పక్క పక్క ఇళ్ళలో ఉండే గృహిణులు ‘పని తెమిలిందా?’ అంటూ ఒకరినొకరు పలకరించుకుంటారు. వాళ్లకు నిజానికి ఒక పట్టాన పని తెమలదు. ఒకటి ముగియకముందే మరొకటి కనబడుతుంది. ఒకే సమయంలో రెండు మూడు పనులను చేస్తూ, చక్కని ప్లాన్ ప్రకారం వారు ముందుకు సాగుతుంటారు. ‘దాని కోసం ప్రత్యేకంగా చోటు కల్పిస్తే తప్ప ఏ పనీ జరగదు’ అంటాడు జిమ్ మెక్‌కే! అంటే, ప్రతి పని కొరకు ప్రత్యేకంగా, మనమే కొంత సమయాన్ని కేటాయించాలని అర్థం. కొంతమంది స్నానానికి అరగంటకన్నా ఎక్కువ సమయం తీసుకుంటారు. మరికొంతమంది అయిదు నిమిషాల్లో బయటపడతారు. వీరిలో ఎవరిది సరైన పద్ధతి, అంటే, జనాబు కష్టం. ముందుగా, ఒక పని జరగాలన్న నిర్ణయం జరగాలి. ఆ తర్వాత, ఆ పనికి తగినంత సమయాన్ని కేటాయించాలి. అన్ని పనులకూ, తగినంత సమయం కేటాయిస్తే, కొంతమందికి, దినంలో ఇరవై నాలుగు గంటలు సరిపోవు. అప్పుడు పనుల ప్రాముఖ్యతను గుర్తించవలసిన అవసరం ఉంటుంది. పనులను త్వరగా పూర్తిచేయవచ్చు. ఒకేసారి, వీలయితే రెండు పనులను చేయవచ్చు. ఫరవాలేదనిపిస్తే, ఒకటి రెండు పనులను వాయిదా వేయవచ్చు. ఇదంతా కాక, సమయం ఎక్కువగానూ, పని తక్కువగానూ ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు, రేపటి పని ఇవాళ చేయవచ్చు. కొంత విశ్రాంతి తీసుకోవచ్చు.
ఏ పనయినా జరగాలంటే, ముందు ఆ పని ఉందని మనం గుర్తించాలి. దానికి కాలం కేటాయించాలి. ఉదయం నిద్ర లేవగానే, ఆ రోజు చేయవలసిన పనులన్నింటినీ గుర్తు చేసుకోవడం ఒక మంచి అలవాటు. చేయవలసిన పనులకు కాలం కేటాయించి వాటిని కాగితం మీద రాసుకుని కనబడే విధంగా ముందు అమర్చుకోవడం ఇంకా మంచి అలవాటు. నిన్న వాయిదా వేసిన పనిని నిన్ననే మరిచిపోతే, దాన్ని వాయిదా అనలేము. రేపటికి షెడ్యూల్ చేసిన పనిని, ఇవాళ చేయవలసిన అవసరం, చేసే అవకాశం వస్తే, చేయడం మంచిది. అసలు ఏ పనినయినా వాయిదా వేయడంకన్నా ముందే చేయడం వీలవుతుందేమో గమనించడం గొప్ప అలవాటు. ఇట్లా చేయవచ్చునని చాలామందికి తోచదు!
షెడ్యూలింగ్:
ఒక పని చేయాలని అనుకోవడం బాగానే ఉంటుంది. మనసులో అనుకున్న పనిని వెంటనే మొదలుపెడితే సమస్య ఉండదు. ఒకదాని తరువాత మరొకటిగా చేయవలసిన పనులు వరుసగా ఉంటాయి. వాటిలో ఏది ముందు, ఏది తర్వాత అన్న నిర్ణయం జరగాలి. వాటిని రాసుకుని ముందుంచుకుంటే, సులభంగా గుర్తుంటాయి. ముగిసిన పనులను గుర్తులతో మార్క్ చేస్తూ ముందుకు సాగవచ్చు. ఒక పని ఉన్నా పనే. వంద పనులున్నా పనే. కానీ, వాటి క్రమం ముఖ్యం! లేకుంటే అన్ని పనులూ ఒకేసారి తేనెటీగలలాగ మెదడులో రొద చేస్తాయి. దినంలో పనితోబాటు పనికాని పనులు కూడా కొన్ని ఉంటాయి. తిండి తినాలి, పడుకోవాలి, మరికొన్ని అలాంటి పనులకు కూడా సమయం కేటాయించక తప్పదు. అన్నీ క్రమంగా జరుగుతున్నాయనుకుంటే, అర్థాంతరంగా కొన్ని అవాంతరాలు వచ్చి పడతాయి. అప్పుడు షెడ్యూల్‌ను గమనిస్తే, పని ముందుకు సాగవలసిన క్రమం గురించి సూచనలు అందుతాయి.
