేనేమో శాస్ర్తియ సంగీతంలో గజల్‌కు సరయిన స్థానం అందలేదు. ఠుమ్రీ, ఠప్పా, దాద్రా, చెయితీలు హిందుస్తానీ కచేరీలో వినిపించాయి గానీ, గజల్‌లో వినిపించలేదు. అటు కవితా ప్రపంచంలోనూ, ఇటు సంగీతంలోనూ గజల్‌ది ప్రత్యేకమయిన స్థానం! కొందరికే అర్థమవుతుంది. పాడడం కూడా కొందరికే చేతనవుతుంది అనుకున్న గజల్‌ను అందరికీ పంచిన జగ్‌జీత్ సింగ్, తన దుఃఖాన్ని దాచుకుని, అందరికీ ఆనందం పంచాడు. ఇంతగా చిరునవ్వుచుంటివేల, దాచదలచిన దుఃఖమదేమి చెప్పను!’ అనిగదూ పైన పేర్కొన్న గజల్ ప్రారంభం మాటలకు అర్థం.
జగ్‌జీత్ అసలు సిసలయిన పంజాబీ సిఖ్ సంప్రదాయంలో పెరిగాడు. అసలు పేరు జగ్‌మోహన్. తండ్రి పేరును జగ్‌జీత్‌గా మార్చాడు. జగ్‌జీత్ కూడా ముందు పండిట్ ఛగన్‌లాల్ శర్మ, తర్వాత సేనియా ఘరానా గాయకుడు ఉస్తాద్ జమాల్‌ఖాన్‌ల వద్ద శాస్ర్తియ సంగీతం నేర్చుకున్నాడు. ఖయాల్, దుఖ్రా, ధ్రుపద్‌ల లోతులను రుచి చూచాడు. ‘‘సంగీతం ప్రేరణ కలిగించేదిగా ఉండాలి. అంతేగాని, అందులో పోటీ ఏమిటి?’’ అని ఇటీవల ప్రశ్నించాడా మహా గాయకుడు. మన సంగీతంలో గొప్ప లెక్కలు, వ్యాకరణం ఉన్నాయి. వాటి గురించి తెలియకుండానే పాడడం తప్పు అని ఆయన అభిప్రాయం.
జగ్‌జీత్ సినిమా రంగంలో గాయకుడుగా చేరాలని ప్రయత్నించాడు. కానీ, అక్కడ సరయిన ఆదరణ అందలేదు. అదే మంచిదయింది. అతని చూపు గజల్ వేపు మళ్లింది. 70 దశకంలో కూడా గజల్ సిసలయిన శాస్ర్తియ సంగీతం ఆధారంగా నడిచేది. భాష తెలియదు, అర్థం కాదు. శాస్ర్తియ సంగీతం, అందరికొరకు కాదన్న భావం మనదేశంలో నాటి నుంచి నేటి దాకా బలంగా సాగుతూనే ఉంది. జగ్‌జీత్ సింగ్, ఆ పరిస్థితిని మార్చి మరోదారి పట్టించాడు. సంగీతయాత్ర ప్రారంభంలోనే అతనికి చిత్రాతో పరిచయం అయింది. అది పరిణయానికి దారి తీసింది. జగ్‌జీత్, చిత్రాలు గజల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం మొదలయింది. ‘‘పత్తా పత్తా, బూటా బూటా, హాల్ హమారా జానేహై? లాంటి వారి యుగళగీతాలు నేటికీ అందరికీ గుర్తున్నాయి. తామున్నచోట విజయం సాధించి, తలలో నాలుకగా నిలిస్తే అప్పుడు సినిమావారు జగ్‌జీత్‌ను ఆహ్వానించారు. జగ్‌జీత్ సినిమాలో కూడా పాడాడని చెప్పాలి. అతను కేవలం గజల్ గాయకుడు. చివర కాలంలో శబద్ - కీర్తన్‌లు పాడినా అతను గజల్ గాయకుడే.
