January 9th, 2012
*తేమగా ఉండే గాలి వెచ్చగా కూడా ఉంటే ఎత్తులకు చేరుతుంది. అక్కడ చల్లదనం ఉంటుంది.
*ఆ కారణంగా తేమ దుమ్ము, బూడిద, సూక్ష్మజీవుల వంటి పదార్థాల మీద చేరి దట్టంగా మారుతుంది. నీరు పdలస్ ఆధారం (దీన్ని సీడ్ లేదా విత్తనం అంటారు) ప్లస్ పైపైకి లాగే శక్తి కలిస్తే మేఘం లేదా మబ్బుపుడుతుంది.
*నీరు లేదా తేమ ఎక్కువగా ఉంది. సీడ్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. అప్పటికే తయారయిన మంచు కణాలుకూడా సీడ్‌గా పనిచేస్తాయి. ఒకేచోట తేమ సమకూరిన కొద్దీ, పైకి లాగే శక్తికి వీలుగానంత బరువుగా మారతాయి నీటి చుక్కలు. అంటే, అవిక కిందికి వర్షంగా పడక తప్పదు!
*మబ్బులు మరీ ఎక్కువగా ఉంటే, వేడిమీ ఈ లోపలే చిక్కుబడి వాతావరణం వేడెక్కుతుంది!
*మబ్బులలో కొన్ని మరీ ముత్యాల్లా మెరిసిపోతుంటాయి. వాటిని ముత్యం మేఘాలనే అంటారు. వాటిలోని మంచు స్ఫటికాలు మరీ సన్నవిగా ఉంటాయి. వెలుగును మరింత ప్రతిఫలింపజేసినందుకు ఆ తళతళ కనబడుతుంది. ఈ రకం మబ్బులు 10నుంచి 15 మైళ్ల ఎత్తులో ఉంటాయి.
*ఈ ముత్యం మేఘాల కారణంగా, ఓజోన్ పొరకు నష్టం ఏర్పడుతుంది.
*వాతావరణంలో మబ్బులను పైకి లాగే శక్తికి సమంగా, గాలివాటూ కిందకు కూడా లాగుతుంటే మేఘాలు గుండ్రంగా కదులుతాయి. ఆ తరువాత తుఫానువచ్చే వీలుంటుంది. కానీ ఈ రకంగా రోల్ అయ్యే మేఘాలు ఎంతో అందంగా, ఆసక్తికరంగా కనబడతాయి.
*భూమి నుంచి 50 మైళ్ల ఎత్తున కూడా మబ్బులు ఏర్పడతాయి. రాత్రిపూట మెరుస్తుండే ఈ మబ్బులు నీలం కలిసిన తెలుపు రంగులో ఉంటాయి. ఇవి పగటి పూట కనబడవు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత, ఆ క్రింద నుంచి వచ్చే వెలుగులో ఇవి తళతళలాడతాయి.
*1853లో క్రకటోవా అగ్నిపర్వతం పేలిన తరువాత ఈరాత్రి మబ్బులు కనబడడం మొదలయింది.
*2010 జూన్‌లో, దక్షిణ డకోటా (యు.ఎస్)లో వడగళ్ళవాన కురిసింది. అంతగా పెద్ద వడగళ్లు ముందెన్నడూ కురవలేదు. అప్పుడు పడ్డ ఒక మంచు ముద్ద రెండు పౌండ్ల బరువుంది. ఫుట్‌బాల్ కన్నా కొంచెం పెద్దదిగా ఉందది!
*ఎత్తులో మేఘాలుండేచోట, గాలివాటు, ఒత్తిడి విచిత్రంగా ఉంటాయి. 2007లో జర్మన్ పారాగ్లైడింగ్ చాంపియన్ ఈవా విస్నియేర్స్‌కా గ్లైడింగ్ చేస్తూ క్యుములోనింబస్ మబ్బులకు దగ్గరగా ఎగిరింది. గాలి ఆమెను 32,000 అడుగుల ఎత్తుకు లాక్కుపోయింది. ఆక్సిజన్ అందకుండా పోయినందుకు ఆమె మూర్ఛపోయింది. 23,000 అడుగుల ఎత్తున ఆమెకు తిరిగి తెలివి వచ్చింది!
*క్యుములోనింబస్ మేఘాలు తక్కువ ఎత్తులో ఉంటాయి. వాటి చుట్టు గాలివాటం చెప్పరాని రకంగా క్షణానికొక తీరుగా మారుతుంటాయి. సాధారణంగా విమానం పైలట్లు అందుకే ఈ రకం మేఘాలగుండా ప్రయాణించడానికి ఇష్టపడరు!
*నిజానికి విమానాలు వాటికన్నా ఎత్తులో ఎగురుతుంటాయి!
No comments:
Post a Comment