షెడ్యూల్ ఒక నాటికే కాదు:
సంవత్సరం, నెల, వారం వారీగా కూడా పనులకు పట్టిక తయారు చేయవచ్చు. చేయడం అవసరం కూడా. పండుగలు, పుట్టిన రోజులు, మరిన్ని అలాంటి సందర్భాలు గుర్తుంచుకుంటే, పని షెడ్యూల్ సక్రమంగా జరుగుతుంది. వేసుకున్న షెడ్యూల్‌ను తరచూ చూడటం ఎంతో అవసరం. పనుల ప్రయారిటీ, అంటే ప్రాముఖ్యం మారుతుంది. కనుక వాటి సమయం సందర్భం మార్చవలసిన అవసరం కనబడుతుంది. కొన్ని పనులు ‘ఇక అనవసరం’ అని కూడా అనిపించవచ్చు. వారం షెడ్యూల్‌ను ప్రతి నిత్యం ఒకటికి రెండుసార్లు గమనించినట్లయితే, చేయవలసిన పనులకు తగిన హంగులు, ఏర్పాట్లు ముందే కుదుర్చుకోవచ్చు. ఇక నిత్యం షెడ్యూల్‌ను గంటకు ఒకసారయినా చూడాలి. ‘నాకు అంత పని లేదుగదా!’ అని ఎవరికైనా అనిపిస్తే, వారంత అదృష్టవంతులు మరొకరు లేరనవచ్చు. లేదా వారు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారనయినా అర్థం! మనసును పనులు లేదా పని మీద ఫోకస్ చేస్తే, క్రమం సాగుతుంది. గజిబిజి ఉండదు.
తగినంత సమయం:
ఒక పనిని ఎంతసేపయినా చేయవచ్చు. సమయాన్ని బట్టి పని కూడా విస్తరిస్తుందని ఒక మాట ఉంది. దాన్ని పార్కిన్‌సన్ లా అంటారు. కొంతమంది చిన్న పనిని, స్నానంలాగా, మరీ ఎక్కువ సేపు చేస్తారు. మరికొంతమంది పనిని సులభంగా, త్వరగా చేయగలమని తప్పుగా అంచనా వేస్తారు. తగినంత, అన్న సమయానికి మరో నాలుగు నిమిషాలు కలపడమే మంచి పద్ధతి. అనవసరంగా మరీ ఎక్కువ సమయం కేటాయిస్తే అది కాలయాపనవుతుంది. అట్లాకాక, అనుకున్నదానికి మరికొంచెం సమయం కలిపితే మంచిది. పని ముగిస్తే, అనుకున్న సమయానికి ముందే ముగించిన తృప్తి కూడా మిగులుతుంది. ఒక సమయానికి అవుతుందన్న పని కొన్నినిమిషాలు ఆలస్యమయినా అసంతృప్తి. రేపు అనుకున్న పనిని ఇవాళ అందించగలిగితే, అదొక తృప్తి! కేటాయింపులు వాస్తవికంగా ఉంటే ఇది వీలవుతుంది.
మనసు -శరీరం:
కొంతమంది ఉదయం పూట హుషారుగా పని చేయగలరు. మరి కొంతమందికి మరో సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికివారు తమ శరీరం, మనసు తత్వాన్ని గుర్తించుకోవాలి. ఎక్కువ జాగ్రత్త, శ్రద్ధ, సృజన, ఆలోచన అవసరమయిన పని మనం ‘పీక్’లో ఉండే సమయానికి షెడ్యూల్ చేసుకుంటే బాగా వస్తుంది. మధ్యాహ్నం ఒక కునుకు తర్వాత బాగా పని చేయగలను, అనుకుంటే, ముఖ్యమయిన పనులు అప్పుడే చేయడం మేలు.
వేసుకున్న షెడ్యూల్ అదే క్రమంలో జరగదన్న సంగతి గుర్తుంచుకోవాలి. నిజానికి దినం గడిచిన తర్వాత, అనుకున్నదేమిటి, జరిగిందేమిటని పరిశీలిస్తే, మరుసటి రోజు పథకం మరొక రకంగా వేయవచ్చు! త్వరలోనే పథకానికి, పనికీ, పనులకూ ఒక పద్ధతి ఏర్పడుతుంది.
చదువుతున్నారు గదా! తరువాత ఏం చేయాలనుకున్నారు?

No comments:
Post a Comment