Wednesday, December 21, 2011

ఎత్తవోయి నీ జయజెండా - పాట

వంశీ తన బ్లాగులో ఈ పాట పాఠం ప్రచురించాడు.
నేను పాట కలుపుతున్నాను.
ఈ లోగా బాపు గారు గీసిన ఈ బొమ్మ కనిపించింది.
టంగుటూరి సూర్యకుమారి గారి గొంతు, రూపం ఒకదానికొకటి పోటీ.




ఎత్తవోయి నీ జయజెండా

విప్పవోయి నీ ప్రియకాండా

స్వతంత్రబారత చరితచ్ఛాయలు
బ్రహ్మాండము నిండా
ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

ఉదయాస్త్రాదుల తలవాకిండ్లను
సేతు శీతనగ శిఖరాగ్రములను

మువ్వన్నియలును పొదిగీ పొందీ
ఏకస్వామిక రేఖ నలందా
ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

కపటవంచనా నిపుణ తంత్రముల
మారణహింసా మధిత చిత్తమయి

ద్వేషలోభములు తెర్లి జ్వలింపగ
మసలి భ్రమించేమనుకుల మరయగ
ఎత్తవోయి నీజయజెండా

మానవమైత్రీ మంగళతంతువె
మంత్రాంగములకు మూలసూత్రమని

సత్యాగ్రహ ఋషి చాటిన పాఠము
ఎల్లజాతులను పల్లవిపాడా

ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

1 comment:

  1. ఎగరవేయి ఎగరవేయి మువ్వన్నెల జెండా
    అది నీకు తెచ్చి పెట్టు బలం గుండె నిండా
    పదం పాడి కదం తొక్కు చైతన్యం వైపు
    అది నిన్ను నిలుపు గెలుపు బాట ఆకాశం వైపు
    చూపించు తెల్లోడికి తెలుగు వాడి తడాఖ
    అది వాడి గుండెల్లో చిచ్చు రగల్చే దాక

    one of my small attempts in writing... inspired from winning a project against British competitor :)

    ReplyDelete