జగ్‌జీత్ మొత్తం 80 ఆల్బమ్‌లు రికార్డ్ చేశాడు. గజల్ వినే వారున్న ప్రతిచోటా పాడి అందరినీ మైమరపించాడు. అతనికి కాదనడం చేతగాదు. ఆ మధ్య ఢిల్లీ పక్కన గుడ్‌గాఁవ్‌లో ఒక కచేరీ చేశాడతను. మన పంజాబీ గాయకుడన్న అభిమానం తప్పితే, అక్కడివారికి సీరియస్ సంగీతం తలకెక్కదు. ఆ ప్రాంతమంతా దుమ్ముగానూ, గోలగానూ ఉందట. అయినా ఓపికగా జగ్‌జీత్, వారందరికీ నచ్చేతీరులో కార్యక్రమాన్ని సాగించాడు. అది అతని పద్ధతి. మిత్రుడు, క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ, మనవాడుగదా, అన్న భావంతో పంజాబీ గాయకుడుగా గుర్తింపు పొందడం గురించి వ్యాఖ్యానించాడు. ‘ఎవ్రీ డాగ్ హావ్ ఇట్స్ డే!’ (ప్రతి కుక్కకు కూడా ఒకరోజు అవకాశం వస్తుంది) అని జగ్‌జీత్ జవాబు.
జగ్‌జీత్ పాడిన హిట్ పాటలను ఏకరవు పెట్టడం అర్థంలేని మాట. అతను పట్టిందల్లా బంగారమే. గీత రచయిత నిదా షాజ్లీ లాంటి వారు తమ గజల్‌ను జగ్‌జీత్ పాడితేనే అర్థం, భావం, సరిగా పలుకుతాయని భావించారంటే అర్థం చేసుకోవచ్చు. భాష, ఉచ్చారణ, కవి భావం సరిగ్గా అర్థం చేసుకుని పాడడం జగ్‌జీత్‌కు గుర్తింపు. ఒక్కమాట మీద అనుమానం వచ్చినా, నేరుగా రచయితనే సంప్రదించి, కనీసం ఫోన్‌లో నయినా దాన్ని సరిగ్గా పలికిన దాకా ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఎన్నో. ‘అలాంటివారికి పద్మభూషణ్‌లు మరేవో గౌరవాలు ఒక వేపయితే, ప్రపంచమంతటా అభిమానుల పరంపర ఇంకోవేపు. పాక్, ఆప్ఘాన్ దేశాల అభిమానులు, ఇంటర్‌నెట్‌లో అందిస్తున్న సంతాప సందేశాలు వెల్లువ అందుకు సాక్ష్యం’!
దుఃఖాన్ని వెనక్కు తోసి, చిరునవ్వులు పంచడం అందరికీ చేతగాదు. చిత్రా జగ్‌జీత్‌ల జీవితం పాటలాగా సాగుతూ ఉంది. ‘హోంధోంసే భూలో తుమ్, మేర గీత్ అమర్ కర్‌దో, బన్‌జాఓ మీత్ మెరే, మేరి ప్రీత్ అమర్ కర్‌దో! (నీ పెదవులతో తాకి, నా పాటకు అమరత్వాన్నివ్వు! నా స్నేహాన్ని అంగీకరించి, నా ప్రేమకు అమరత్వాన్నివ్వు!) లాంటి పాటలు ఆ జీవితాలకు బాటలయ్యాయి కానీ, చిత్ర మొదటి వివాహం ద్వారా కలిగిన బిడ్డడు పోయాడు. 1990లో చిత్రా, జగ్‌జీత్‌ల బిడ్డడు వివేక్ పోయాడు. ఆ ప్రణయ స్వరాలు ఒక్కసారిగా మూగవయ్యాయి. చిత్ర నేటికీ గొంతు విప్పలేదు. అభిమానుల ప్రోద్బలం మీద జగ్‌జీత్ మాత్రం బరువుగా పాటను సాగించాడు. అతని గొంతుకలో ధ్వనించే ‘మాయూసీ’ అనే లక్షణం గీతాలకు కొత్త అర్థాలు తోచేలా చేసింది. భక్తి సంగీతంతో మొదలయిన గీతార్చన తిరిగి అదే దారికి చేరింది.
జగ్‌జీత్ గురించి ఎంత చెప్పినా తక్కువే!
‘జగ్‌నే ఛీనా ముఝ్ సే, ముఝే జో భి లగా ప్యారా!’ నాకిష్టమయినదాన్నంతా ఈ ప్రపంచం అపహరించింది! ప్రపంచం తీరే అంత!
మంచి పాటే ఉంటే ప్రపంచమెందుకు?
సుగానం యద్యస్తి విశ్వేన కిం?

No comments:
Post a Comment